భర్తతో మౌనీరాయ్ విడాకులు? విశ్వంభర బ్యూటీ స్ట్రాంగ్ రియాక్షన్

ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు విడాకుల ప్రకటనలో కలకలం రేపుతున్నారు. ఎప్పుడు ఎవరు విడాకులు ఇస్తారోనని వారి అభిమానులు, సన్నిహితులు టెన్షన్ పడుతున్నారు. ఈ ఏడాది స్టార్ హీరోయిన్ హన్సిక మోత్వానీ తన భర్త నుంచి విడాకులు తీసుకోగా.. మరికొందరు కూడా తమ జీవిత భాగస్వాముల నుంచి విడిపోయారు. ఈ క్రమంలో నాగిన్ ఫేమ్, హీరోయిన్ మౌనీ రాయ్ తన భర్త నుంచి విడాకులు తీసుకోబోతున్నట్లుగా వార్తలు రావడంతో చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. దీనిపై మౌనీరాయ్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
'దానికి పెళ్లెందుకు... సహజీవనం ఉందిగా’
'దానికి పెళ్లెందుకు... సహజీవనం ఉందిగా’

పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బెహార్‌ నుంచి సినీరంగం వైపు వచ్చారు మౌనీ రాయ్. ఆమె తాతగారు శేఖర్ చంద్ర రాయ్ , తల్లి ముక్తి రాయ్‌లు .. జాత్ర థియేటర్ ఆర్టిస్ట్‌‌లుగా బెంగాల్‌లో బాగా ఫేమస్. మధుబాల, మాధురి దీక్షిత్, వహీదా రెహ్మన్‌ అంటే ఇష్టపడే మౌనీరాయ్ వారిని ఆదర్శంగా తీసుకుని తాను కూడా సినీరంగంలో వెలిగిపోవాలని ఆశపడ్డారు. తొలుత హిందీ టెలివిజన్ ఇండస్ట్రీలో మౌనీ రాయ్‌కి అవకాశం దక్కింది. 2006లో క్యూంకీ సాస్ భి కబీ బహు తీ అనే సీరియల్ ద్వారా టెలివిజన్ రంగంలో అడుగుపెట్టారు. తర్వాతా దేవోంకీ దేవ్.. మహాదేవ్, పతి పత్ని ఔర్ వో, దో సహేలియన్, ఝలక్ దిక్లాజా అనే సీరియల్స్‌తో మంచి పేరు తెచ్చుకున్నారు.

Mouni Roy breaks silence on Divorce rumours from husband Suraj Nambiar

అయితే 2015లో వచ్చిన నాగిన్ సీరియల్ మౌనీరాయ్ బ్రేక్ ఇచ్చింది. ఈ ధారావాహికతో ఆమె దేశ ప్రజలకు సుపరిచితురాలిగా మారిపోయారు. ఈ పాపులారిటీతో సినిమాలలోనూ మౌనీరాయ్‌కి అవకాశాలు వచ్చాయి. హిందీతో పాటు కొన్ని దక్షిణాది చిత్రాలలో స్పెషల్ సాంగ్స్‌తో మౌనీరాయ్ స్టార్ ఇమేజ్ అందుకున్నారు. కేజీఎఫ్ చాప్టర్ 1, వేదా సినిమాలలో ఆమె చేసిన స్పెషల్ సాంగ్స్.. మాస్‌ను ఊపేశాయి. అలాగే పలువురు స్టార్స్‌తో కలిసి ఎన్నో మ్యూజిక్ ఆల్బమ్స్‌ను మౌనీరాయ్ రూపొందించి రిలీజ్ చేశారు.

Recommended For You
'ఎంతో మందితో రిలేషన్‌ పెట్టుకున్నా... చచ్చినా ఆ పని మాత్రం చేయను’
'ఎంతో మందితో రిలేషన్‌ పెట్టుకున్నా... చచ్చినా ఆ పని మాత్రం చేయను’

ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న విశ్వంభరలో మౌనీ రాయ్ స్పెషల్ సాంగ్‌లో నటించారు. మెగాస్టార్‌తో పోటీపడి మరి ఈ ముద్దుగుమ్మ స్టెప్స్ వేసినట్లుగా టాలీవుడ్ టాక్. ఇది కాకుండా హిందీలో హై జవానీ తో ఇష్క్ హోనా హై, ది వైవ్స్ సినిమాలలో ఆమె నటిస్తున్నారు. దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త సూరజ్ నంబీయార్‌ను మౌనీరాయ్ పెళ్లాడారు. 2022లో గోవాలో వీరి పెళ్లి మలయాళీ, బెంగాలీ సాంప్రదాయాల ప్రకారం ఘనంగా జరిగింది.

You May Also Like
నా బిడ్డకు తండ్రి ఆ హీరోయే... జడ్జి ముందు నటి హల్‌చల్
నా బిడ్డకు తండ్రి ఆ హీరోయే... జడ్జి ముందు నటి హల్‌చల్

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే మౌనీ రాయ్.. ఎప్పటికప్పుడు తన సినిమాలు, ఇతర వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక హాట్ హాట్ ఫోటోషూట్స్‌తో కుర్రాళ్లు నిద్రలేకుండా చేస్తారు. తన ఫ్రెపండ్స్‌తో కలిసి వెకేషన్స్‌కు వెళ్తూ ఎంజాయ్ చేస్తారు. అలాంటిది గత కొంతకాలంగా భర్తతో ఉన్న ఫోటోలను మౌనీ రాయ్ పోస్ట్ చేయడం లేదు. మరోపక్క.. మౌనీ రాయ్ భర్త సూరజ్ నంబియార్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు మాయమయ్యాయి. అంతేకాదు.. ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కూడా కనిపించడం లేదు.

నేనూ విష్ణుప్రియకి 399 రూపాయలు కట్టా... బిగ్‌బాస్ కంటెస్టెంట్ షాకింగ్ కామెంట్స్
నేనూ విష్ణుప్రియకి 399 రూపాయలు కట్టా... బిగ్‌బాస్ కంటెస్టెంట్ షాకింగ్ కామెంట్స్

ఈ పరిణామాలతో మౌనీరాయ్- సూరజ్ మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయని, వీరిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయం తెలిసి సినీ ప్రముఖులు, మౌనీ రాయ్ అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ నేపథ్యంలో మౌనీ రాయ్ స్పందించారు. సూరజ్‌తో తాను విడిపోతున్నట్లు జరుగుతన్న ప్రచారం నిజం లేదని తేల్చేశారు. అలాగే అవాస్తవాలను ప్రచారం చేయడం మానుకోవాలి. తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించొద్దని మౌనీ రాయ్ విజ్ఞప్తి చేశారు. ఆమె క్లారిటీ ఇవ్వడంతో విడాకుల వార్తలకు చెక్ పడుతుందా? లేదా? అన్నది చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X