మొన్న ధనుష్.. నిన్న శ్రేయస్ అయ్యర్.. డేటింగ్ రూమర్‌పై మృణాల్ రియాక్షన్..
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె ' సీతారామం' సినిమాలో సీతగా, హాయ్ నాన్న చిత్రంలో ' యష్న'గా నటించి, మెప్పించారు. తెలుగు ప్రేక్షకుల మనసులో చిరకాలం గుర్తు ఉండే పాత్రలలో మెరిశారు. ఇటీవల కాలంలో ఆమె తరచుగా తన సినిమాల ద్వారా కాకుండా డేటింగ్ రూమర్స్ ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.ఇటీవల టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌తో డేటింగ్ లో ఉన్నారంటూ..సోషల్ మీడియాలో రూమార్స్ క్రియేట్ అయ్యాయి. అయితే ఈ గాసిప్స్‌పై మృణాల్ స్వయంగా స్పందించారు. ఇంతకీ ఏమన్నారంటే?
మృణాల్‌పై డేటింగ్ రూమర్స్ కొత్తవి కావు. మృణాల్ కెరీర్ మొదట్లోనే 'కుమ్‌కుమ్ భాగ్య' నటుడు శరద్ త్రిపాఠితో ఆమె సంబంధం పెళ్లి వరకు వెళ్లిందని కథనాలు వచ్చాయి. ఆ తర్వాత ఆర్జిత్ తనేజా, సిద్ధాంత్ చతుర్వేది, రాపర్ బాద్షా, కుశాల్ టాండన్ వీరందరితోనూ ఆమెకు సంబంధం ఉందన్న ఊహాగానాలు రేకెత్తాయి. శిల్పా శెట్టి ఇంట్లో జరిగిన కార్యక్రమంలో బాద్షాతో ఆమె క్లోజ్‌గా కనిపించడం, ఇటీవల టాలీవుడ్ హీరో సుమంత్‌తో కనిపించిన ఫోటోలు కూడా మీడియాలో చర్చకు దారి తీసాయి. ప్రతిసారీ మృణాల్ "మేము కేవలం ఫ్రెండ్స్ మాత్రమే" అంటూ రూమర్స్‌ను కొట్టిపారేశారు.

మొన్నటి మొన్న తమిళ స్టార్ హీరో ధనుష్‌తో ఆమె రిలేషన్‌లో ఉందని బీటౌన్‌లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. "ధనుష్ నా స్నేహితుడు మాత్రమే" అంటూ అప్పట్లోనే ఆమె క్లియర్ చేశారు. సన్ ఆఫ్ సర్దార్ స్క్రీనింగ్ లో చేతి పట్టుకున్న వీడియో... ధనుష్ కుటుంబ సభ్యులను ఇన్‌స్టాలో ఫాలో కావడం వంటి సంఘటనలు రూమర్స్‌కు బలం చేకూర్చినప్పటికీ, మృణాల్ మాత్రం ఎప్పుడూ అవి కేవలం ఊహాగానాలేనని చెప్పింది.
తాజాగా టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ పేరు రావడం మరో కొత్త మలుపు. ఆస్ట్రేలియా సిరీస్‌లో ఈ క్రికెటర్‌తో మృణాల్ కనిపించడంతో డేటింగ్‌లో ఉన్నారని సోషల్ మీడియాలో రూమర్స్ క్రియేట్ అయ్యాయి. తమ రిలేషన్‌ను ఇద్దరూ గోప్యంగా ఉంచుతున్నారన్న కథనాలు వైరల్ అయ్యాయి. ఈ ఊహాగానాలు పెరుగుతున్న తరుణంలోనే ఆమె నేరుగా స్పందించారు. ఈ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్.. శ్రేయస్ అయ్యర్‌తో డేటింగ్ రూమార్స్ పై స్పందించారు. "ఇలాంటి రూమర్స్ వినడమే హాస్యాస్పదం. ఎవరో కథలను సృష్టిస్తారు... వాటిని చూసి నేను నవ్వుకుంటాను. ఇవన్నీ ఫ్రీ పీఆర్ స్టంట్స్" అంటూ స్పష్టత ఇచ్చారు. ఈ ఒక్క వ్యాఖ్యతోనే ఆమె ఒకసారి మరలా డేటింగ్ ఊహాగానాలపై గట్టి చెక్ పెట్టారు.అయితే మృణాల్ స్పష్టమైన స్పందనతో, ఈ రూమర్స్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లే కనిపిస్తోంది.
మృణాల్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల 'సన్నాఫ్ సర్దార్ 2'తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆమె, హిందీలో 'దో దీవానే నగర్ మే' సహా మరో రెండు ప్రాజెక్టుల్లో నటిస్తోంది. తెలుగులో అడివి శేష్ సరసన 'డెకాయిట్' చిత్రంతో కూడా బిజీగా ఉంది. అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్ సినిమాలో ఆమె ఎంపిక అయ్యిందనే వార్తలు వినిపిస్తున్నా, ఇంకా అధికారిక ప్రకటన లేదు. టాలీవుడ్-బాలీవుడ్ వరుస అవకాశాలు అందుకుంటుంది


Click it and Unblock the Notifications











