‘నాతో ఆ పని .. ఎంత లావు మగాడికైనా ముచ్చెమటలే’
టాలీవుడ్ టూ బాలీవుడ్ పెళ్లి కాకుండా ముదురు బెండకాయల్లా ఉన్న హీరో హీరోయిన్లు ఎందరో. 60 ఏళ్లు వచ్చినా బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. ప్రభాస్, అనుష్క, త్రిష ఇలా చెప్పుకుంటూ వెళ్తే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ చాలా పెద్దది. వీరు రిలేషన్‌లో ఉన్నట్లుగా గాసిప్స్ వైరల్ అవ్వడమే గానీ ఆ తర్వాత ఎలాంటి ఉలుకూ పలుకూ ఉండదు. ఎప్పుడు పెళ్లి టాపిక్ వచ్చినా సదరు స్టార్స్ చిరునవ్వులు చిందిస్తూ తప్పించుకుంటూ ఉంటారు.
స్టార్‌డమ్ కోసం వెయిటింగ్
మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ లిస్ట్‌లోకే వస్తారు సినీ నటి రెజీనా కసాండ్రా. కండనాల్ ముదల్ అనే తమిళ చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. శివ మనసులో శృతి అనే సినిమాతో తెలుగు వారిని పలకరించారు. ఆ తర్వాత రోటీన్ లవ్ స్టోరీ, కొత్తజంట, రారా కృష్ణయ్య, పవన్, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సౌఖ్యం, శౌర్య, జో అచ్యుతానంద, శంకర, మా నగరం, నక్షత్రం తదితర చిత్రాలలో నటించింది. వరుసగా ఆఫర్లు వస్తున్నప్పటికీ స్టార్‌డమ్ మాత్రం రెజీనాకు దక్కలేదు.

20 ఇయర్స్ ఇండస్ట్రీ
తెలుగుతో పాటు మధ్యలో హిందీ, తమిళ్, కన్నడ సినిమాలలో రెజీనా నటించారు. ఈ ఏడాది విదాముయార్చి, జాట్, కేసరి చాప్టర్ 2 వంటి భారీ చిత్రాల్లో నటించి సత్తా చాటింది. ప్రస్తుతం తమిళంలో మూకుతి అమ్మన్ 2, ఫ్లాష్‌బ్యాక్‌తో పాటు హిందీలో సెక్షన్ 108 సినిమాలలో నటిస్తున్నారు రెజీనా. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు కావొస్తున్నా ఆమె కెరీర్‌లో చెప్పుకోదగ్గ మార్పులేం రాలేదు. హీరోయిన్‌గానే కాకుండా స్పెషల్ సాంగ్స్‌తోనూ దుమ్మురేపారు రెజీనా. మెగాస్టార్ చిరంజీవి- రామ్ చరణ్ నటించిన ఆచార్యలో సానా కష్టం అంటూ చిరుతో పోటీపడి స్టెప్పులు వేశారు రెజీనా.
ఆ హీరోలతో రెజీనాకు ఎఫైర్?
ఇక అందరు హీరోయిన్ల మాదిరిగానే రెజీనాపైనే ఎన్నో గాసిప్స్ వచ్చాయి. ఆమెను తరచుగా ఇద్దరు హీరోలకు లింక్ పెడుతూ సోషల్ మీడియాలో పుకార్లు వచ్చేవి. వారే సందీప్ కిషన్, సాయి దుర్గాతేజ్. వీటిపై పలుమార్లు రెజీనా స్పందించింది. సందీప్, సాయి ఇద్దరూ నా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పింది. తన జీవితంలో పలువురితో రిలేషన్‌లో ఉన్నానని.. తాను సీరియల్ డేటర్‌నని బోల్డ్ కామెంట్స్ చేసింది రెజీనా. తన తల్లిదండ్రులకు కూడా ఈ విషయం తెలుసునని వ్యాఖ్యానించింది. బాధ్యతలు తెలియని వ్యక్తితో కలిసి జీవించాలని ఏ అమ్మాయి కోరుకోదని.. పైగా తనకు స్వతంత్రంగా బతకడం అలవాటని నన్నెప్పుడూ జాగ్రత్తగా చూసుకునే వ్యక్తిని వెతుకుతున్నట్లు రెజీనా తెలిపింది.
నన్ను భరించలేరు
34 ఏళ్లు నిండుతున్నా ఇంకా పెళ్లి మాట ఎత్తడంపై రెజీనాపై ట్రోలింగ్ జరుగుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమెకు ఇదే ప్రశ్న ఎదురైంది. దాంతో రెజీనాకు చిర్రెత్తుకొచ్చింది. నా పెళ్లి గురించి తన తల్లిదండ్రులే అడగటం లేదని, అలాంటిది మీరెందుకు అడుగుతున్నారని రెజీనా మండిపడింది. అంతేకాదు.. నాతో సంబంధం పెట్టుకోవాలని అనుకుంటే అది వాళ్లకి మహా కష్టమని.. నాతో ఫ్రెండ్‌షిప్ చేయడం వరకు బాగుంటుందని రెజీనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రెజీనా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నీ తీరు చూస్తుంటే అసలు పెళ్లి చేసుకుంటావా? లేదా? అంటూ కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











