తెలుగు ఇండస్ట్రీకి మృణాల్ ఠాకూర్ గుడ్ బై.. ఆ స్టార్ హీరో సలహా ఏమిచ్చాడంటే?
హిందీ సినిమా నుంచి తెలుగు సినిమాలోకి వచ్చి ఎంతో పాపులారిటీ అందుకున్న హీరోయిన్స్ చాలా మందే కనిపిస్తారు. కాగా ఈ హీరోయిన్స్ లో ఇటీవల పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే ఒక హిందీ హీరోయిన్ లా కాకుండా మన తెలుగు నుంచి వచ్చిన హీరోయినే అనే రేంజ్ లో పేరు తెచ్చుకున్న బ్యూటీ మాత్రం ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా మృణాల్ ఠాకూర్ అని చెప్పవచ్చు.
హిందీలో పలు సీరియల్స్ స్మాల్ స్క్రీన్ పై పలు డ్రామాలు చేసుకునే తాను హిందీ సినిమాలో అందుకోని పెద్ద బ్రేక్ ని తెలుగులో తన మొదటి సినిమా తోనే అందుకోవడం విశేషం. కాగా ఇలా మృణాల్ ఠాకూర్ తెలుగులో ఒక్క సినిమా తోనే మంచి డిమాండ్ ని కూడా ఏర్పర్చుకుంది. కాగా ఇక్కడ నుంచి వరుస ఆఫర్స్ కూడా ఆమెని వరించాయి.

కానీ ఒక్క ప్లాప్ దెబ్బతో మాత్రం మృణాల్ మెంటల్ స్టేటస్ మొత్తం మారిపోయినట్టుగా టాక్ వచ్చింది. కాగా యువ హీరో విజయ్ దేవరకొండతో చేసిన ది ఫ్యామిలీ స్టార్ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది. ఈ తర్వాత మృణాల్ మళ్ళీ తెలుగులో సినిమా ఓకే చేసేందుకు ముందు రాలేదు. కాగా ఇక్కడితో తన పార్ట్ కి తెలుగులో ఎండ్ కూడా చేసేద్దాం అనుకుంది అని తెలిసింది.
కాగా ఈమెకి తెలుగు సినిమా విషయంలో భయం మొదటి సినిమా సీతారామం నుంచే స్టార్ట్ అయ్యిందట. ఆ సమయంలోనే తాను ఇక సినిమాలు చేయను అని హీరో దుల్కర్ కి చెప్పినపుడు అతను చిన్న చిరునవ్వు నవ్వి చూద్దాం అని చెప్పాడట. కాగా ఇపుడు మళ్ళీ ఈమె పరిస్థితి ఇలానే ఉండేసరికి ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ మాటలు మళ్ళీ గుర్తొచ్చినట్టు చెబుతుంది.
కాగా తాను తెలుగు సినిమాలు వదిలేద్దామని నిర్ణయించుకుంది కానీ దుల్కర్ సల్మాన్ మాటలు గుర్తొచ్చి ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్ సినిమాలు కూడా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా మృణాల్ అంటుంది. కాగా ఇపుడు మృణాల్ ఒక్క తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా తమిళ్ లో కూడా చేసేందుకు ఓపెన్ ఆఫర్ ఇచ్చింది అని చెప్పవచు. మరి చూడాలి మృణాల్ తమిళ్ లో కూడా ఏమన్నా ఆఫర్లు అందుకుంటుందో లేదో అనేది.
కాగా ఇపుడు మృణాల్ ఠాకూర్ తెలుగులోనే డెకాయిట్ సినిమాలో నటిస్తోండగా ఈ చిత్రంలో యువ హీరో అడివి శేష్ తో రొమాన్స్ చేయబోతుంది. ఇక ఈ సినిమా పక్కన పెడితే మృణాల్ తనకి మంచి ఆఫర్స్ ఉన్న సమయంలో పెద్దగా ఇంట్రస్ట్ చూపలేదు కానీ ఆ సమయంలో తనకి కేటాయించిన పాత్రలు సినిమాలు ఇతర హీరోయిన్స్ కి వెళ్లిపోయాయి.
కాగా ఇపుడు మృణాల్ ఆఫర్స్ కోసం ఎదురు చూస్తుంటే ఈమెకి సరైన అవకాశాలు కనిపించడం లేదట. ఇపుడు తెలుగు సినిమాలోనే పెద్దగా మృణాల్ కి అవకాశం లేదు మరి తమిళ్ లో కూడా నటించేందుకు ఓకే అంటుంది. మరి అక్కడ నుంచి అయినా ఆఫర్లు వస్తాయో లేదో చూడాలి మరి.


Click it and Unblock the Notifications











