ఆ డైరెక్టర్ అక్కడ పదే పదే తాకాడు.. ఇంట్లోవాళ్లు కూడా.. : మోనాలిసా ఆవేదన
Monalisa: ప్రయాగ్‌రాజ్ కుంభమేళా ద్వారా ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయి అమ్మాయి మోనాలిసా భోస్లే. తన సహజ సౌందర్యం, నీలి కళ్లుతో గుర్తింపు పొందిన ఈ అమ్మడు వరుస సినిమా అవకాశాలు అందిపుచ్చుకుంది. అయితే.. ఒక్క సినిమా విడుదల కాకముందే వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది. తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ని వివాహం చేసుకోవడానికి కుటుంబాన్ని ఎదిరించింది ఈ భామ. ఈ తరుణంలో తాజాగా కేరళలోని కొచ్చిలో తన భర్త ఫర్మాన్ ఖాన్‌తో కలిసి మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా సంచలన వ్యాక్యాలు చేశారు. ఇంతకీ ఏమన్నారంటే?
దర్శకుడు సనోజ్ మిశ్రాపై మోనాలిసా సంచలన ఆరోపణలు చేసింది. 'ది డైరీ ఆఫ్ మణిపూర్' సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు సనోజ్ మిశ్రా తనను పలుమార్లు అసభ్యంగా తాకాడని ఆరోపించింది. 'ఆయన కనీసం 10 సార్లు నన్ను అనుచితంగా తాకారు. నేను వెంటనే ఈ విషయాన్ని మా కుటుంబానికి చెప్పాను. కానీ వారు 'ఇది నీ మొదటి సినిమా... సర్దుకుపో' అంటూ మద్దతు ఇవ్వలేదు. నేను ఎంత బాధపడ్డానో నాకు మాత్రమే తెలుసు' అంటూ ఆమె భావోద్వేగానికి లోనైంది. తనకు జరిగిన అన్యాయానికి న్యాయం కావాలని స్పష్టం చేసింది.

ఇదే సమయంలో, తనకు,తన భర్తకు ప్రాణహాని బెదిరింపులు వస్తున్నాయని మోనాలిసా ఆందోళన వ్యక్తం చేసింది. తన పోస్టర్లను దహనం చేస్తున్నారని, కొందరు వ్యక్తులు నిరంతరం బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొంది. భద్రత కల్పించకపోతే తీవ్ర నిర్ణయాలకు కూడా వెళ్ళే పరిస్థితి వస్తుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలను ఆశ్రయిస్తూ తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేసింది.
మరోవైపు, తమ వివాహంపై వస్తున్న 'లవ్ జిహాద్' ఆరోపణలను కూడా మోనాలిసా ఖండించింది. తాము హిందూ సంప్రదాయాల ప్రకారం ఆలయంలో చట్టబద్ధంగా వివాహం చేసుకున్నామని, తమ వ్యక్తిగత జీవితాన్ని రాజకీయ కోణంలో చూపించడం తగదని ఆమె అన్నారు. దర్శకుడు సనోజ్ మిశ్రా వ్యక్తిగత కక్షతోనే తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఆరోపించింది.
ఈ విషయంపై మోనాలిసా భర్త ఫర్మాన్ ఖాన్ కూడా స్పందిస్తూ.. తనను మతపరంగా టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. 'నేను ముస్లిం కుటుంబంలో పుట్టాను కాబట్టి నన్ను ఉగ్రవాదిగా పిలుస్తున్నారు. కానీ నేను అన్ని మతాలను గౌరవిస్తాను. శ్రీ నారాయణ గురువును విశ్వసిస్తూ ఆయన ఆలయంలోనే మేము పెళ్లి చేసుకున్నాం' అని తెలిపారు.
ఇక మోనాలిసా కుటుంబం తన ప్రేమను అంగీకరించకపోవడంతో, ఈ జంట ఇటీవల కేరళలో వివాహం చేసుకుంది. 2026 మార్చి 11న జరిగిన ఈ వివాహం తర్వాత నుంచి వివాదాలు మరింత పెరిగాయి. ఒకవైపు వ్యక్తిగత జీవితం, మరోవైపు ఇండస్ట్రీపై చేసిన ఆరోపణలు కలిసి ఈ వ్యవహారాన్ని మరింత సెన్సేషనల్‌గా మార్చాయి.


Click it and Unblock the Notifications


















