మోనాల్ గజ్జర్ సంచలన ప్రకటన: తల్లిని తీసుకొచ్చి సెట్ చేసుకుని.. అఫీషియల్‌గా హైదరాబాదీని అయ్యానంటూ!

మోనాల్ గజ్జర్.. కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా మారుమ్రోగిపోతోన్న పేర్లలో ఇది ఒకటి. దీనికి కారణం ఈ అమ్మడు బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో రచ్చ రచ్చ చేయడంతో పాటు బయటకు వచ్చిన తర్వాత కూడా తరచూ వార్తల్లో నిలుస్తుండడమే. ప్రేమ వ్యవహారంతో ఎనలేని క్రేజ్‌ను అందుకున్న ఈ బ్యూటీ.. వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది. ఫలితంగా అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై సందడి చేస్తూ ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే మోనాల్ గజ్జర్ అఫీషియల్‌గా హైదరాబాదీని అయ్యానంటూ సోషల్ మీడియాలో సంచలన ప్రకటన చేసింది. ఆ సంగతులు మీకోసం!

Recommended Video

Bigg Boss Telugu 4: Monal Gajjar Cried నేషనల్ చానెల్.. అందరూ చూస్తుంటారు అంటూ బోరును ఏడ్చిన మోనాల్‌!
 అప్పుడే పరిచయమైన మోనాల్

అప్పుడే పరిచయమైన మోనాల్

చాలా కాలం క్రితం అల్లరి నరేష్ నటించిన 'సుడిగాడు' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా పరియమైంది మోనాల్ గజ్జర్. ఆ తర్వాత టాలీవుడ్‌లో మరో రెండు మూడు చిత్రాల్లో నటించింది. అయితే, ఇవేమీ ఆమెకు ఆఫర్లను అందించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు సినిమాలకు దూరం అయిపోయింది. కానీ, వేరే భాషల్లో మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది.

బిగ్ బాస్‌లో లవ్ ట్రాకుతో ఫేమస్

బిగ్ బాస్‌లో లవ్ ట్రాకుతో ఫేమస్

తెలుగులో సరైన బ్రేక్‌ను అందుకోలేకపోయినా.. బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొనే అవకాశాన్ని పట్టేసింది మోనాల్ గజ్జర్. షో ఆరంభంలోనే ట్రైయాంగిల్ లవ్ స్టోరీతో ఫేమస్ అయిందామె. ఆ తర్వాత అఖిల్ సార్థక్‌తో కలిసి ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలతో మరింత పాపులర్ అయింది. ఇలా గేమ్ పరంగా కంటే లవ్ ట్రాకుల కారణంగానే ఈ బ్యూటీ మరింత పాపులర్ అయిపోయింది.

బయటా రెచ్చిపోతోన్న మోనాల్

బయటా రెచ్చిపోతోన్న మోనాల్

ఈ రియాలిటీ షోలో అఖిల్ సార్థక్‌తో కలిసి మోనాల్ గజ్జర్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. చుట్టూ ఎంతో మంది ఉన్నా.. వీళ్లిద్దరే జంటగా కనిపిస్తూ ఉండేవారు. అదే సమయంలో హగ్గులు, ముద్దులతో హల్‌చల్ చేసేవారు. ఇలా హౌస్‌లో మాత్రమే కాదు.. బయటకు వచ్చిన తర్వాత కూడా తరచూ కలుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో నిత్యం వార్తల్లోనే ఉంటూ రచ్చ చేస్తున్నారు.

 వరుస ఆఫర్లతో సత్తా చాటుతోంది

వరుస ఆఫర్లతో సత్తా చాటుతోంది

బిగ్ బాస్ షో వల్ల మోనాల్ గజ్జర్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఓ రేంజ్‌లో క్రేజ్ వచ్చేసింది. దీంతో ఆమెకు ఆఫర్లు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన 'అల్లుడు అదుర్స్'లో స్పెషల్ సాంగ్ చేసిన ఈ బ్యూటీ.. ప్రముఖ ఛానెల్‌లో ఓంకార్ నడిపిస్తోన్న 'డ్యాన్స్ ప్లస్' అనే షోలో జడ్జ్‌గా చేసింది. అలాగే, మరికొన్ని సినిమాలు, షోలు చేయడానికి రెడీ అవుతోంది.

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగా

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగా

చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతోన్న మోనాల్ గజ్జర్ నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ హల్‌చల్ చేస్తోంది. తద్వారా ఫాలోవర్లను గణనీయంగా పెంచుకుంటూ ముందుకెళ్తోంది.

మోనాల్ గజ్జర్ సంచలన ప్రకటన

మోనాల్ గజ్జర్ సంచలన ప్రకటన

డ్యాన్స్ ప్లస్ షో తర్వాత మోనాల్ గజ్జర్ తన సొంత ఊరికి వెళ్లిపోయింది. దీంతో ఆమెకు ఆఫర్ల సన్నగిల్లాయన్న టాక్ వినిపించింది. అయితే, ఈ బ్యూటీకి మరికొన్ని అవకాశాలు వచ్చాయని ఇటీవల ప్రచారం జరిగింది. ఇక, ఇంతలోనే మోనాల్ గజ్జర్ తన తల్లిని తీసుకుని హైదరాబాద్‌లో ప్రత్యక్షం అయిపోయింది. అంతేకాదు, ఈ క్రమంలోనే క్రేజీ హీరోయిన్ సంచలన ప్రకటన కూడా చేసేసింది.

హైదరాబాదీని అయ్యానంటూ పోస్ట్

హైదరాబాదీని అయ్యానంటూ పోస్ట్

అసలు విషయం ఏమిటంటే.. మోనాల్ గజ్జర్ హైదరాబాద్‌లో తాజాగా ఓ ఇంటిని కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. అంతేకాదు, 'ఇప్పుడు నాకో ఇల్లు దొరికింది. సో.. నేను కూడా అఫీషియల్‌గా హైదరాబాదీని అయ్యాను. జై శ్రీకృష్ణా.. గోవిందా గోవిందా' అంటూ మరో పోస్ట్ చేసింది. దీంతో మోనాల్ గజ్జర్ మరోసారి హాట్ టాపిక్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X