BreakUp: ధనుష్‌తో మృణాల్ థాకూర్ బ్రేకప్.. కారణం ఏమిటంటే?

సినీ పరిశ్రమలో డేటింగ్, అఫైర్, బ్రేకప్ వార్తలు క్రేజ్ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. అయితే ఇటీవల మీడియాలో ఎక్కువగా చర్చనీయాంశమైన సెలబ్రిటీలు ఎవరంటే స్టార్ హీరో ధనుష్, హీరోయిన్ మృణాల్ థాకూర్. వీరిద్దరూ ప్రేమపక్షుల్లా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారనే విషయంపై రకరకాల కథనాలు బయటకు వచ్చాయి. వారిద్దరి డేటింగ్ వ్వహారం హాట్ టాపిక్‌గా మారింది. అయితే ప్రస్తుతం వారిద్దరూ బ్రేకప్ చెప్పుకొన్నారనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. వీరి బ్రేకప్ వెనుక కారణం ఏమిటి? ఇద్దరి డేటింగ్ ఎలా మొదలైందనే వివరాల్లోకి వెళితే..

రజనీకాంత్ కూతురుతో వైవాహిక బంధం విచ్చిన్నమైన తర్వాత ఒంటరిగా ఉన్న ధనుష్ పర్సనల్ లైఫ్‌పై అటెన్షన్ పెరిగింది. ఆ సమయంలోనే మృణాల్ థాకూర్ నటించిన సన్నాఫ్ సర్దార్ 2 సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ధనుష్ మీడియాకు చిక్కారు. ఆ తర్వాత తెరే ఇష్క్ మే సినిమా సెలబ్రేషన్ ఈవెంట్‌లో మృణాల్‌తో ఆయన చనువుగా సన్నిహితంగా ఉండటం, ఆ తర్వాత వారిద్దరూ కలిసి కనిపించడంతో డేటింగ్ చేస్తున్నారనే వార్త మీడియాకు చిక్కింది. దాంతో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.

Mrunal Thakur Breakup with Dhanush

అయితే మృణాల్, ధనుష్ డేటింగ్ వ్యవహారం కొనసాగుతుండగానే.. వారి పెళ్లి వార్త బాంబులా పేలింది. ఇద్దరు కూడా వాలంటైన్ డే 2026 అంటే ఫిబ్రవరి 14వ తేదీన పెళ్లి చేసుకొనేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకొన్నారనే వార్త వైరల్ అయింది. అయితే వారిద్దరి నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో అంతా ఉత్తుత్తి వార్తనే అనే విషయం స్పష్టమైంది. అయితే అలా వారిద్దరి డేటింగ్ వ్యవహారం చాటుమాటుగా కొనసాగుతూనే ఉందనే రూమర్లు బాగానే వినిపించాయి.

అయితే ధనుష్‌తో మృణాల్ తెగతెంపులు చేసుకొన్నది. ఇద్దరు తమ ప్రేమ బంధానికి ముగింపు పలికారు. ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలు తలెత్తడంతో వాటిని పరిష్కరించుకొనేందుకు ప్రయత్నించారు. కానీ ఇద్దరు తమ కెరీర్లను దృష్టిలో పెట్టుకొని తమ రిలేషన్‌షిప్‌కు ముగింపు పలకాలని నిర్ణయం తీసుకొన్నారు అనే విషయం తాజాగా బయటకు వచ్చింది. అయితే తమ డేటింగ్ వ్యవహారంపై గానీ, బ్రేకప్ వ్యవహారంపై గానీ ఇద్దరు ఏనాడు స్పందించకపోవడంతో ఈ వార్త ఇంకా ఊహాగానాలకే పరిమితమైంది.

అయితే ఇటీవల జాతీయ మీడియా జూమ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ.. తన రిలేషన్‌షిప్ స్టేటస్‌పై స్పందించారు. తాను ఒంటరిగానే ఉన్నానని, తనకు ఎవరితో ఎలాంటి బంధం లేదు అని స్పష్టీకరించింది. ప్రస్తుతం నేను ట్రాన్సిషియన్ పిరియడ్‌లో ఉన్నాను. అసలు ఏ విషయం లేని దాని గురించి ఏం మాట్లాడాలి. నేను కొత్త ప్రేమను వెతుక్కొనే పనిలో ఉన్నాను. ఎలాంటి రిలేషన్‌షిప్ వ్యవహారాన్ని అభిమానులకు దూరంగా ఉంచేందుకు ఇష్టపడుతాను అని జవాబిచ్చారు.

మృణాల్ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల డెకాయిట్ సినిమాతో సక్సెస్ అందుకొన్నారు. అలాగే హై జవానీ తో ఇష్క్ హోనా హై సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం పూజా మేరీ జాన్, రాకా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇంకా కొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి.

Read more about: mrunal thakur dhanush kollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X