సీత.. నన్ను పెళ్లి చేసుకొంటావా? నెటిజన్ ప్రశ్నకు మృణాల్ దిమ్మతిరిగే సమాధానం ఏమిటంటే?
అందాల భామ మృణాల్ ఠాకూర్ దక్షిణాదిలో భారీ ప్రాజెక్టులతో బిజీగా మారిపోయింది. సీతారామం సినిమా మృణాల్ కెరీర్‌ను మలుపు తిప్పింది. సీతారామం సినిమా విజయం తర్వాత దేశవ్యాప్తంగా ఈ అందాల భామకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తర్వాత దక్షిణాదిలో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తూ సోషల్ మీడియాలో ఫోటోలతో, దుమారం సృష్టిస్తున్నది. అయితే తాజాగా పోస్టు వీడియోపై ఓ నెటిజన్ స్పందించిన తీరుకు మృణాల్ ఎలాంటి సమాధానం ఇచ్చిందంటే?

మరాఠీ చిత్రం ద్వారా సినిమాల్లోకి
మృణాల్ ఠాకూర్ కెరీర్ విషయానికి వస్తే.. విట్టి దండు అనే మరాఠీ సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. తొలి నాళ్లలో మరాఠీ చిత్రాల్లోనే నటించింది. ఆ తర్వాత లవ్ సోనియా అనే సినిమాతో హిందీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. లవ్ సోనియా సినిమాకు మంచి రెస్సాన్ రావడంతో మృణాల్ జీవితం మలుపు తిరిగింది.

హృతిక్ రోషన్‌తో సినిమా తర్వాత
హృతిక్ రోషన్‌తో సూపర్ 30 చిత్రంలో మృణాల్ నటించడంతో ఆమె కెరీర్ మరో మెట్టు ఎక్కింది. ఈ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు వెతుక్కొంటూ వచ్చాయి. ఘోస్ట్ స్టోరీస్, తూఫాన్, ధమాకా, జెర్సీ లాంటి సినిమాలతో తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకొన్నది. ఆ తర్వాత దక్షిణాది వైపు దృష్టి నిలిపింది.

సీతారామంతో జాతకం మారిపోయి..
తెలుగు సినిమా పరిశ్రమలో సంచలన విజయం సాధించిన సీతారామం సినిమా మృణాల్ ఠాకూర్‌ను స్టార్ హీరోయిన్‌గా మార్చేసింది. సీతారామంలోని సీత పాత్ర ఆమెకు ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. హిందీ మార్కెట్‌ను కూడా పెంచేలా చేసింది. తాజాగా అక్షయ్ కుమార్ నటించిన సెల్ఫీ చిత్రంలో అతిథి పాత్రతో మెరిసింది.

సోషల్ మీడియాలో వీడియోపై
సోషల్ మీడియాలో హల్‌చల్ రేపుతున్న మృణాల్ సేన్ తాజాగా ఓ వీడియోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఓ తమిళ పాటను బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి.. తన అందాలను వీడియోలో ప్రదర్శించింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఆమెను రకరకాలుగా ప్రశంసలు గుప్పించారు. అయితే ఆమె అందానికి ఫిదా అయిన నెటిజన్ నన్ను పెళ్లి చేసుకొంటావా అని ప్రపోజ్ చేశారు.

నిన్ను పెళ్లి చేసుకొంటాను అంటూ
మృణాల్ నీ అందానికి పడిపోయాను. నేను నిన్ను పెళ్లి చేసుకొందామని అనుకొంటున్నాను. నా తరఫు నుంచి నిర్ణయం పక్కా. నీ సమాధానం ఏమిటని ప్రశ్నిస్తే.. నెటిజన్‌ను జవాబిస్తూ.. నేను నిన్ను పెళ్లి చేసుకొనే ఉద్దేశం లేదు. ఇదే నా జవాబు అని ముఖం మీదే చెప్పేసింది. వీడియోలోని మృణాల్ కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మృణాల్ ఠాకూర్ సినిమాలు..
మృణాల్ ఠాకూర్ సినిమాల విషయానికి వస్తే.. గుమ్రా, పూజా మేరీ జాన్, పిప్పా, ఆంఖ్ మిచోలి, నాని30 చిత్రాల్లో నటిస్తున్నారు. ఇంకా కొన్ని తమిళ సినిమాలు, ఇతర ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. వాటిని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











