అఖిల్ సార్థక్‌తో పెళ్లిపై తేల్చేసిన మోనాల్ గజ్జర్: మా మమ్మీనే చెప్పలేదంటూ మేటర్ రివీల్ చేసేసింది
చాలా కాలం క్రితమే హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది గుజరాతీ బ్యూటీ మోనాల్ గజ్జర్. అప్పుడే మూడు నాలుగు సినిమాల్లో నటించినా.. ఆమెకు అంతగా గుర్తింపు దక్కలేదు. కానీ, ఇటీవల ప్రసారం అయిన బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా రావడంతో ఈ బ్యూటీ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో వరుస ఆఫర్లు అందుకుంటోంది. మరోవైపు, హౌస్‌లో అఖిల్ సార్థక్‌తో ప్రేమాయణం నడిపిన ఈ భామ.. బయటికొచ్చాక కూడా కంటిన్యూ చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అతడితో పెళ్లి గురించి ఊహించని కామెంట్స్ చేసింది మోనాల్. ఆ వివరాలు మీకోసం!

బిగ్ బాస్ ఎంట్రీ.. మొదట్లోనే విమర్శలు
హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించిన మోనాల్ గజ్జర్.. కొద్ది రోజుల క్రితం ప్రసారం అయిన బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. షో ఆరంభంలోనే అభిజీత్.. అఖిల్ సార్థక్ ఇద్దరితో క్లోజ్‌గా ఉంటూ ట్రైయాంగిల్ లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు అపవాదును మూటగట్టుకుంది. దీంతో అమ్మడి వ్యవహార శైలిపై విమర్శలు చెలరేగాయి. అయినప్పటికీ ఆటతీరుతో బాగా ఆకట్టుకుంది.

అఖిల్ సార్థక్‌తో ప్రేమాయణంతో ఫేమస్
బిగ్ బాస్ హౌస్‌లో అఖిల్ సార్థక్‌తో ట్రాక్ నడుపుతూ తరచూ వార్తల్లో నిలుస్తూ వచ్చింది మోనాల్ గజ్జర్. మరీ ముఖ్యంగా అతడితో రొమాంటిక్‌గా మాట్లాడడం.. ముద్దులు పెట్టడం.. హగ్స్ ఇచ్చుకోవడం వంటి వాటితో హాట్ టాపిక్ అయిపోయింది. అంతేకాదు, అఖిల్ కోసమే ఆడడం.. టాస్కుల్లో సహాయం చేయడం.. నామినేషన్స్ సమయంలో త్యాగం చేయడం వల్ల ఫేమస్ అయింది.

బయటికొచ్చాక ఫుల్ బిజీ.. ఆఫర్ల వర్షం
బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తెలుగు వాళ్లకు మరింత దగ్గరైన మోనాల్ గజ్జర్.. దీని వల్ల బాగానే సంపాదించిందని తెలుస్తోంది. షో వల్ల మొత్తంగా రూ. 50 లక్షలు వరకూ వెనకేసుకున్న ఈ బ్యూటీ.. ఎన్నో ఆఫర్లను అందుకుంటోంది. ఇప్పటికే 'అల్లుడు అదుర్స్' అనే సినిమాలో ఐటం సాంగ్ చేసిన ఈ అమ్మడు.. ఓంకార్ నిర్వహిస్తున్న 'డ్యాన్స్+' అనే షోలోనూ జడ్జ్‌గా వ్యవహరిస్తోంది.

ఇక్కడ కూడా హల్‌చల్... రొమాంటిక్‌గా
షో నుంచి బయటకు వచ్చిన తర్వాత మోనాల్ గజ్జర్ వరుస ఇంటర్వ్యూలతో ఫుల్ బిజీ అయిపోయింది. అలాగే, లైవ్ చాట్‌లు కూడా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తనకు సంబంధించిన ఎన్నో విషయాలను వెల్లడిస్తోంది. అదే సమయంలో అఖిల్ సార్థక్‌తో కలిసి బయట కూడా రచ్చ రచ్చ చేస్తోంది. తరచూ కలుసుకోవడం, పార్టీలు చేసుకోవడం వంటి వాటితో వార్తల్లో నిలుస్తూ వస్తోంది.

అఖిల్‌తో పెళ్లిపై తేల్చేసిన మోనాల్ గజ్జర్
అఖిల్ సార్థక్‌పై ఉన్న ప్రేమను బిగ్ బాస్ హౌస్‌లోనే కాకుండా.. బయట కూడా బాగానే వ్యక్తపరుస్తోంది మోనాల్ గజ్జర్. దీంతో ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్నా.. ఎక్కడికి వెళ్లినా అతడి గురించే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన మోనాల్ గజ్జర్.. అఖిల్‌ను పెళ్లి చేసుకోబోతున్నారా అన్న ప్రశ్నకు ఊహించని ఆన్సర్ ఇచ్చింది.

మమ్మీనే చెప్పలేదంటూ మేటర్ రివీల్
ఈ ఇంటర్వ్యూలో యాంకర్ 'అఖిల్ అన్నతో పెళ్లి ఎప్పుడు వదిన' అంటూ మోనాల్‌ను ప్రశ్నించాడు. దీనికి 'మా ఇద్దరి పెళ్లిని మీరే డిసైడ్ చేసేశారా. మా మమ్మీ కదా ఒప్పుకోవాల్సింది. ఆమెనే డిసైడ్ చేయలేదు. మీరెందుకు అలా అడుగుతున్నారు. ఇలాంటి ప్రశ్నలు అడుగుతారానే మీకు నేను ఇంటర్వ్యూ ఇవ్వడం లేదు' అంటూ సదరు యాంకర్‌పై ఫైర్ అయిందీ గుజరాతీ బ్యూటీ.


Click it and Unblock the Notifications











