twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మోనాల్ గజ్జర్‌ నుంచి ఇది ఊహించరు: అంతర్జాతీయ స్థాయి అవార్డుల్లో బిగ్ బాస్ బ్యూటీ

    |

    హీరోయిన్‌గా అప్పుడెప్పుడో తెలుగు వాళ్లకు పరిచయం అయినప్పటికీ.. అంతగా గుర్తింపును సంపాదించుకోలేకపోయింది హాట్ బ్యూటీ మోనాల్ గజ్జర్. కానీ, ఎప్పుడైతే బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిందో.. అప్పటి నుంచి ఆమె జాతకమే మారిపోయింది. ఈ షో పుణ్యమా అని వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోంది. అదే సమయంలో సినిమాల పరంగా సెకెండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించింది. ఇలాంటి పరిస్థితుల్లో మోనాల్ గజ్జర్ ఊహించని స్థాయిలో అంతర్జాతీయ స్థాయి అవార్డులకు నామినేట్ అయింది. దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

    సింగర్ స్వగత సీక్రెట్ ఫోటోలు లీక్.. చీరకట్టు సొగసులతో దిమ్మ తిరిగేలా

    నరేష్ వల్ల ఎంట్రీ.. బిగ్ బాస్ కోసం రీఎంట్రీ

    నరేష్ వల్ల ఎంట్రీ.. బిగ్ బాస్ కోసం రీఎంట్రీ

    అల్లరి నరేష్ నటించిన 'సుడిగాడు' అనే మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది గుజరాతీ భామ మోనాల్ గజ్జర్. ఆ తర్వాత అదే హీరోతో 'బ్రదర్ ఆఫ్ బొమ్మాలి' అనే సినిమానూ చేసింది. అయినప్పటికీ ఆఫర్లు అందుకోలేకపోయింది. దీంతో ఈ అమ్మడు టాలీవుడ్‌కు బైబై చెప్పేసింది. చాలా గ్యాప్ తర్వాత బిగ్ బాస్ కోసం మళ్లీ తెలుగులోకి అడుగెట్టింది.

    ఇద్దరితో ట్రాకులు... మోనాల్‌పై విమర్శలు

    ఇద్దరితో ట్రాకులు... మోనాల్‌పై విమర్శలు

    గత ఏడాది ప్రసారం అయిన బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన మోనాల్.. ఆరంభంలోనే యంగ్ హీరో అభిజీత్‌తో క్లోజ్ అయింది. ఇలా చాలా రోజులు అతడితో కనిపించింది. అదే సమయంలో అఖిల్ సార్థక్‌తోనూ చనువుగా వ్యవహరించింది. దీంతో ఇద్దరితో ఒకేసారి ట్రాక్ నడుపుతుందని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. దీంతో మోనాల్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలొచ్చాయి.

    రెచ్చిపోయి రొమాన్స్... అతడే సర్వస్వంగా

    రెచ్చిపోయి రొమాన్స్... అతడే సర్వస్వంగా

    రోజులు గడిచిన కొద్దీ అఖిల్‌తో మోనాల్ ప్రేమాయణం సాగిస్తోందని ప్రేక్షకులతో పాటు హౌస్‌లోని కంటెస్టెంట్లు కూడా ఓ అంచనాకు వచ్చేశారు. అందుకు అనుగుణంగానే ఆమె అతడి ప్రేమలో మునిగిపోయి తానే సర్వస్వంగా ప్రవర్తించేది. అదే సమయంలో ముద్దులు, హగ్గులు ఇస్తూ నిత్యం వార్తల్లో నిలిచింది. ఇలా బిగ్ బాస్ హౌస్‌లో ఈ జంట తెగ హల్‌చల్ చేసి హైలైట్ అయింది.

    షో తర్వాత మారిన జాతకం.. వాటితో బిజీ

    షో తర్వాత మారిన జాతకం.. వాటితో బిజీ

    బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో మోనాల్‌పై ఏమాత్రం అంచనాలు లేవు. కానీ, ఊహించని విధంగా ఆమె 14 వారాల పాటు షోలో కొనసాగింది. దీంతో ఈ షో వల్ల దాదాపు రూ. 50 లక్షలు పైగానే సంపాదించింది. అదే సమయంలో క్రేజ్‌ను కూడా భారీగానే అందుకుని.. ఓంకార్ 'డ్యాన్స్+' అనే షోకు జడ్జ్‌గా ఎంపికవడంతో పాటు 'అల్లుడు అదుర్స్'లో ఐటమ్ సాంగ్ కూడా చేసింది.

    మోనాల్ గజ్జర్ ప్రకటించిన ప్రాజెక్టు అదేగా

    మోనాల్ గజ్జర్ ప్రకటించిన ప్రాజెక్టు అదేగా

    ప్రస్తుతం 'డ్యాన్స్+'కు జడ్జ్‌గా చేస్తోన్న మోనాల్ గజ్జర్.. ఆ తర్వాత మరో సినిమాను మాత్రం ప్రకటించలేదు. కానీ, అఖిల్ సార్థక్‌తో కలిసి ఓ వెబ్ సిరీస్ చేస్తున్నట్లు ప్రకటించింది. 'తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి' అనే టైటిల్‌తో వస్తున్న దీన్ని సరస్వతి క్రియేషన్స్ బ్యానర్‌పై భాస్కర్ బంతుపల్లి తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని ఈ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

    అంతర్జాతీయ స్థాయి అవార్డుల్లో మోనాల్

    అంతర్జాతీయ స్థాయి అవార్డుల్లో మోనాల్

    ప్రతి ఏడాది బుల్లితెరపై విశేషమైన ప్రదర్శన చేసే నటీనటులకు 'ఇండియన్ టెలివిజన్ ఐకానిక్ అవార్డ్స్' ఇస్తుంటారు. ఇక, 2021 సంవత్సరానికి గానూ మోస్ట్ పాపులర్ యాక్టర్ ఇన్ ఇంటర్నేషనల్ లెవెల్ (ఫీమేల్) విభాగంలో ఐదుగురు అమ్మాయిలతో కలిసి మోనాల్ గజ్జర్ దీనికి నామినేట్ అయింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది.

    English summary
    Monal Gajjar is an Indian actress and has worked in Gujarati, Telugu, Hindi, and Marathi films. She started her career with a 9 to 5 job at ING Vysya Bank in Ahmedabad, after completing her graduation. Later, her Yoga teacher advised her to participate in ‘Mirchi Queen Bee,’ a beauty pageant contest organised by Radio Mirchi in 2011.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X