Samantha Ruth Prabhu టాప్ రేటింగ్‌తో దుమ్ము రేపిన సమంత.. బాలీవుడ్ హీరోయిన్లను మించి నంబర్‌వన్‌గా..!

దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ ఉన్న హీరోయిన్ల ఎవరనే సర్వేను ప్రతీ నెల ఓ ప్రైవేట్ సంస్థ సర్వేలను నిర్వహిస్తుంటుంది. కేవలం హీరోయిన్లనే కాకుండా హీరోలు, మ్యూజిక్ డైరెక్టర్లు ఇతర విభాగాల సెలబ్రిటీలను జాబితాలను రూపొందిస్తుంటుంది. తాజాగా మే నెలలో సినీ రంగంలో అత్యధిక ప్రజాదరణ ఉన్న హీరోయిన్ల జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో ఎవరెవరు టాప్ జాబితాలో నిలిచారు? ఈ సర్వేను నిర్వహించే సంస్థ ఏది అనే విషయంలోకి వెళితే..

 సినీ తారల ర్యాంకింగ్స్

సినీ తారల ర్యాంకింగ్స్


గత కొద్దికాలంగా సినీ తారల ర్యాంకింగ్‌ జాబితాను ఓరామాక్స్ మీడియా అనే సంస్థ రెగ్యులర్‌గా అందిస్తున్నది. సినిమాలు, టెలివిజన్, ఓటీటీ, న్యూస్, మ్యూజిక్, స్పోర్ట్స్ లాంటి రంగాల్లో విశ్లేషణలను, ర్యాంకింగ్స్ తదితర విషయాలపై దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ ఉన్న హీరోయిన్ల ర్యాంకింగ్‌ను అందించింది.

సమంతకు వచ్చిన ఓట్లు ఎన్నంటే?

సమంతకు వచ్చిన ఓట్లు ఎన్నంటే?

ఒరామ్యాక్స్ మీడియా అందించిన వివరాల ప్రకారం.. సమంత అగ్రస్థానంలో నిలిచింది. ఈ సంస్థ సర్వే నిర్వహించగా.. సమంతకు 265k ఓట్లు లభించాయి. ఆ తర్వాత రెండో స్థానంలో ఆలియాభట్ నిలిచింది. RRR చిత్రం ద్వారా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకొన్న ఈ నటి 244k ఓట్లు రాబట్టుకొన్నది. ఇక మూడో స్థానాన్ని లేడీ సూపర్ స్టార్ నయనతార సొంతం చేసుకొన్నది. నయనతారకు 218k ఓట్లు లభించాయి.

కాజల్; దీపిక పదుకోన్..

కాజల్; దీపిక పదుకోన్..


ఓరామాక్స్ టాప్ 10 జాబితాలో కాజల్ అగర్వాల్ నాలుగో స్థానంలో నిలిచింది. ఈ మధ్యకాలంలో సినిమాలు లేకున్నా అభిమానులు కాజల్‌కు మంచి ర్యాంకింగ్‌ను కట్టబెట్టారు. 201k ఓట్లతో కాజల్ మెరుగైన ర్యాంకింగ్‌ను సాధించింది. ఇక ఐదో స్థానంలో దీపిక పదుకోన్ 187k ఓట్లను రాబట్టింది.

రష్మిక, అనుష్క శెట్టి రేటింగ్

రష్మిక, అనుష్క శెట్టి రేటింగ్


ఓరామాక్స్ జాబితాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా మంచి ర్యాంగింగ్‌ను రాబట్టింది. బాలీవుడ్ తారలను వెనుకకు నెట్టి ఆరో స్థానాన్ని అందుకొన్నది. రష్మికకు 167k ఓట్లు వచ్చినట్టు సర్వేలో తేలింది. ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి 156K ఓట్లతో 7వ స్థానంలో నిలిచింది.

కత్రినా, కీర్తి, పూజా హెగ్డే ఓట్లు

కత్రినా, కీర్తి, పూజా హెగ్డే ఓట్లు

కత్రినా కైఫ్, కీర్తీ సురేష్, పూజా హెగ్డే వరుసగా 8, 9, 10 స్థానాల్లో నిలిచారు. ఇటీవలే పెళ్లి చేసుకొన్న కత్రినా 145K ఓట్లతో, సర్కారు వారీ పాటతో గ్లామర్ డోస్ పెంచిన కీర్తి సురేష్ 9వ స్థానంలో 128k ఓట్లతో తన ర్యాంకింగ్ మెరుగు పరుచుకొన్నది. 10వ స్థానంలో పూజా హెగ్గే పేలవమైన ఓట్లు సాధించడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇటీవల కాలంలో వరుసగా మూడు ఫ్లాప్‌లతో బుట్టుబొమ్మ చేదు అనుభవాన్ని చవిచూసింది.

Recommended Video

F3 Movie Review కుంభస్థలం కొట్టిందా? గురి తప్పిందా? | Filmibeat Telugu
 సమంత కెరీర్ విషయానికి వస్తే..

సమంత కెరీర్ విషయానికి వస్తే..

సమంత కెరీర్ విషయానికి వస్తే.. లాక్‌డౌన్‌లో ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకొన్నది. ఇటీవల కాతు వాకులా రెండు కాదల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమె నటించిన శాకుంతలం, యశోద, ఖుషి సినిమాలు రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X