ఊహించని ఆఫర్ పట్టేసిన మోనాల్ గజ్జర్: ఏకంగా టాలీవుడ్ టాప్ హీరోతోనే రచ్చ చేసేందుకు రెడీ

కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోన్న పేర్లలో గుజరాతీ భామ మోనాల్ గజ్జర్ ఒకటి. దీనికి కారణం బిగ్ బాస్ హౌస్‌లో ఆమె వ్యవహరించిన తీరుతో పాటు బయటకు వచ్చిన తర్వాత వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుండడమే. అప్పుడెప్పుడో మూడు నాలుగు సినిమాల్లో నటించి.. గుర్తింపు దక్కకపోవడంతో టాలీవుడ్‌కు టాటా చెప్పేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడిక్కడే స్థిరపడిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా మోనాల్ గజ్జర్‌కు ఊహించని ఆఫర్ ఒకటి వచ్చింది. ఈ సారి ఏకంగా టాలీవుడ్ టాప్ హీరోతోనే రచ్చ చేయనుంది. ఆ వివరాలు మీకోసం!

తెలుగులోకి రీఎంట్రీ.. ట్రాకులతో పాపులరిటీ

తెలుగులోకి రీఎంట్రీ.. ట్రాకులతో పాపులరిటీ

తెలుగులోనే సూపర్ సక్సెస్‌ఫుల్ షో బిగ్ బాస్‌ నాలుగో సీజన్ ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ఇందులోకి హీరోయిన్ మోనాల్ గజ్జర్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. షో ఆరంభంలో అభిజీత్‌కు బాగా దగ్గరైన ఆమె.. అదే సమయంలో అఖిల్ సార్థక్‌తోనూ చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. దీంతో వీళ్ల మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తున్నట్లు చూపించడంతో ఆమె బాగా ఫేమస్ అయింది.

పూర్తిగా అతడి ప్రేమలో పడిపోయిన మోనాల్

పూర్తిగా అతడి ప్రేమలో పడిపోయిన మోనాల్

మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ హౌస్‌లో క్రమంగా అఖిల్ సార్థక్‌తో ప్రేమలో పడిపోయింది. నాగార్జున ముందే తన మనసులో A ఉన్నాడని చెప్పిన ఆమె.. అప్పటి నుంచి అతడితోనే ఉంటూ అతడి కోసమే ఆడుతూ హాట్ టాపిక్ అయింది. అలాగే, నామినేషన్స్ నుంచీ కాపాడుతూ వచ్చింది. అదే సమయంలో హగ్గులు, ముద్దులతో రెచ్చిపోయింది. దీంతో ఆమె బాగా పాపులర్ అయిపోయింది.

ఫినాలేకు ముందు ఔట్.. అయినా ఫుల్లుగానే

ఫినాలేకు ముందు ఔట్.. అయినా ఫుల్లుగానే


ఏమాత్రం అంచనాలు లేకుండానే బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మోనాల్ గజ్జర్. కానీ ఊహించని విధంగా ఆమె చాలా సార్లు నామినేషన్స్ తప్పించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇలాంటి పరిస్థితుల్లో ఫినాలేకు ఒక వారం ముందు మోనాల్ ఎలిమినేట్ అయింది. ఇక, ఈ షో వల్ల రెమ్యూనరేషన్ పరంగా మోనాల్ గజ్జర్ రూ. 50 లక్షలకు పైగానే సంపాదించినట్లు తెలిసింది.

షో తర్వాత మరోలా.. మోనాల్ వరుస ఆఫర్లు

షో తర్వాత మరోలా.. మోనాల్ వరుస ఆఫర్లు

బిగ్ బాస్ వల్ల మోనాల్ గజ్జర్‌కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ కారణంగానే ఆమెకు తెలుగులో ఆఫర్లూ వస్తున్నాయి. ఇప్పటికే ఈ గుజరాతీ భామ స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'డ్యాన్స్+' అనే షోకు జడ్జ్‌గా ఎంపికైంది. దీని తర్వాత ఆమె.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కిస్తోన్న 'అల్లుడు అదుర్స్'లో ఐటమ్ సాంగ్ కూడా చేసింది.

ఊహించని ఆఫర్ పట్టేసుకున్న మోనాల్ గజ్జర్

ఊహించని ఆఫర్ పట్టేసుకున్న మోనాల్ గజ్జర్

మోనాల్ గజ్జర్ అంటే బిగ్ బాస్‌కు ముందూ బిగ్ బాస్ తర్వాత అనేలా మారిపోయింది ఆమె కెరీర్. గతంలో ఆఫర్లు రాక ఇండస్ట్రీని వీడిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటూ సత్తా చాటుతోంది. ఇప్పటికే పలు సినిమాలకు సంతకాలు చేసిన ఈ బ్యూటీ.. తాజాగా ఎవరూ ఊహించని భారీ ఆఫర్‌ను పట్టేసినట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది.

Recommended Video

Vishnu Manchu Meets Jagan Over Lunch | Mosagallu Movie Updates
ఏకంగా టాలీవుడ్ టాప్ హీరోతోనే రచ్చకు రెడీ

ఏకంగా టాలీవుడ్ టాప్ హీరోతోనే రచ్చకు రెడీ

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురాం తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో మోనాల్ గజ్జర్ ఓ స్పెషల్ సాంగ్ చేయబోతుందట. దీనికి సంబంధించిన చర్చలు తాజాగా జరిగాయని.. ఇందులో చేసేందుకు ఆమె వెంటనే ఓకే చెప్పేసిందని ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ బ్యూటీ రేంజ్ మరింత పెరిగిపోవడం ఖాయం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X