Mouni Roy Divorce: నా భర్తతో విడిపోతున్నా.. విడాకులతో సైలెంట్‌గా షాకిచ్చిన మౌనీరాయ్

గత రెండు రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు బాలీవుడ్ బ్యూటీ మౌనీరాయ్ తెరదించారు. తన భర్త సూరజ్ నంబియార్‌తో తాను విడిపోతున్నట్లు మౌనీరాయ్ అధికారికంగా ప్రకటించారు. పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, తమ గోప్యతకు భంగం కలిగించొద్దని ఆమె మీడియాకు విజ్ఞప్తి చేశారు. అలాగే విడాకులు తీసుకున్నప్పటికీ సూరజ్, నేను ఫ్రెండ్స్‌గానే ఉంటామని మౌనీరాయ్ వెల్లడించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

Mouni Roy confirms separation with Suraj Nambiar after 4 years

నాగిన్ సీరియల్‌తో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర నటి మౌనీరాయ్.. ఆ తర్వాత వెండితెరపై బిజీ అయ్యారు. తన డ్యాన్స్, అందం, నటనతో వరుసపెట్టి క్రేజీ ప్రాజెక్ట్స్‌లో బిజీ అయ్యారు. బ్రహ్మాస్త్ర, కేజీఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో స్థానం సంపాదించుకున్నారు. ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న విశ్వంభరలో చిరుతో స్టెప్పులు వేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. విశ్వంభరతో మౌనీరాయ్ తెలుగు ప్రజలను పలకరించనున్నారు.. త్వరలోనే ఈ సోషియా ఫాంటసీ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. విశ్వంభర కాకుండా హిందీలో హై జవానీ తో ఇష్క్ హోనా హై, ది వైవ్స్ సినిమాలలో మౌనీ రాయ్ నటిస్తున్నారు.

దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త సూరజ్ నంబీయార్‌ను మౌనీరాయ్ పెళ్లాడారు. 2022లో గోవాలో వీరి పెళ్లి మలయాళీ, బెంగాలీ సాంప్రదాయాల ప్రకారం ఘనంగా జరిగింది. నాటి నుంచి తన సినిమాలు, కుటుంబాన్ని బ్యాలెన్స్ చేస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే మౌనీ రాయ్.. ఎప్పటికప్పుడు తన సినిమాలు, ఇతర వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక హాట్ హాట్ ఫోటోషూట్స్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుంటారు మౌనీరాయ్.

తన కుటుంబం, సినిమాలు, ఇతర వ్యక్తిగత విషయాలను క్రమం తప్పకుండా పంచుకుంటూ, ఫోటోలను షేర్ చేస్తుండే మౌనీరాయ్ గత కొంతకాలంగా తన భర్త సూరజ్‌కి సంబంధించిన ఏ అప్‌డేట్స్‌ను వెల్లడించడం లేదు. అలాగే ఆయన కలిసున్న ఫోటోలను సైతం మౌనీ రాయ్ పోస్ట్ చేయడం లేదు. అటు సూరజ్ నంబియార్ వ్యవహారశైలి సైతం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో మౌనీరాయ్‌తో పెళ్లికి సంబంధించిన ఫోటోలు తొలగించారు. అంతేకాదు.. ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కూడా డిలీట్ చేసినట్లుగా బీటౌన్ మీడియా కోడై కూస్తోంది

ఈ పరిణామాలతో మౌనీరాయ్- సూరజ్ మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నాయని, త్వరలోనే ఈ స్టార్ కపుల్ విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు హల్‌చల్ చేశాయి. ఈ విషయం తెలిసి సినీవర్గాలు, మౌనీ రాయ్ అభిమానులు షాకయ్యారు. దీంతో మౌనీ రాయ్ స్వయంగా స్పందించారు. సూరజ్‌తో తాను విడిపోతున్నట్లు జరుగుతన్న ప్రచారంలో నిజం లేదు. నిరాధారమైన వార్తలను ప్రచారం చేయడం మానుకోవాలని మీడియాకు మౌనీరాయ్ చురకలంటించారు.

కానీ 24 గంటలు గడవకుండానే మౌనీరాయ్ షాకిచ్చారు. గత రెండు రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరదించుతూ తన భర్త సూరజ్ నంబియార్‌తో విడిపోతున్నట్లు నాగిన్ నటి అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. మా వ్యక్తిగత జీవితాల్లోకి మీడియాలోని కొన్ని వర్గాలు అనవసరంగా జోక్యం చేసుకోవడాన్ని గమనిస్తున్నాం. మేమిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం, ఈ విషయాన్ని గోప్యంగా, సామరస్యంగా పరిష్కరించుకోవడానికి అవసరమైన సమయాన్ని తీసుకుంటున్నాం. కల్పిత కథనాలు, పచ్చి అబద్ధాలను ప్రచారం చేయడం ద్వారా మా వ్యక్తిగత జీవితాలను సంచలనం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇవి మా బంధంలోని వాస్తవ పరిస్ధితులను ఏ మాత్రం ప్రతిబింబించవని మౌనీరాయ్ పేర్కొన్నారు.

ఇద్దరి వ్యక్తిగత ప్రాధాన్యతలపై లోతుగా ఆలోచించిన తర్వాత మేమిద్దరం పరస్పర గౌరవంతో, అవగాహనతో వేర్వేరు మార్గాల్లో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. భవిష్యత్తులో మా స్నేహాన్ని పదిలంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాం. ఈ క్లిష్ట సమయంలో మా పట్ల చూపిన అవగాహనకు, మా గోప్యతపై చూపిన గౌరవానికి, మాకు అందించిన నిరంతర మద్ధతుకు హృదయపూర్వక కృతజ్ఞతలు అని మౌనీరాయ్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా మౌనీరాయ్ అభిమానులు తమ అభిమాన నటి జీవితంలో చోటు చేసుకున్న పరిస్ధితిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read more about: mouni roy
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X