రవితేజపై భాగ్యశ్రీ బోర్సే హాట్ కామెంట్.. నన్ను అలా ట్రీట్ చేశాడంటూ!

మన తెలుగు సినిమా దగ్గర హీరోయిన్స్ కి కరువెప్పుడూ కనిపించలేదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త హీరోయిన్స్ వచ్చి తెలుగులో మంచి పేరు సంపాదించుకున్న వారు చాలా మందే కనిపిస్తారు. కానీ కేవలం ఒక్క సినిమా ఎక్స్ పీరియన్స్, ఇంకా చెప్పాలంటే తమ మొదటి సినిమా కూడా రిలీజ్ కాకుండా ఆడియెన్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకునే హీరోయిన్స్ కూడా కొద్ది మంది కనిపిస్తారు.

కాగా ఇలాంటి హీరోయిన్స్ లో లేటెస్ట్ గా టాలీవుడ్ లో సెంటరాఫ్ అట్రాక్షన్ గా వినిపిస్తున్న హీరోయిన్ పేరే 'భాగ్యశ్రీ బోర్సే'. కాగా ఈమె తెలుగులో నటించిన మొట్ట మొదటి సినిమా "మిస్టర్ బచ్చన్". మాస్ మహారాజ రవితేజ సరసన హీరోయిన్ గా నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్న ఈమె మొదటి సినిమాకే తన అండ చందాలతో టాలీవుడ్ ఆడియెన్స్ మతి పోగొట్టింది.

mr bachchan actress bhagyasri borse makes interesting comments raviteja in industry

తన గ్లామర్, సినిమాలో ప్రెజెన్స్ డాన్స్ లతో హాట్ టాపిక్ గా మారిన ఈ యంగ్ హీరోయిన్ కోసం చాలా మందే మాట్లాడుకుంటున్నారు. అయితే భాగ్యశ్రీ తాజాగా చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ గా మారాయి. మరి ఈ కామెంట్స్ లో కొన్ని ఆసక్తికర విషయాలు ఆమె వెల్లడించింది. తనని ఓ హీరో తన మొదటి సినిమాకే రాణిలా ట్రీట్ చేసాడు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

మరి ఓ హీరోయిన్ ని ఓ హీరో మొదటి సినిమాకే రాణిలా చూసుకున్నాడు అనే కామెంట్స్ చేయడం అంటే మాములు విషయం కాదనే చెప్పాలి. కాగా ఆ హీరో మరెవరో కూడా కాదు రవితేజనే అట. నన్ను రవితేజ ఒక క్వీన్ లా ట్రీట్ చేసారని తనకి ఎలాంటి పరిస్థితిలో అయినా కూడా రవితేజ ఎంతో సపోర్ట్ గా నిలిచారు అని కొన్ని ఆసక్తికర కామెంట్స్ నే ఇటీవల భాగ్యశ్రీ చేయడం వైరల్ గా మారింది.

అయితే ఇప్పుడు వరకు రవితేజ చాలా మంది యువ హీరోయిన్స్, కొత్త వారితో వర్క్ చేసాడు. గడిచిన సినిమాల్లోనే చూస్తే ఖిలాడీ సినిమాకి మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి లాంటి కొత్త హీరోయిన్స్ కూడా తన సినిమాలతోనే పరిచయం అయ్యారు. కానీ వారెవరూ చేయని కామెంట్స్ భాగ్యశ్రీ చేయడం అనేది ఒకింత ఆశ్చర్యంగానే ఉందని చెప్పాలి. మరి ఇది తనపై ఉన్న అభిమానంతో చెప్పిందో లేక వేరే ఏమన్నానా అనేది వారికే తెలియాలి.

కాగా ఈ చిత్రాన్ని మేకర్స్ బాలీవుడ్ హిట్ చిత్రం "రైడ్" కి రీమేక్ గా తెరకెక్కించగా జగపతిబాబు విలన్ గా నటించారు. అలాగే సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ స్వరాలు అందించగా టిజి విశ్వ ప్రసాద్ నిర్మాణం వహించారు. ప్రస్తుతానికి మంచి బజ్ లోనే ఉన్న ఈ సినిమా ఈ స్వాతంత్ర దినోత్సవం కానుకగా ఆగస్ట్ 15 విడుదలకి రాబోతుంది.

కాగా దీనికి ఒక రోజు ముందే ఈ చిత్రం అంటే ఆగస్ట్ 14 సాయంత్రం నుంచే తెలుగు రాష్ట్రాల్లో పైడ్ ప్రీమియర్స్ తో పలకరించనుంది. ప్రస్తుతానికి అయితే కొత్త హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే "మిస్టర్ బచ్చన్" ఫలితం పైనే అన్ని హోప్స్ పెట్టుకుంది. మరి ఈ సినిమాతో ఈమె టాలీవుడ్ లో హిట్ కొడుతుందో లేదో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X