శ్రీదేవి వర్ధంతి: అమ్మా.. ప్రతీ రోజూ మిస్ అవుతున్నాం.. నీవు లేని లోటు.. జాహ్నవి భావోద్వేగం
అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవి మరణం భారతీయ సినిమా పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సినీ ప్రపంచాన్ని పూర్తిగా విషాదంలోకి నెట్టింది. ఆమె మరణం ఇప్పటికీ అభిమానులను, సన్నిహితులను వెంటాడుతూనే ఉంటుంది. ఫిబ్రవరి 24వ తేదీ శ్రీదేవి రెండో వర్ధంతి. ఈ సందర్భంగా కూతురు జాహ్నవి కపూర్ మరోసారి విషాదంలో కూరుకపోయారు. తన తల్లి మరణం గురించి భావోద్వేగమైన వ్యాఖ్యలు చేశారు. ఇంతకు ఆమె ఏమన్నారంటే..

శ్రీదేవి మరణం తర్వాత
శ్రీదేవి మరణం తర్వాత ఆమె ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ అప్‌డేట్స్ కూడా నిలిచిపోయాయి. అయినా ఆ అకౌంట్‌లో అభిమానులు, ఫ్యాన్స్ ఇప్పటికీ శ్రీదేవిని తలుచుకొని బాధపడటం, ఆమె గురించి మెసేజ్‌లు పంపడం చూస్తుంటాం. తాజాగా పలువురు శ్రీదేవి మరణంపై ఎమోషనల్ అయ్యారు. మీరు ఈ లోకాన్ని వీడి రెండేళ్లు గడిచినా.. ఆ విషాదం తాలూకు గాయాలు మానలేదు అంటూ కొందరు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

శ్రీదేవి అకాల మరణంతో
శ్రీదేవి ఆకాల మరణంతో జాహ్నవితోపాటు కుటుంబ సభ్యులు, సన్నిహితులు విషాదంలో కూరుకుపోయారు. తన తల్లిని గురించి ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఓ మెసేజ్ గుండెను తరిగేసేలా ఉంది. అమ్మా నిన్ను తలుచుకొన్న ప్రతీసారి నా గుండె బాధతో బరువు ఎక్కుతుంది. కానీ ఎప్పుడూ చిరునవ్వుతోనే ఉంటాను. ఎందుకంటే నా మనసు నిండా నీవే ఉన్నావు కదా అంటూ జాహ్నవి ట్వీట్ చేశారు.
ప్రతీరోజు మిస్ అవుతున్నా..
అమ్మా నిన్ను ప్రతీరోజు మిస్ అవుతూనే ఉన్నాం. మీరు లేని లోటు ఎవరూ పూడ్చలేనది. విధిరాతతో మా జీవితాల్లో విషాదం నిండిపోయింది. నీ జాపకాలతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రతీ క్షణం నీ ఆలోచన్లతోనే గడుపుతున్నాం అంటూ తల్లితో కూడిన ఓ ఫోటోను జాహ్నవి ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసింది.
Recommended Video


ఫిబ్రవరి 24న మహా విషాదం
దుబాయ్‌లో కుటుంబ పెళ్లి వేడుక కోసం వెళ్లిన శ్రీదేవి ఫ్యామిలీ ఊహించని విషాదానికి గురైంది. 2018 ఫిబ్రవరి 24న జుమెరియా ఎమిరేట్స్ హోటల్‌లోని 2201 గదిలోని బాత్ టబ్‌లో ప్రమాదవశాత్తూ మునిగి శ్రీదేవి మృత్యుపడ్డారు. ఈ వార్తతో ఖుషీ కపూర్, జాహ్నవి కపూర్, బోనికపూర్‌తోపాటు కుటుంబంలో ప్రతీ ఒక్కరు కన్నీరుమున్నీరయ్యారు.

శ్రీదేవి మరణంతో ఏకమైన కుటుంబం
శ్రీదేవి మరణానికి ముందు బోనికపూర్ తొలి భార్య సంతానంతో విభేదాలు ఉండేవి. అయితే శ్రీదేవి మృతి తర్వాత బోని తొలి భార్య సంతానం అర్జున్ కపూర్; అన్షులా కపూర్ చొరవ తీసుకొని జాహ్నవి, ఖుషీకి అండగా నిలిచారు. ఇటీవల శ్రీదేవి కోరిక మేరకు తమిళంలో పింక్ సినిమాను బోని నిర్మించడం తెలిసిందే.


Click it and Unblock the Notifications











