Mrunal Thakur: ధనుష్‌తో పెళ్లి.. మృణాల్ థాకూర్ తొలిసారి మనసులో మాట!

చిత్ర పరిశ్రమలో ఎందరో హీరో హీరోయిన్ల మధ్య ఎఫైర్ సాగుతున్నట్లు కొన్ని వేల సార్లు గాసిప్స్ వైరల్ అయ్యుంటాయి. వీటిలో కొన్ని నిజమైతే.. మరికొన్ని గాలివార్తలుగా మిగిలిపోయాయి. అయితే ఒకే హీరోయిన్ మీద ఎక్కువ సార్లు గాసిప్స్ వచ్చిన చరిత్ర మాత్రం ఒకరిదే. ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు.. మృణాల్ థాకూర్. కెరీర్ ప్రారంభం నుంచి నేటి వరకు మృణాల్‌కు ఎందరో స్టార్ హీరోలతో ఎఫైర్ ఉన్నట్లు, డేటింగ్ చేస్తున్నట్లుగా పుకార్లు వచ్చాయి. అయితే గత కొద్దినెలలుగా తమిళ స్టార్ హీరో ధనుష్‌తో మృణాల్ ప్రేమాయణం సాగిస్తోందని రూమర్స్ వస్తున్నాయి. రోజులు గడుస్తున్నా వీటికి మాత్రం చెక్ పడటం లేదు. తాజాగా దీనిపై మృణాల్ థాకూర్ స్వయంగా స్పందించింది. ఈ వివరాల్లోకి వెళితే..

ఐశ్వర్యతో పెళ్లి, విడాకులు
ఇండస్ట్రీలో ఒక హీరో మరో హీరోయిన్‌తో ఫోటో దిగినా.. సన్నిహితంగా ఉన్నట్లు కనిపించినా సంథింగ్.. సంథింగ్ అంటూ మీడియాలో గాసిప్స్ వైరల్ అవుతాయి. అలా గత కొద్దిరోజులుగా ఓ రూమర్‌కి ధనుష్, మృణాల్ థాకూర్‌లు కేంద్ర బిందువులుగా మారారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ధనుష్. 18 ఏళ్ల పాటు వీరి బంధం అన్యోన్యంగానే సాగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా. అయితే గతేడాది వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. దాంతో ధనుష్ వ్యక్తిగత జీవితంపై పలు రూమర్స్ వైరల్ అవుతున్నాయి.

Mrunal Thakur Breaks Silence on Dhanush Dating and Marriage Rumours

ఆ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా ధనుష్
సీనియర్ నటి మీనాను ధనుష్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా పుకార్లు రావడంతో వీటికి ఇద్దరూ చెక్ పెట్టారు. ఈ వివాదం సద్దుమణిగిందో లేదో కానీ బాలీవుడ్ నటి మృణాల్ థాకూర్‌తో ధనుష్ డేటింగ్ చేస్తున్నట్లుగా గడిచిన ఏడాది కాలంగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. మృణాల్ నటించిన సన్ ఆఫ్ సర్థార్ 2 మూవీ ఈవెంట్‌కు ధనుష్ చీఫ్ గెస్ట్‌గా వెళ్లడంతో ఈ పుకార్లకు బీజం పడింది. ఈ వెంటనే మరో మృణాల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ధనుష్ ప్రత్యక్షం కావడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరింది.

మృణాల్ - ధనుష్‌ల పెళ్లిపై ఏఐ వీడియో
పలు సందర్భాలలో ధనుష్, మృణాల్‌లు ఎక్కువగా కనిపించడంతో ఈ జంట పీకల్లోతు ప్రేమలో ఉందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ఊహాగానాలు వినిపించాయి. ఇది ఏ స్థాయికి చేరిందంటే ఏఐ టెక్నాలజీ సాయంతో ధనుష్- మృణాల్‌లు సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నట్లు.. వీరి పెళ్లికి సినీ ప్రముఖులు హాజరై ఆశీర్వదించినట్లుగా ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. వీటిని చూసిన సామాన్యులు నిజంగానే మృణాల్ మెడలో ధనుష్ మూడు ముళ్లు వేశారని ఫిక్స్ అయిపోయారు. అయితే సినీ వర్గాలు దీనిని ఖండించాయి.

నా జీవితంపై జనానికి ఆసక్తి ఏంటో?
ధనుష్‌ని తాను పెళ్లి చేసుకోబోతున్నట్లుగా రోజురోజుకు గాసిప్స్ ఎక్కువ అవుతుండటంతో మృణాల్ స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. నా పని నన్ను పరిచయం చేసుకోవడం.. గాసిప్ కాదని ఎప్పుడూ నమ్ముతాను. అయినప్పటికీ నేను ఎప్పుడూ రాయని కథలు, ఎప్పుడూ అనని మాటలు, ఎప్పుడూ తీసుకోని నిర్ణయాలతో నా పేరు ముడిపడి ఉంటోంది. ఇటీవల నా పెళ్లిపై వివాదం జరుగుతోంది. దీనిపై నేను చాలా గట్టిగా చెప్పాలని అనుకుంటున్నాను. ధనుష్ నాకు సోదరుడి లాంటివారు. పరస్పర గౌరవం, వృత్తి నైపుణ్యాన్ని పరస్పరం పంచుకుంటాం. మహిళా నా ప్రయాణాన్ని అంగీకరించడానికి బదులు.. ఆమె వ్యక్తిగత జీవితం గురించి కథలను సృష్టించడానికి జనం ఆసక్తికి నేను ఆశ్చర్యపోతున్నాను.

క్లిక్స్, లైక్స్, షేర్ల కోసం దారుణంగా
నేను మౌనంగా ఉండటానికి కారణం ఏదో దాయాలని కాదు.. నా వ్యక్తిగత జీవితానికి ప్రజల ఆమోదం అవసరం లేదు. ఆడిషన్లు, తిరస్కరణలు, నిద్రలేని రాత్రలు, అవిశ్రాంత్రమైన ఆత్మవిశ్వాసం ద్వారా నేను ఈ స్థితికి చేరుకోవడానికి ఎంతో కష్టపడ్డాను. ఆ ప్రయాణాన్ని ఓ పుకారుతో తగ్గించడం అన్యాయం. సోషల్ మీడియా అందరికీ ఒక గళాన్ని ఇస్తుంది. కానీ అది బాధ్యతను కూడా కోరుతుంది. కొన్ని క్లిక్స్, లైక్స్, షేర్‌లు మీకు హానిచేయనివిగా అనిపించవచ్చు... కానీ అవి నిజమైన వ్యక్తులను ప్రభావితం చేసే కథనాలకు దారితీస్తాయి. నేను స్పష్టంగా చెబుతున్నా.. ఈ పుకార్లలో నిజం లేదని మృణాల్ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆమె ట్వీట్ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. మరి దీనిపై నెటిజన్లు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More from Filmibeat

Read more about: mrunal thakur dhanush movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X