Dhanush- Mrunal thakur: ధనుష్‌తో డేటింగ్? అతనితో నా రిలేషన్ అదేనంటూ తేల్చేసిన మృణాల్ ఠాకూర్
టాలీవుడ్, బాలీవుడ్‌లలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న మృణాల్ ఠాకూర్‌కు పలువురితో ఎఫైర్స్ ఉన్నాయంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత కొద్దిరోజుల నుంచి కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో ఈమె రిలేషన్‌లో ఉన్నారని.. కొంతకాలంగా ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా ఈ పుకార్లపై మృణాల్ ఠాకూర్ స్పందించింది. ఈ వివరాల్లోకి వెళితే..
నార్త్, సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా మృణాల్
సౌత్, నార్త్‌లో మృణాల్ ఠాకూర్ డిమాండ్ ఉన్న హీరోయిన్. సీతారామంతో తెలుగు వారిని పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్ సినిమాలతో కనికట్టు చేశారు. గ్లామర్‌తో పాటు నటనలోనూ తిరుగులేదని నిరూపించుకున్న మృణాల్‌కు అవకాశాలు క్యూకడుతున్నాయి. తెలుగు, హిందీలలో పలు చిత్రాల్లో ఆమె నటిస్తున్నారు. టాలీవుడ్ కంటే బాలీవుడ్‌లోనే గుర్తింపు సంపాదించాలని మృణాల్ ప్రయత్నిస్తున్నారు. కానీ ఆమెకు అదృష్టం కలిసిరావడం లేదు. రీసెంట్‌గా చేసిన సన్నాఫ్ సర్థార్ 2 కూడా ఫ్లాప్ కావడంతో నిరాశకు గురయ్యారు మృణాల్.

ఒంటరిగా ధనుష్
ఇక 30 ప్లస్‌లో ఉన్న మృణాల్ ఠాకూర్ పెళ్లి గురించి పలు సందర్భాల్లో గాసిప్స్ వచ్చాయి. సీరియల్ నటులు, సింగర్స్, స్టార్లతో ఆమెకు రిలేషన్ పెట్టేశారు. కానీ అవేవీ నిజం కాలేదు. కొద్దిరోజుల క్రితం బాలీవుడ్ సూపర్‌స్టార్ అజయ్ దేవగణ్ నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2 స్పెషల్ స్క్రీనింగ్‌కు ధనుష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మృణాల్‌తో చేతిలో చేయ్యేసి చాలా క్లోజ్‌గా ఉన్న ధనుష్ వీడియోలు వైరల్ అయ్యాయి. అప్పుడు రాజుకున్న ఈ రచ్చ .. నేటికీ కొనసాగుతోంది. ఐశ్వర్యకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటున్న ధనుష్ ఇప్పటికీ పలువురు హీరోయిన్లతో ఎఫైర్లు నడుపుతున్నాడంటూ గత కొంతకాలంగా వార్తలు వచ్చాయి. ఏకంగా సీనియర్ నటి మీనాతోనూ ఆయనకు లింక్ పెట్టేశారు. కుబేర సక్సెస్‌తో మరోసారి నేషనల్ వైడ్ పాపులారిటీ సంపాదించారు ధనుష్.
ధనుష్‌తో క్లోజ్‌గా మృణాల్ ఠాకూర్
సన్ ఆఫ్ సర్థార్ 2 ఈవెంట్ తర్వాత ధనుష్ సోదరీలను ఇన్‌స్టాగ్రామ్‌లో మృణాల్ ఠాకూర్ ఫాలో కావడంతో వీరిద్దరి మధ్య డేటింగ్ రూమర్స్ మరింత హీటెక్కాయి. మృణాల్‌ను ధనుష్ తన కుటుంబ సభ్యులకు పరిచయం చేశారని, త్వరలోనే వీరిద్దరి పెళ్లి జరుగుతుందని వార్తలు గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఇంత జరుగుతున్నా ధనుష్ కానీ, మృణాల్ కానీ ఏమాత్రం స్పందించకపోవడంతో పుకార్లకు అడ్డుకట్ట పడలేదు.
డేటింగ్ రూమర్స్‌పై క్లారిటీ
అయితే తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుండటంతో మృణాల్ ఠాకూర్ స్పందించారు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... ధనుష్ తనకు మంచి మిత్రుడు మాత్రమేనని, ఆయనతో తాను డేటింగ్ చేస్తున్నట్లుగా వార్తలు రావడం గురించి నేను కూడా విన్నానని మృణాల్ చెప్పారు. వాటిని చూడగానే నాకు నవ్వొచ్చిందని.. సన్నాఫ్ సర్థార్ 2 ఈవెంట్‌కు ధనుష్ వచ్చినప్పటి నుంచి మా ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందని తప్పుగా అనుకుంటున్నారని ఆమె మండిపడ్డారు. నిజానికి ధనుష్- అజయ్ దేవగణ్‌లు మంచి మిత్రులని.. అజయ్ సార్ పిలిస్తేనే ధనుష్ ఆ కార్యక్రమానికి వచ్చారని అసలు నిజం చెప్పారు మృణాల్. ఇద్దరం క్లోజ్‌గా ఉన్నంత మాత్రాన మా మధ్య ఏదో జరుగుతున్నట్లు కాదని ఆమె కుండబద్ధలు కొట్టారు. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఇకపై ఈ డేటింగ్ వార్తలకు ఎండ్ కార్డ్ పడుతుందా? లేక ఇలాగే కొనసాగుతాయా? అన్నది చూడాలి.


Click it and Unblock the Notifications











