మోహన్ బాబుతో సౌందర్యకు అలాంటి రిలేషన్.. ఆస్తి విషయంలో జరిగిందిదే.. ప్రముఖ నిర్మాత వెల్లడి
ప్రముఖ నటి, దివంగత సౌందర్య గురించి తెలుగు ప్రేక్షకులకు స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. కన్నడకు చెందిన సౌందర్య తెలుగు ఆడియెన్స్ కు కూడా ఎంతో దగ్గరైంది. టాలీవుడ్ లోనే సౌందర్య మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక్కడ ఆమెకు గుర్తుండిపోయే సినిమాలు ఉండటం విశేషం. ఇక ఎలాంటి ఎక్స్ పోజింగ్ లేకుండా, ఎలాంటి సినిమా అయినా సంప్రదాయ లుక్ లో కనిపించి ఆకట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కన్నడ, తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం చిత్రాల్లోనూ నటించి మెప్పించింది సౌందర్య. బడా హీరోలకు జోడీగా నటించి మెప్పించింది.
అయితే, సౌందర్య అభిమాని ఒకరు ఖమ్మం రూరల్ కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో మళ్లీ ఈ హీరోయిన్ పేరు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గ్గా మారిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబుపై ఖమ్మం జిల్లా రూరల్ సత్యనారాయణపురానికి చెందిన చిట్టిబాబు ఏసీపీకి ఫిర్యాదు చేయడంతో అగ్గిరాజుకుంది. ఆయన ఫిర్యాదులో సౌందర్య ఆస్తి కోసమే మోహన్ బాబు హత్య చేయించాడని, అతనిది సహజమరణం కాదని కూడా పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదంపై ఇంత వరకు మోహన్ బాబు స్పందించలేదు. మరోవైపు సౌందర్యకు, మోహన్ బాబుకు దగ్గరగా ఉన్న పలువురు తమ అభిప్రాయలను వ్యక్తం చేశారు.

ఇక తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ కూడా స్పందించారు. మోహన్ బాబు సౌందర్య ఆస్తిని కాజేశాడనే వివాదంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అదంతా అవాస్తవమని, మోహన్ బాబు అలాంటి వ్యక్తి కాదని చెప్పుకొచ్చాడు. హైటెక్ సిటీకి దగ్గర్లో సౌందర్యకు స్థలాలున్న మాట వాస్తవమే కానీ అది మోహన్ బాబు ఆక్రమించుకోలేదని తెలిపారు. తనకు తెలిసినంత వరకు మోహన్ బాబు సౌందర్యకు వీలైనంతగా సాయం చేశారే తప్ప కీడు చేయలేదని చెప్పుకొచ్చారు. మోహన్ బాబు సౌందర్య ఆస్తిని లాగేసుకున్నాడనే ఆరోపణలపై ఎలాంటి ఆధారాలు లేవన్నారు.
మరో షాకింగ్ విషయాన్ని కూడా చెప్పారు. సౌందర్య స్థలాన్ని కొందరు రౌడీలు కబ్జా చేయడంతో మోహన్ బాబు, పరిటాల రవి విడిపించారని కూడా చెప్పారు. మోహన్ బాబు సెలబ్రెటీ, ఉన్నత స్థాయి కలిగిన మోహన్ బాబుపై ఇలాంటి బేస్ లెస్ ఆరోపణలు సాధారణమన్నారు. తన పెళ్లివరకు సౌందర్యకు మోహన్ బాబుతో స్నేహపూర్వక సంబంధాలే ఉన్నాయని తెలిపారు. ఇక సౌందర్య చనిపోవడానికి మోహన్ బాబు హస్తం ఉందనడం పూర్తిగా హాస్యాస్పదమన్నారు. సౌందర్య చనిపోయాక 21 ఏళ్లకు మోహన్ బాబుపై ఇలాంటి కేసు నమోదవడం చూస్తేనే అది కావాలని చేసిన చర్యగా అర్థమవుతున్నదని అభిప్రాయపడ్డారు.
మరోవైపు సౌందర్య ఆస్తి విషయంలో మోహన్ బాబు కుట్ర ఉందనేది వార్తలను ఇప్పటికే ఆమె భర్త రఘు ఖండించిన విషయాన్ని కూడా నిర్మాత నట్టి కుమార్ గుర్తుచేశారు. ఇక మోహన్ బాబు గారి ఇంట్లో జరుగుతున్న వివాదాల విషయానికొస్తే... ప్రతి కుటుంబంలో ఏదోక సందర్భంలో మనస్పార్థాలనేటివి సర్వసాధారణమన్నారు. ఇవ్వాళ దెబ్బలాడుకున్న వారే రేపోమాపో కలిసి ఉంటారని, అందులో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మంచు ఫ్యామిలీ మళ్లీ అభిమానులు కోరుకున్న విధంగానే కలిసి ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











