సీక్రెట్ మీటింగ్‌పై మోనాల్ గజ్జర్ క్లారిటీ: అతడితో కలవడం లేదంటూ షాకిచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎన్నో ఆశలతో అడుగు పెట్టి.. ఇక్కడ అంతగా ఆదరణ లభించకపోవడంతో సొంత రాష్ట్రానికి వెళ్లిపోయింది గుజరాతీ హీరోయిన్ మోనాల్ గజ్జర్. సుదీర్ఘ విరామం తర్వాత బిగ్ బాస్ షో కోసం హైదరాబాద్‌లో అడుగు పెట్టిందీ భామ. ఇక, ఈ షోలో వ్యవహరించిన తీరుతో హాట్ టాపిక్ అయిపోయిన ఈ అమ్మడు.. తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్‌ను అందుకుంది. ఈ క్రమంలోనే వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇలాంటి సమయంలో మోనాల్ గురించి ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అయింది. తాజాగా సీక్రెట్ మీటింగ్ గురించి క్లారిటీ ఇచ్చిందామె. వివరాల్లోకి వెళ్తే...

లవ్ ట్రాకులతో ఫేమస్.. చివరికి అలా

లవ్ ట్రాకులతో ఫేమస్.. చివరికి అలా


బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే యంగ్ హీరో అభిజీత్‌తో ప్రేమాయణం సాగిస్తోందన్న వార్తలతో హాట్ టాపిక్ అయింది మోనాల్ గజ్జర్. అతడితోనే ఎక్కువగా చనువుగా ఉంటూ అనుమానాలకు మరింత బలాన్నిచ్చింది. అదే సమయంలో అఖిల్ సార్థక్‌తోనూ క్లోజ్‌గా ఉండడంతో వీళ్ల ముగ్గురి మధ్య ట్రైయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తున్నట్లు అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది.

హౌస్‌లో రెచ్చిపోయిన మోనాల్ గజ్జర్

హౌస్‌లో రెచ్చిపోయిన మోనాల్ గజ్జర్

క్రమ క్రమంగా అభిజీత్‌కు దూరమైన మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్‌తో మరింత దగ్గరైంది. దీంతో వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో వీళ్లిద్దరూ మరింత రెచ్చిపోయి రొమాన్స్ చేసేవారు. తరచూ హగ్గులిచ్చుకోవడం.. ముద్దులు పెట్టుకోవడం.. కొంటెగా చూసుకోవడం.. మాట్లాడుకోవడం వంటి వాటితో తరచూ వార్తల్లో నిలుస్తూ వచ్చిందీ జంట.

భారీగానే అందుకుంది.. వాటిలో కూడా

భారీగానే అందుకుంది.. వాటిలో కూడా

ఏమాత్రం అంచనాలు లేకుండానే బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మోనాల్ గజ్జర్.. పద్నాలుగు వారాల పాటు షోలో కొనసాగింది. దీని ద్వారా రూ. 50 లక్షలు పైగానే సంపాదించింది. ఈ షో వల్ల క్రేజ్‌ను కూడా భారీగానే అందుకున్న ఈ అమ్మడు.. వరుసగా ఆఫర్లు అందుకుంటోంది. 'డ్యాన్స్+' అనే షోకు జడ్జ్‌గా ఎంపికవడంతో పాటు 'అల్లుడు అదుర్స్'లో ఐటమ్ సాంగ్ కూడా చేసింది.

బయటకు వచ్చాక రచ్చ.. హాట్ టాపిక్

బయటకు వచ్చాక రచ్చ.. హాట్ టాపిక్

బిగ్ బాస్ హౌస్‌లో జంటగా హల్‌చల్ చేసిన మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్.. బయటకు వచ్చిన తర్వాత కూడా రచ్చ రచ్చ చేస్తూనే ఉంది. తరచూ కలిసి తిరగడం.. పార్టీలు చేసుకోవడం వంటివి చేస్తుండేది. అదే సమయంలో సోషల్ మీడియా చాట్ల ద్వారా.. ఇంటర్వ్యూల ద్వారా ఒకరిపై ఒకరు తమ ప్రేమను వ్యక్త పరచుకుంటున్నారు. దీంతో ఎప్పుడూ ట్రెండ్ అవుతూనే ఉన్నారు.

సీక్రెట్ మీటింగ్‌పై మోనాల్ గజ్జర్ క్లారిటీ

సీక్రెట్ మీటింగ్‌పై మోనాల్ గజ్జర్ క్లారిటీ


మోనాల్ గజ్జర్‌ తెలుగులో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ ఫుల్ బిజీ అయిపోయిందని జోరుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న 'సర్కారు వారి పాట'లో ఐటమ్ సాంగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే నిర్మాతలతో సీక్రెట్ మీటింగ్‌ జరిగినట్లు కూడా టాక్ వినిపించింది. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చిందామె.

Recommended Video

Rihanna, Greta Thunberg Draw International Attention To Indian Farmers ప్రొటెస్ట్
అతడితో కలవడం లేదంటూ షాకిచ్చింది

అతడితో కలవడం లేదంటూ షాకిచ్చింది

'సర్కారు వారి పాట'లో స్పెషల్ సాంగ్ చేస్తుందన్న వార్తలపై తాజాగా స్పందించిన మోనాల్ గజ్జర్.. 'మహేశ్ బాబు సినిమాలో ఛాన్స్ వచ్చిందన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. నేను ఆ సినిమా నిర్మాతలతో సీక్రెట్ మీటింగ్ పెట్టలేదు. వేరే ఆఫర్లు మాత్రం వస్తున్నాయి. కానీ, సెలెక్టివ్‌గానే చేయాలని నిర్ణయించుకున్నా' అంటూ చెప్పుకొచ్చింది. దీంతో మోనాల్ ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X