విశ్వంభర బ్యూటీ స్వలింగ సంపర్కురాలా? స్టార్ హీరోయిన్ రియాక్షన్ ఏమిటంటే?

సోషల్ మీడియా రాకతో సినీతారలపై విచ్చలవిడిగా ట్రోలింగ్ జరుగుతోంది. తమకు ఇష్టం లేని నటీనటులు, ప్రత్యర్ధులను సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుని దెబ్బ కొడుతున్నారు. కొందరిపై అక్కసు తీర్చుకోవడానికి కూడా సామాజిక మాధ్యమాలను వాడుతున్నారు. సినీ పరిశ్రమలో సెలబ్రిటీలను కొందరు దారుణంగా ట్రోలింగ్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. నిత్యం ఎవరో ఒక సెలబ్రిటీపై సోషల్ మీడియాలో తమపై జరుగుతున్న దుష్ప్రచారం గురించి బయటపెడుతూనే ఉన్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో చేరారు బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీరాయ్. ఈ వివరాల్లోకి వెళితే..

సినిమాలు, సీరియల్స్, స్పెషల్ సాంగ్స్‌తో భారతీయ చిత్ర పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు మౌనీరాయ్. నాగిన్ సీరియల్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్‌తో పాటు దక్షిణాది చిత్రాల్లోనూ స్పెషల్ సాంగ్స్‌ చేస్తూ మాస్‌ని అలరిస్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న విశ్వంభరలో ఆమె ఐటెం సాంగ్ చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ విడుదల కానుంది. అయితే గత కొంతకాలంగా మౌనీరాయ్ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. తన సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితం కూడా ఒక కారణం.

Mouni Roy addressed the rumours surrounding her personal life

తన భర్త సూరజ్ నంబియార్‌తో మౌనీ రాయ్‌ విడాకులు తీసుకున్నారు. దుబాయ్‌కి చెందిన సూరజ్ నంబీయార్‌‌తో ప్రేమలో పడిన ఈ ముద్దుగుమ్మ పెద్దల అంగీకారంతో ఆయనను 2022లో గోవాలో పెళ్లి చేసుకున్నారు. మలయాళీ, బెంగాలీ సాంప్రదాయాల ప్రకారం వీరి వివాహం ఘనంగా జరిగింది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే మౌనీ రాయ్.. ఎప్పటికప్పుడు తన సినిమాలు, ఇతర వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

అయితే గత కొంతకాలంగా తన భర్త సూరజ్‌కి సంబంధించిన ఏ అప్‌డేట్స్‌ను వెల్లడించడం లేదు. ఇదే సమయంలో సూరజ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో మౌనీరాయ్‌తో పెళ్లికి సంబంధించిన ఫోటోలు తొలగించారు. దీంతో మౌనీరాయ్ విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు రాగా.. వాటిని ఆమె ఖండించారు. కానీ గంటల గడవకముందే తాను సూరజ్‌తో విడిపోతున్నట్లు ప్రకటించి షాకిచ్చారు. ప్రస్తుతం కోర్టులో విడాకుల ప్రక్రియ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రభావం తన వృత్తి జీవితంపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మౌనీరాయ్.

అందరు హీరోయిన్ల మాదిరిగానే మౌనీరాయ్ గురించి కూడా సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చాయి. ముఖ్యంగా మౌనీరాయ్- దిశా పటానీల స్నేహం పలు విమర్శలకు తావిచ్చింది. వీరిద్దరి బంధంపై సోషల్ మీడియాలో దారుణమైన కామెంట్స్ వచ్చాయి. దిశా- మౌనీరాయ్‌లు బెస్ట్ ఫ్రెండ్స్.. షూటింగ్ గ్యాప్ దొరికినప్పుడల్లా వీరిద్దరూ రెస్టారెంట్స్, దుబాయ్, మాల్దీవులు ఇతర డెస్టినేషన్స్‌కి వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. దాంతో వీరిద్దరినీ టార్గెట్ చేసిన కొందరు.. దిశా- మౌనీల స్నేహం కాస్తా, బంధంగా మారిందని, ఇద్దరి మధ్య సంథింగ్.. సంథింగ్ అంటూ దారుణమైన కామెంట్స్ పెట్టారు. ఒకదశలో మౌనీరాయ్ - సూరజ్ నంబియార్ విడిపోవడానికి కూడా దిశాపటానీయే కారణమంటూ ట్రోలింగ్ జరిగింది. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మౌనీరాయ్ మాట్లాడుతూ.. తనపై వచ్చిన రూమర్స్‌కు చెక్ పెట్టారు.

బాలీవుడ్‌లో మీ గురించి వచ్చిన అతిపెద్ద పుకారు ఏంటని మౌనీరాయ్‌ని యాంకర్ మోనికా శర్మ ప్రశ్నించారు. దానికి ఆమె ఏమాత్రం ఆలోచించకుండా.. నేను స్వలింగ సంపర్కురాలినని నా మీద పెద్ద రూమర్ వచ్చిందని మౌనీరాయ్ చెప్పారు. జీవితంలో అండగా నిలిచే మహిళలు ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే వారు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు నడిపిస్తారు. నాకు జీవితంలో మద్ధతుగా నిలిచే గొప్ప స్నేహితురాళ్లు ఉన్నారు. నా లైఫ్‌లో మంచి, చెడు, కష్టమైన దశలన్నింటిలోనూ వారు నాకు తోడుగా నిలిచారు. మనల్ని ఉన్నత స్థితికి చేర్చే లేదా ప్రొత్సహించే మహిళలు మన జీవితంలో ఉండటం చాలా అవసరం. నా స్నేహితురాలు అత్యుత్తమమైనవారు అని మౌనీరాయ్ అన్నారు.

మహిళలు ఇండిపెండెంట్‌గా ఉండాలి. జీవితంలోని ఒడిదుడుకులను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవడానికి యువతులు ఆర్ధిక స్వాతంత్య్రాన్ని, మానసిక స్థిరత్వాన్ని సాధించాలి. నా జీవితం ఎత్తుపల్లాలతో కూడిన ఒక ప్రయాణంలా సాగింది. ఇందులో పోరాటాలు, మంచి రోజులు, చెడు రోజులు అన్నీ ఉన్నాయి. కొన్నిసార్లు ఎంతో సంతోషంగా.. మరికొన్నిసార్లు తీవ్రమైన బాధలో ఉంటాం. అయినా ఇవన్నీ జీవితంలో ఒక భాగమేనని మౌనీరాయ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మౌనీరాయ్ క్లారిటీతోనైనా ఈ పుకార్లకు చెక్ పడుతుందేమో చూడాలి.

Read more about: mouni roy disha patani
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X