నవ్వాను, ఏడ్చాను.. ఎన్నో కలలు కన్నా.. చివరికి , మిస్టర్ బచ్చన్ హీరోయిన్ షాకింగ్ పోస్ట్

మరికొద్దిరోజుల్లో 2024కు ఎండ్ కార్డ్ పడనుంది. పాత క్యాలెండర్ ప్లేస్‌లో కొత్త క్యాలెండర్ రానుంది. ఈ ఏడాది ఎన్నో విజయాలు, తీపి గుర్తులు, జ్ఞాపకాలు, ఆనందాలు , పరాజయాలు ఉన్నాయి. వాటన్నింటిని తలచుకుంటూ కొత్త సంత్సరంలోకి అడుగుపెడుతోంది ప్రపంచం. సామాన్యులే కాదు ప్రముఖులకు కూడా 2024 ఎన్నో జ్ఞాపకాలను అందించింది. ఇలాంటి మెమొరీస్‌ను పంచుకున్నారు యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే.

ఈ ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమలో భాగ్యశ్రీ బోర్సే అడుగుపెట్టారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమాలో ఆమెకు హీరోయిన్‌గా అవకాశం దక్కింది. మంచి హైట్, వైట్ స్కిన్ టోన్ , హాట్ లుక్స్ ఉండటం భాగ్యశ్రీకి కలిసొచ్చే అంశం. మిస్టర్ బచ్చన్‌లో ఆమె అందాలను అద్భుతంగా చూపించి సినిమాకు హైప్ తీసుకొచ్చారు దర్శకుడు హరీష్ శంకర్. టీజర్, ట్రైలర్, పోస్టర్లలో భాగ్యశ్రీ నడుము, నాభి అందాలతో భాగ్యశ్రీ కుర్రాళ్లకు నిద్రలేని రాత్రులను మిగిల్చింది.

mr Bachchan fame Bhagyashrii Borse emotional post on 2024

స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఆగస్ట్ 15న రిలీజైన మిస్టర్ బచ్చన్‌కు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. సినిమా కంటే పాటలే అద్భుతంగా ఉన్నాయని సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు దర్శకుడు హరీష్ శంకర్‌ను ట్రోల్ చేశారు. దీనికి హరీశ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారనుకోండి అదే వేరే విషయం. అయితే మిస్టర్ బచ్చన్ రిలీజ్ కాకముందే భాగ్యశ్రీకి ఆఫర్లు క్యూకట్టాయి. అయితే తొలుత ఈ సినిమాకు ఆమె ఓకే చెప్పారు.

సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఈ ముద్దుగుమ్మ క్రేజీ ఆఫర్లు పట్టేస్తోంది. వైజయంతీ మూవీస్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలు కొత్త నిర్మించనున్న సినిమాలలో భాగ్యశ్రీని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే భాగ్యశ్రీ బోర్సే ఎప్పటికప్పుడు సినిమాలు, తన షోలు, ఫోటోలు, ఇతర వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ట్రెండీ వేర్‌లో హాట్ హాట్ ఫోటో షూట్‌లు చేసి దానికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తుంటారు. కొద్దిరోజుల క్రితం వైట్ కలర్ టీ షర్ట్, బ్లూ జీన్స్ ధరించి నడుము అందాలను చూపిస్తూ భాగ్యశ్రీ చేసిన ఫోటో షూట్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది.

తాజాగా 2024కు ఎండ్ కాడ్ పడనున్న దశలో భాగ్యశ్రీ తన ఇన్‌స్టాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. 2024కి ఇంత త్వరగా ఎండ్ కార్డ్ పడుతుందంటే నమ్మలేకపోతున్నా .. కొత్త ప్రారంభంతో కొత్త ఏడాది మన ముందుకు రాబోతోందని ఆమె పేర్కొన్నారు. నేను నవ్వాను, ఏడ్చాను, ఎన్నో కలలు కన్నాను.. కష్టాలు చూశాను కానీ నేను చెప్పేది ఒక్కటే.. మీ అందరికీ నేను కృతజ్ఞురాలిని అంటూ భాగ్యశ్రీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. కొత్త ఏడాది మీకు బాగా కలిసి రావాలని కోరుకుంటున్నామంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Read more about: bhagyashri borse movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X