హాటెస్ట్ బర్త్ డే ట్రీట్.. బికినీ ఫొటోలతో మతి పోగొడుతున్న హీరోయిన్
బాలీవుడ్ నటి, నాగినీ సీరియల్ ఫేమ్ మౌనీ రాయ్ ఇంటర్నెట్‌ను హీటెక్కిస్తోంది. నాగినీగా బుల్లితెరపై అలరించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో రానున్న మేడిన్ చైనా సినిమాలో ఈ భామ రాజ్‌కుమార్ రావుతో రొమాన్స్ చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తన అందాల విందుతో నెటిజన్స్ మతులు పోగొడుతున్న ఈ అమ్మడు తాజగా తన బర్త్ డే సందర్భంగా స్పెషల్ ట్రీట్ ఇచ్చింది. ఆ సందర్భంగా జరిగిన పార్టీలో మౌనీ రాయ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

థాయ్‌లాండ్‌లో 34వ బర్త్ డే
సెప్టెంబర్ 28 తేదీన మౌనీరాయ్ 34వ బర్త్ డేను సెలబ్రేట్ చేసుకుంది. ప్రస్తుతం థాయిలాండ్‌లో విహరిస్తున్న ఈ అమ్మడు తన పుట్టిన రోజు సందర్భంగా అక్కడి అందాల నడుమ తన అందాలు ఆరబోస్తూ కొన్ని ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. సొనెవా కిరి బీచ్‌లో పింక్ బికినీలో ఎండలో తళతళ మెరుస్తూ దిగిన ఫొటోలను తన బర్త్ డే సందర్భంగా నెటిజన్స్‌కు ట్రీట్‌గా ఇచ్చింది.

సోనేవా కిరి బీచ్‌లో హంగామా
థాయ్‌లాండ్‌లోని సోనెవా కిరి బీచ్‌లో స్నేహితులతో కలిసి మౌనీ తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంది. ‘గెట్ ఇన్ ద మిడిల్: ఐ డేర్ యూ' అంటూ ఈ వేడుకల ఫొటో పోస్టు చేసిన మౌనీ.. ‘వండర్ ల్యాండింగ్.. ఈ వార్మ్ కప్ ప్యారడైజ్' అంటూ బీచ్ అందాలతోపాటు పింక్ బికినీలో తన అందాలను ఆరబోసింది.

నాగిని సీరియల్స్‌తో
బుల్లితెరపై ‘నాగినీ' సీరియల్‌తో సెన్సేషన్ సృష్టించిన మౌనీరాయ్ ‘గోల్డ్' సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాలోనే అక్షయ్ కుమార్ సరసన నటించిన ఈ అమ్మడు తన అందచందాలతో అలరించింది. అనంతరం జాన్ అబ్రహం హీరోగా తెరకెక్కిన ‘రోమియో అక్బర్ వాల్టర్' సినిమాలోనూ మౌనీ నటించింది.
Recommended Video

బ్రహ్మస్త్రలో, మేడిన్ చైనా చిత్రాల్లో
రాజ్‌కుమార్‌రావుతో రొమాన్స్ చేసిన ‘మేడిన్ చైనా' త్వరలో థియేటర్లలోకి రానుండగా.. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘బ్రహ్మాస్త్ర' సినిమాలోనూ మౌనీ నటిస్తోంది. రణ్‌బీర్‌కపూర్, ఆలియా భట్, నాగార్జున ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో మౌనీ కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











