ధనుష్‌తో పెళ్లి రూమర్లపై మృణాల్ క్లారిటీ.. ఫిబ్రవరి 14 అంటే..
Mrunal Thakur- Dhanush: ఇటీవల సోషల్ మీడియాలో హీరో ధనుష్- హీరోయిన్ మృణాల్ ప్రేమ, పెళ్లి, డేటింగ్ అంశాల్లో వరుసగా వార్తల్లో ఉంటున్నారు. ఇక కొందరూ అయితే.. ధనుష్ ను ఆమె ఫిబ్రవరి 14న వివాహం చేసుకోబోతున్నారంటూ పుకార్లు క్రియేట్ చేయగా, మరికొందరూ ఏకంగా ఏఐ (AI) జనరేటెడ్ వీడియోలను క్రియేట్ చేసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ ఫోటోలు, వీడియోలు నెట్టింట దావానలంలా వ్యాపించాయి. ఈ వార్తలపై హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) స్పందించారు. ఇంతకీ ఏమన్నారంటే?
మృణాల్ నటించిన 'దో దివానే షెహర్ మే' ఫిబ్రవరి 20న విడుదల కానుంది.ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన మృణాల్ ఠాకూర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అలాగే, ఇటీవల సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన ధనుష్-మృణాల్ పెళ్లి వార్తలకు నటి మృణాల్ ఠాకూర్ స్వయంగా చెక్ పెట్టింది. తమిళ స్టార్ ధనుష్ ను ఆమె ఫిబ్రవరి 14న వివాహం చేసుకోబోతున్నారంటూ వచ్చిన కథనాలు, ఏఐ వీడియోలపై ఘాటుగా స్పందించారు. 'ఫిబ్రవరి 14 నాకు ఏప్రిల్ ఫూల్స్ డేలా అనిపిస్తోంది'అంటూ సెటైర్లు వేసింది.

ఇందులో హోస్ట్ పెళ్లి గురించి పరోక్షంగా అడగగా మృణాల్ క్లియర్‌గా స్పందించింది. 'నేను ఏమీ చెప్పకపోయినా, నేనే అన్నట్టు రాసేస్తున్నారు. ఎవరు ఈ రూమర్స్ స్టార్ట్ చేశారో కూడా తెలియదు. ఇది నిజంగా భయానకంగా ఉంది' అంటూ మీడియా ఊహాగానాలపై అసహనం వ్యక్తం చేసింది.
అంతకుముందు ఒక ప్రమోషనల్ ఈవెంట్‌లో ఓ రిపోర్టర్ 'చెన్నైకి సంబంధించిన ప్రశ్నలు' అడగగానే సిద్ధాంత్ మృణాల్ వైపు చూపిస్తూ, 'చెన్నై ప్రశ్న ఈమెకా? నాకా?' అంటూ సరదాగా టీజ్ చేశాడు (ధనుష్ చెన్నైకి చెందినవాడు కావడం వల్ల). దీనికి మృణాల్ నవ్వుతూ కవర్ చేసుకోవడం కూడా వైరల్ అయ్యింది.
అసలు రూమర్స్ ఎలా మొదలయ్యాయి?
2025లో ధనుష్ సినిమా 'తేరే ఇష్క్ మే'(Tere Ishq Mein) ర్యాప్ పార్టీకి మృణాల్ హాజరవడం, ఆ తర్వాత 'సన్ ఆఫ్ సర్దార్ 2'ప్రీమియర్‌లో ధనుష్‌ను ఆప్యాయంగా ఆహ్వానించి, హగ్ చేసుకోవడంతో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. దీనికితోడు ఏఐ జనరేటెడ్ పెళ్లి వీడియోలు బయటకు రావడంతో 'ఫిబ్రవరి 14న పెళ్లి' అంటూ ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. పెళ్లి అని టాక్ వచ్చినా, అధికారికంగా ఎవరూ స్పందించలేదు. అయితే ఇప్పుడు మృణాల్ స్పష్టంగా ఖండించడంతో ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి.
మృణాల్ ఠాకూర్ కెరీర్ విషయానికి వస్తే.. తెలుగులో సీతా రామం సంచలన విజయాన్ని సాధించింది. ఆ నటికి ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. వరుస విజయాలతో దూసుకెళ్తుంది. ప్రస్తుతం ఆమె హిందీలో 'దో దివానే షెహర్ మే' ఫిబ్రవరి 20న విడుదల కానుంది. తెలుగులో అడివి శేష్‌తో 'డెకాయిట్' చేస్తోంది. అలాగే అట్లీ-అల్లు అర్జున్ సినిమాలో కూడా ఆమె నటించే అవకాశం ఉందని టాక్.
ఇక ధనుష్ విషయానికి వస్తే, ధనుష్ ప్రస్తుతం 'కారా', రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో మరో సినిమా చేస్తోంది ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రూమర్లపై ఇప్పటివరకు ఆయన స్పందించకపోయినా, మృణాల్ ఇచ్చిన తాజా క్లారిటీతో ఈ వ్యవహారం కాస్త చల్లారిందనే చెప్పాలి.


Click it and Unblock the Notifications











