ఆ హీరో లేకపోతే నేను లేను.. నా అదృష్టం అతడే అంటున్న మృణాల్ !

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్... ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం అడివి శేష్ తో కలిసి నటిస్తున్న 'డెకాయిట్'తో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఏప్రిల్ 10న గ్రాండ్‌గా విడుదల కానున్నది. తాజాగా ఓ పాడ్ కాస్ట్ తో తన కెరీర్ టర్నింగ్ పాయింట్ గురించి, అలాగే ఓ బాలీవుడ్ స్టార్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ నటుడు ఎవరు? అంత స్పెషల్ ఏంటీ ?

మృణాల్ ఠాకూర్ .. బాలీవుడ్‌లో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించి, టాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగింది. సీతా రామం సినిమాతో మృణాల్ ఠాకూర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. హను రాఘవపూడి దర్శకత్వంలో, దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఆమెకు భారీ గుర్తింపును అందించింది. 'సీత' పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల అభిమాన నటిగా మారింది. తర్వాత నాని తో 'హాయ్ నాన్న' వంటి చిత్రంతో మరో విజయాన్ని అందుకుంది. విజయ్ దేవరకొండతో చేసిన 'ఫ్యామిలీ స్టార్' ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా, మృణాల్ క్రేజ్ మాత్రం తగ్గలేదు.

Mrunal Thakur Calls Ranveer Singh Her Lucky Charm Ahead of Dacoit Release

ప్రస్తుతం మృణాల్ అడివి శేష్ నటిస్తున్న 'డెకాయిట్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 10న విడుదల కానున్న ఈ చిత్రం ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెంకటేష్ దగ్గుబాటి, సిద్దు జొన్నలగడ్డ వంటి స్టార్లు హాజరుకావడంతో సినిమాపై మరింత హైప్ ఏర్పడింది. తాజాగా పాడ్‌కాస్టర్ రణవీర్ అల్లాబాడియాతో జరిగిన ఇంటర్వ్యూ లో మృణాల్ తన కెరీర్ తొలినాళ్లలోని అనుభవాలను గుర్తుచేసుకున్నారు. 'నేను ఈ రోజు ఇండస్ట్రీలో ఉన్నానంటే దానికి కారణం రణవీర్ సింగ్. ఆయన నా లక్కీ చార్మ్' అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

తన కెరీర్ ఆరంభంలో రణ్‌వీర్‌తో కలిసి ఒక హెయిర్ బ్రాండ్ యాడ్‌లో నటించానని, ఆ యాడ్ విడుదలైన తర్వాతే దర్శకులు, నిర్మాతలు తనను గమనించడం ప్రారంభించారని చెప్పారు. 'ఆ క్రెడిట్ అంతా ఆయనకే చెందుతుంది. ఆయన చాలా పాజిటివ్ వ్యక్తి. నాకు ఎంతో సహాయం చేశారు' అంటూ రణ్‌వీర్‌పై ప్రశంసలు కురిపించారు. అలాగే.. రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 గురించి మాట్లాడుతూ, 'ఆ సినిమాలో నేను రణ్‌వీర్‌ను చూడలేదు. 'హమ్జా' అనే పాత్ర మాత్రమే కనిపించింది. అతని నటనలో చాలా బాగుంది' అని ప్రశంసించారు. ప్రస్తుతం ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది.

ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక చిన్న యాడ్‌తో ప్రారంభమైన కెరీర్, ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి చేరడం ఆమె కష్టానికి నిదర్శనమని కామెంట్స్ చేస్తున్నారు. ఇక 'డెకాయిట్' సినిమా విజయంతో ఆమె కెరీర్ మరో మెట్టు ఎక్కుతుందా అన్నది చూడాలి. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X