ఆ హీరో దెబ్బకి వణికిపోయిన హీరోయిన్ .. 25 ఏళ్లుగా టాలీవుడ్‌‌కి దూరంగా, ఆ బ్యూటీ ఎవరంటే?

బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమ పరభాషా నటులను కూడా ఆదరించింది. ప్రతిభ ఎక్కడున్నా గుర్తించి వారికి అవకాశాలు ఇవ్వడంలో తెలుగు వారు ముందుంటారు. నార్త్, సౌత్ అన్న తేడా లేకుండా నటీనటులకు అవకాశాలు కల్పిస్తూ వారి ఎదుగుదలకు దోహదపడుతోంది. పాన్ ఇండియా కల్చర్‌కు శ్రీకారం చుట్టిన టాలీవుడ్.. ప్రస్తుతం తన ప్రతి సినిమాలోనూ ఇతర ఇండస్ట్రీలకు చెందిన కళాకారులకు ఛాన్స్ ఇస్తోంది. అలాంటిది అవకాశాలు ఇస్తామన్నా.. దాదాపు 25 ఏళ్లుగా టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్నారు ఓ సీనియర్ హీరోయిన్. ఈ వివరాల్లోకి వెళితే..

రచనా బెనర్జీ.. ఈ పేరు ఇప్పటి తరానికి తెలిసి ఉండకపోవచ్చు కానీ ఓ 20 ఏళ్లు వెనక్కి వెళితే.. తన అందం, అభినయంతో దేశాన్ని ఊపేసింది రచన. బెంగాలీ అమ్మాయే అయినా సౌత్, నార్త్ ఇండస్ట్రీలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. 2 అక్టోబర్ 1972న పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో జన్మించారు రచన. ఆమె అసలు పేరు ఝుంఝం బెనర్జీ. 1990లో మిస్ బెంగాల్‌గా, 1991లో మిస్ కోల్‌కతాగా కిరీటాలను గెలిచిన అరుదైన ఘనత ఆమె సొంతం.

MP Rachna Banerjee recollects Nandamuri Balakrishna s anger during shooting

1993లో సుఖేన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన దన్ ప్రతిదాన్ సినిమాతో ఆమె చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆయనే ఝంఝుం బెనర్జీ అన్న ఆమె పేరును రచనా బెనర్జీగా మార్చారు. బెంగాలీ, ఒడియా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా దున్నేస్తోన్న రచనా 1996లో తమిళ చిత్రం పూవరాసన్‌తో దక్షిణాది ఇండస్ట్రిలో అడుగుపెట్టిన రచనను ఈవీవీ సత్యనారాయణ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. 1997లో నేను ప్రేమిస్తున్నాను చిత్రంతో ఆమె టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు.

కన్యాదానం, రాయుడు, మావిడాకులు, అభిషేకం, బావగారు బాగున్నారా?, పిల్ల నచ్చింది, సుల్తాన్, పెద్ద మనుషులు, అతను వంటి తెలుగు సినిమాలలో నటించారు. చివరిసారిగా వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో నందమూరి హరికృష్ణ నటించిన లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలో కనిపించారు. నాటి నుంచి దాదాపు 25 ఏళ్లుగా టాలీవుడ్‌కు దూరంగానే ఉన్నారు. తన సహచర నటుడు సిద్ధాంత్ మహాపాత్రను 1994లో పెళ్లి చేసుకున్న రచన.. 2004లో ఆయన నుంచి విడిపోయారు. తర్వాత 2007లో ప్రోబల్ బసును వివాహమాడి 2016లో ఆయన నుంచి కూడా విడిపోయారు.

రాజకీయాలపై ఆసక్తితో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సారథ్యంలోని ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో హుగ్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీఎంసీ అభ్యర్ధిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్ధి లాకెట్ ఛటర్జీని దాదాపు 76,853 ఓట్ల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించి పార్లమెంట్‌లో అడుగుపెట్టి రాజకీయాల్లోనూ సక్సెస్ అయ్యారు.

ఇటీవల ఓ తెలుగు ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌లో తాను ఎందరో నటీనటులతో కలిసి పనిచేశానని, ఇక్కడంతా ప్రొఫెషనల్‌గా ఉంటారని మంచి కథలు తెరకెక్కుతాయని తెలిపారు. నేను ప్రేమిస్తున్నాను చిత్రంతో తనకు అవకాశం కల్పించిన ఈవీవీ .. తనకు ఎంతో అండగా నిలిచారని రచన వెల్లడించారు. చిరంజీవి, బాలకృష్ణ వంటి వారు ఎంత పెద్ద స్టార్స్ అయినా కూడా చాలా సింపుల్‌గా ఉంటారని ప్రశంసించారు. అయితే బాలయ్యకు ఊరికే కోపం వచ్చేస్తుందని , సెట్‌లో ఆయన ఆగ్రహాన్ని చూసి కొత్తగా వచ్చిన తనకు చాలా భయం వేసేదని రచన గుర్తుచేసుకున్నారు. టాలీవుడ్ నుంచి ఇప్పటికీ ఆఫర్లు వస్తున్నాయని.. మంచి ప్రాజెక్ట్ అయితే ఖచ్చితంగా రీ ఎంట్రీ ఇస్తానని ఆమె తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X