Top 10 Heroines: ఇండియాలో టాప్ 10 హీరోయిన్లు వీళ్లే... 2లో సమంత, నంబర్ 1 ఎవరంటే?

సినీ తారల విషయంలో ఎవరు టాప్ అనేది ఎప్పుడూ తేలని అంశమే. కొత్త కొత్త వాళ్లు సినీ రంగంలో అడుగు పెట్టడం.. త్వర త్వరగా అభిమానుల మనసు మారడంతో.. హీరోహీరోయిన్లలో టాప్ 10 లిస్టు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ముఖ్యంగా వరుసగా సినిమాలు చేస్తూ సక్సెస్ సాధిస్తే టాప్ లోకి రావడం.. లేదంటే చివరకు రావడం ఎప్పుడూ జరుగుతుండేదే. అందుకే టాప్ లో ఎవరున్నారు అనే దానిపై సర్వేలు చేసి మరీ ఫలితాలను వెల్లడిస్తుంటారు. ముఖ్యంగా అందరూ మెచ్చే ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్... నిజమైన ఫలితాలను వెల్లడిస్తుంటుంది.

తాజాగా 2024 మే నెలకు సంబంధించిన టాప్ 10 ఇండియన్ హీరోయిన్లు ఎవరన్న దానిపై సర్వే చేసి మరీ ఫలితాలు తెలిపింది. అయితే దేశం మెచ్చిన బ్యూటీల్లో బాలీవుడ్ భామల కంటే ఎక్కువగా తెలుగు హీరోయిన్లే ఉండడం గమనార్హం. నలుగురు బాలీవుడ్ భామలు టాప్ 10లో ఉండగా.. మరో ఆరుగురు టాలీవుడ్ బ్యూటీలో టాప్ లో నిలిచి ట్రెండ్ సెట్ చేశారు. ముఖ్యంగా ఆర్మాక్స్ మీడియా సంస్థ విడుదల చేసిన టాప్ 10 హీరోయిన్ల లిస్టులో మొదటి బాలీవుడ్ భామ అలియా భట్ స్థానం దక్కించుకుంది. అలియా భట్ బాలీవుడ్ భామ అయినా... ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు వారికి కూడా పరిచయం అయింది. ఈ సినిమాతోనే గతేడాది టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

Most Popular Indian Top 10 Heroines List of May 2024 List is Here

అలాగే టాప్ 2లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుతు ప్రభు నిలిచింది. ఆమె ఈ మధ్య సినిమాలు ఏమీ చేయకపోయినా.. టాప్ 10 హీరోయిన్ల లిస్టులో ఎప్పుడూ స్థానం దక్కించుకుంటూనే ఉంటుంది. ఇక టాప్ 3లో దీపికా పదుకొణె నిలిచింది. ఇటీవల జవాన్ సినిమాలో అథితి పాత్రలో నటించిన ఈ భామ కుర్రకారు మదిలో స్థానం సంపాధించుకుంది. అలాగే టాప్ 4లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నిలిచింది. ఇటీవలే యానిమల్ తో ట్రెండ్ సెట్ చేసిన ఈమె.. ప్రస్తుతం పుష్ప 2తో పాటు గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా చేస్తోంది.

Most Popular Indian Top 10 Heroines List of May 2024 List is Here

ఇక టాప్ 5లో కాజల్ అగర్వాల్ నిలిచింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ కాజల్ కార్తీక సినిమాతో రాగా.. ఆశించిన స్థాయిలో హిట్ కొట్టలేకపోయింది. కానీ అవేమీ పట్టించుకోకుండా.. ప్రస్తుతం సత్యభామ 2తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలా ట్రెండింగ్ లో నిలిచిందీ ముద్దుగుమ్మ. అలాగే టాప్ 6లో కృతి సనన్ నిలవగా.. గతేడాది ఆది పురుష్ సినిమాతో పాటు గణ్ పథ్ చిత్రంలో నటించిన ఈమెకు పెద్ద ఎత్తునే ఫ్యాన్స్ ఉన్నారు.

ఆర్మాక్స్ మీడియా సంస్థ రిలీజ్ చేసిన ఈ లిస్టులో టాప్ 7లో కత్రినా కైఫ్ నిలిచింది. ఈ భామ ఇటీవల టైగర్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ ఆశించిన స్థాయిలో ఆ సినిమా ఆడలేదు. అయినా కత్రీనా సీన్స్ కు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇక టాప్ 8లో కియారా అద్వాణీ నిలిచింది. గతేడాది సత్య ప్రేమ్ కి కథ అనే సినిమా చేసి విపరతీమైన క్రేజ్ రాబట్టుకుంది. అలా ట్రెండింగ్ లో నిలిచింది. ఇక టాప్ 9లో టాలీవుడ్ క్యూట్ బ్యూటీ శ్రీలీల నిలవగా.. టాప్ 10లో నయనతార నిలిచింది. గతేడాది అన్నపూరణి సినిమా చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈమె అనేక వివాదాలు ఎదుర్కుంది. చివరగా సారీ కూడా చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X