పెళ్ళయాక కూడా ఎక్కడా తగ్గని నాగిని.. తీసుకుపోండి అంటూ బికినీలో హాట్ ట్రీట్!

ఒకప్పుడు సినిమా, టీవీ నటీనటులకు క్రేజ్ లో తేడా ఉండేది. కానీ ఇప్పుడు ఇద్దరికీ దాదాపు ఒకేరకమైన క్రేజ్ లభిస్తోంది. అందుకే టీవీ నటులు కూడా సినిమా నటుల మాదిరిగా సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ఇక కొంత క్రేజ్ లభించాక అందాల ఆరబోతకు ఏమాత్రం వెనుకేయడం లేదు. తెర మీద అందాలు ఆరబోస్తున్నా లేకున్నా సోషల్ మీడియాలో వారి అందాల ఆరబోత మాత్రం రచ్చ రేపుతోంది. అలా అందాల ఆరబోతతో పేరు తెచ్చుకుంది హిందీ సీరియల్ నటి మౌని రాయ్. ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న ఈ భామ మరోసారి అందాల ఆరబోతకు తెర తీసింది. ఆ వివరాల్లోకి వెళితే

మోడలింగ్ రంగంలో

మోడలింగ్ రంగంలో

వెస్ట్ బెంగాల్ లో పుట్టిన పెరిగిన మౌని రాయ్ తొలుత మోడలింగ్ రంగంలో దిగింది. అక్కడ మంచి పేరు తెచ్చుకుని ఫేమస్ అయిన క్రమంలో 2004లో 'రన్' అనే సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఆ తర్వాత 'క్యూకీ సాస్ బీ కబీ బహు తీ' అనే సీరియల్ ద్వారా బుల్లితెర ఎంట్రీ ఇచ్చింది. ఆ సీరియల్ సూపర్ హిట్ కావడంతో తర్వాత 'కసో నా యార్ హై', 'కస్తూరి', 'దో సహేలియాన్', 'దేవోన్ కే దేవ్ మహాదేవ్' వంటి అనేక సీరియళ్లలో నటించి మంచి పేరు తెచ్చుకుంది.

పలు భాషల్లో డబ్బింగ్

పలు భాషల్లో డబ్బింగ్

అయితే ఎన్ని సీరియల్స్ చేసినా మౌనీ రాయ్ కెరీర్‌లో 'నాగిన్' చాలా ప్రత్యేకమనే చెప్పాలి. మూడు సీజన్ల పాటు ప్రసారం అయిన ఈ సీరియల్‌లో ఆమె నాగిని రోల్‌ చేసింది. హిందీలో ఈ సీరియల్ సూపర్ హిట్ కావడంతో ఇండియాలోని పలు భాషల్లో డబ్బింగ్ అయింది. మన తెలుగులో కూడా ప్రసారం అవడంతో ఇక్కడ కూడా సూపర్ హిట్ అయింది.

సీరియల్స్ లో నటిస్తున్నా

సీరియల్స్ లో నటిస్తున్నా

అయితే సీరియల్స్ లో నటిస్తున్నా సరే మరోపక్క సినిమాల్లో అవకాశాలు వస్తే మాత్రం ఏమాత్రం వెనక్కు తగ్గేది కాదు. అలా సీరియళ్లలో నటిస్తూనే పలు సినిమాల్లో కూడా నటించింది. 'హీరో హిట్లర్ లవ్' అనే పంజాబీ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన ఆమె తర్వాత 'గోల్డ్' అనే బాలీవుడ్ సినిమాలో కూడా నటించింది. ఇవి కాక 'రోమియో అక్బర్ వాల్టర్', 'మేడ్ ఇన్ చైనా' వంటి సినిమాల్లో కూడా కనిపించింది.

ఫోటోలు షేర్ చేయడం ఆపలేదు

ఫోటోలు షేర్ చేయడం ఆపలేదు

ఇక తన కెరీర్‌లో అనేకమందితో ప్రేమాయణం సాగించిన మౌనీ రాయ్ కొంత కాలంగా సూరజ్ నంబియార్ అనే వ్యక్తితో డేటింగ్ చేస్తూ అతడినే వివాహం కూడా చేసుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో అంగరంగ వైభవంగా జరిగిన వాళ్ళ పెళ్లి తరువాత కూడా ఆమె ఫోటోలు షేర్ చేయడం ఆపలేదు. ఆఖరికి హానీ మూన్ లో ఉన్న సమయంలో కూడా ఆమె తన ఫోటోలు షేర్ చేసింది.

టేక్ మీ బ్యాక్

టేక్ మీ బ్యాక్

ఇక ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు హాట్ ఫొటోలతో రచ్చ చేసే మౌని రాయ్ ఇపుడు మరోమారు తన బికినీ అందాలు ఆరబోసింది. అవి ఇప్పటి ఫోటోలు కాదు కానీ తన త్రో బాక్ ఫోటోలు షేర్ చేసిన ఆమె టేక్ మీ బ్యాక్(నన్ను ఆ సమయానికి తీసుకు వెళ్ళండి) అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇక ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X