ఇండియాలో టాప్ 10 హీరోయిన్లు వీళ్లే.. వన్‌లో సమంత, మిగతా స్థానాల్లో ఎవరంటే?
సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు హీరోహీరోయిన్లు మారుతూ ఉంటారు. కొందరు ఎక్కువ కాలం సినీ రంగంలో కొనసాగగా.. మరికొందరు మాత్రం అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటారు. అయితే ఇక్కడ ఎవరు టాప్ అన్నది ఎప్పటికీ తేలని విషయమే. వరుసగా సినిమాలు చేస్తూ సక్సెస్ సాధిస్తే టాప్ లోకి రావడం.. లేదంటే చివరకు రావడం ఎప్పుడూ జరుగుతుండేదే. అందుకే టాప్ లో ఎవరున్నారు అనే దానిపై సర్వేలు చేసి మరీ ఫలితాలను వెల్లడిస్తుంటారు. ముఖ్యంగా అందరూ మెచ్చే ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్... నిజమైన ఫలితాలను వెల్లడిస్తుంటుంది.
తాజాగా 2024 మార్చి నెలకు సంబంధించిన టాప్ 10 ఇండియన్ హీరోయిన్లు ఎవరన్న దానిపై సర్వే చేసి మరీ ఫలితాలు తెలిపింది. అయితే దేశం మెచ్చిన బ్యూటీల్లో బాలీవుడ్ భామల కంటే ఎక్కువగా తెలుగు హీరోయిన్లే ఉండడం గమనార్హం. 5 గురు బాలీవుడ్ భామలు టాప్ 10లో ఉండగా.. మరో ఆరుగురు టాలీవుడ్ బ్యూటీలో టాప్ లో నిలిచి ట్రెండ్ సెట్ చేశారు. ముఖ్యంగా ఆర్మాక్స్ మీడియా సంస్థ విడుదల చేసిన టాప్ 10 హీరోయిన్ల లిస్టులో మొదటి స్థానంలో సమంత నిలిచింది. సినిమాలు చేయకపోయినా.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ట్రెండింగ్ లో నిలుస్తుంది. ఇక టాప్ 2లో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నిలిచింది.

ఇక టాప్ 2లో బాలీవుడ్ క్యూట్ బ్యూటీ ఆలియా భట్ నిలిచింది. అలియా భట్ బాలీవుడ్ భామ అయినా... ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు వారికి కూడా పరిచయం అయింది. ఈ సినిమాతోనే గతేడాది టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇక టాప్ 3లో దీపికా పదుకొణె నిలిచింది. ఇటీవల జవాన్ సినిమాలో అథితి పాత్రలో నటించిన ఈ భామ కుర్రకారు మదిలో స్థానం సంపాధించుకుంది. అలాగే టాప్ 4లో కాజల్ అగర్వాల్ నిలిచింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ కాజల్ కార్తీక సినిమాతో రాగా.. ఆశించిన స్థాయిలో హిట్ కొట్టలేకపోయింది. కానీ తన క్రేజ్ పడిపోకుండా.. తెగ రచ్చ చేస్తోంది.
ఇక ఐదవ స్థానంలో కత్రినా కైఫ్ నిలిచింది. ఈ భామ ఇటీవల టైగర్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ ఆశించిన స్థాయిలో ఆ సినిమా ఆడలేదు. అయినా కత్రీనా సీన్స్ కు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇక టాప్ 6లో రష్మిక మందన్నా నిలిచింది. ఇటీవలే యానిమల్ తో ట్రెండ్ సెట్ చేసిన ఈమె ట్రెండింగ్ లో నిలుస్తోంది. ఇక టాప్ 7లో నయన తార నిలిచింది. గతేడాది అన్నపూరణి సినిమా చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈమె అనేక వివాదాలు ఎదుర్కుంది. చివరగా సారీ కూడా చెప్పింది.

ఇక టాప్ 8లో త్రిష నిలిచింది. ఈమధ్య చాలా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ అందరినీ మెస్మరైజ్ చేస్తున్న ఈమె టాప్ లోకి వచ్చేసింది. ఇక టాప్ 9లో కీర్తి సురేష్ నిలిచింది. దసరా సినిమాతో వచ్చి సూపర్ డూపర్ హిట్టు కొట్టిన ఈమె ఆ తర్వాత జయం రవితో కలిసి సైరెన్ అనే సినిమా చేసింది. ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా వల్ల మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చిందీ ముద్దుగుమ్మ. ఇక టాప్ 10లో కృతి సనన్ నిలవగా.. గతేడాది ఆది పురుష్ సినిమాతో పాటు గణ్ పథ్ చిత్రంలో నటించిన ఈమెకు పెద్ద ఎత్తునే ఫ్యాన్స్ ఉన్నారు.


Click it and Unblock the Notifications











