బికినీలో హాట్ హాట్‌గా నాగిన్ భామ.. నీ భర్త సంతృప్తి పరచడం లేదా? మౌనీరాయ్‌ను నెటిజన్ల ట్రోలింగ్
ఇండియన్ టెలివిజన్ రంగంతోపాటు సినీ రంగంలో రాణిస్తున్న టాలెంటెడ్ యాక్టర్లలో మౌనీ రాయ్ ఒకరు. నాగిన్ సీరియల్ ద్వారా విశేషమైన ప్రేక్షకులను అభిమానులను సొంతం చేసుకొన్న ఆమె ఇటీవల బ్రహ్మస్త్ర చిత్రంలోను ఆకట్టుకొన్నారు. బుల్లితెరను, వెండితెరను బ్యాలెన్స్ చేస్తున్న ఈ భామ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో ఎప్పడూ ట్రెండింగ్‌గా మారుతుంటారు. అయితే ఇటీవల ఆమె పోస్టు చేసిన బికినీ బ్రా ఫోటోలపై నెటిజన్లు ఘాటైన కామెంట్లు చేశారు. ఆ కామెంట్ల వివరాలు, అలాగే మౌనీ రాయ్ కెరీర్ విషయంలోకి వెళితే..
హిందీ టెలివిజన్ సీరియల్స్‌లో:ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ నిర్మించిన క్యోంకి సాస్ బీ కభీ బహు తీ అనే సీరియల్ ద్వారా 2006లో హిందీ టెలివిజన్ రంగంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత కస్తూరి, పతి పత్నీ ఔర్ ఓ, దో సహెలియాన్ అనే సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఆ తర్వాత నాగిన్ 2 సీజన్ ద్వారా ఆమె ఫెర్ఫార్మెన్స్ సినీ విమర్శకులను ఆకట్టుకొన్నది. బుల్లితెర మీద భారీ ఆఫర్లతో స్టార్ యాక్టర్‌గా మారింది.

అత్యధిక పారితోషికంతో :మౌనీ రాయ్ తన అందం, అభినయంతో హిందీ వినోద పరిశ్రమలో ఊహించని స్థాయికి చేరుకొన్నది. అనతికాలంలోనే హిందీ టెలివిజన్ రంగంలో అత్యధిక పారితోషికం అందుకొనే నటిగా ఘనతను సాధించింది. చాలా కాలం బుల్లితెరపై తన హవాను, స్టార్ స్టేటస్‌ను కొనసాగించింది. ఇప్పటికీ మౌనీ రాయ్ స్టార్‌గా అగ్రస్థానంలో కొనసాగుతూనే ఉంది.

అక్షయ్ కుమార్‌తో కలిసి:టెలివిజన్ రంగంలో టాప్ రేంజ్‌లో కొనసాగుతున్న సమయంలోనే వెండితెరపై అదృష్టాన్ని పరీక్షించుకొనే ప్రయత్నం చేసింది. హీరో హిట్లర్ ఇన్ లవ్ అనే పంజాబీ సినిమా ద్వారా సినిమా రంగంలోకి వచ్చింది. ఆ తర్వాత అక్షయ్ కుమార్‌తో గోల్డ్ అనే చిత్రంలో నటించింది. ఆ సినిమాలో ఉత్తమ ప్రదర్శనకు ఫిల్మ్‌ఫేర్ అవార్డును సొంతం చేసుకొన్నది.

టెలివిజన్ రియాలిటీ షోలో:ఇక టెలివిజన్ సీరియల్స్‌నే కాకుండా పలు రియాలిటీ షోలలో కంటెస్టెంట్‌గా తన సత్తాను చాటుకొంటున్నది. లిప్ సింగ్ బాటిల్, డ్యాన్స్ ఇండియా డ్యాన్స్, డ్యాన్స్ బంగ్లా డ్యాన్స్ అనే రియాలిటీ షోలకు జడ్జీగా వ్యవహరిస్తున్నారు. దోతారా అనే మ్యూజిక్ ఆల్బమ్‌లో తన అందాలను ప్రదర్శించారు. వినోద పరిశ్రమలో రకరకాల పాత్రలతో తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకొంటూ ముందుకెళ్తున్నారు.

భర్తతో కలిసి విహార యాత్రకు వెళ్లి:కొద్దికాలంగా సూరజ్ నంబియార్‌తో డేటింగ్ చేసిన మౌనీరాయ్.. 2022లో ఆయనను వివాహం చేసుకొన్నది. వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితాలను బ్యాలెన్స్ చేసుకొంటూ ముందుకెళ్తున్న ఈ భామ సమ్మర్ వెకేషన్ కోసం భర్తతో విదేశాలకు వెళ్లింది. అయితే అక్కడ బికినీలో షూట్ చేసిన ఫోటోలను తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసుకొన్నది. ప్రస్తుతం ఆ ఫోటోలు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి.

మౌనీ రాయ్‌ను ట్రోల్ చేసిన నెటిజన్లు:మౌనీ రాయ్ పోస్టు చేసిన ఫోటోలపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతూ ట్రోల్ చేస్తున్నారు. బాలీవుడ్‌లో నీ అంత అందంగా ఉన్న హీరోయిన్ ఎవరూ లేరంటే.. ఏంటి ఎప్పుడూ నగ్నంగానే కనిపించేందుకు ప్రయత్నిస్తావు. ఒంటి బట్టలు ఉంచుకోవడం ఇష్టం లేదా అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ఇంకాస్త ముందుకెళ్లి.. నీ భర్త సంతృప్తి పరచడం లేదా? అందుకే ఇలా సోషల్ మీడియలో పోస్టులు పెడుతున్నావా? కామెంట్ చేశాడు.


Click it and Unblock the Notifications











