పెళ్లి నిజమే.. ఎప్పుడంటే? మృణాల్ థాకూర్ క్లారిటీ.. ధనుష్‌తో మ్యారేజ్ రూమర్లపై..

సినీ ఇండస్ట్రీలో రూమర్స్ అనేవి కొత్త విషయం కాదు. ఇద్దరు నటీనటులు కలిసి ఒక ఈవెంట్‌లో కనిపించినా, కాస్త చనువుగా ఉన్నా.. సోషల్ మీడియాలో వెంటనే ప్రేమ, డేటింగ్, పెళ్లి అంటూ కథలు మొదలవుతుంటాయి. ఇదే పరిస్థితి తాజాగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) విషయంలోనూ కనిపించింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush)ను ఆమె పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా నెట్టింట హల్‌చల్ చేశాయి. కొందరైతే ఏకంగా ఏఐ (AI)జనరేటెడ్ వీడియోలుచేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ప్రచారం మరింత వైరల్‌గా మారింది.

ఈ నేపథ్యంలో హీరోయిన్ మృణాల్ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. ఓ ప్రముఖ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. తనకు పెళ్లి ఆలోచన ఉందని, కానీ అది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని చెప్పారు. 'అవును... పెళ్లి నా లైఫ్ ప్లాన్స్‌లో ఉంది. కానీ సరైన రోజు, సరైన సమయం, ముఖ్యంగా సరైన వ్యక్తి నా జీవితంలోకి వచ్చినప్పుడు.. ఆ విషయం ముందుగా నా సోషల్ మీడియా ద్వారానే నేనే ప్రకటిస్తాను'అని మృణాల్ స్పష్టం చేశారు. అంటే..సరైన వ్యక్తి కోసం సెర్చ్ చేస్తునట్టు పరోక్షంగా చెప్పారు.

Mrunal Thakur Clears Dhanush Wedding Rumours I ll Announce It Myself When the Right Person Comes

ఇదే సందర్భంగా నేటి తరం వివాహాలపై కూడా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ముందు కాలంలో కొన్ని కారణాలతో పెళ్లి చేసుకునేవారు. కానీ ఇప్పుడు జనాలు నిజమైన అనుబంధం ఉన్న వ్యక్తితోనే పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నారు. సమాజ ఒత్తిడి కంటే వ్యక్తిగత ఆనందానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు' అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ధనుష్‌తో పెళ్లి రూమర్లపై మృణాల్ ఘాటుగానే స్పందించారు. ఫిబ్రవరి 14న (వాలెంటైన్స్ డే) వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారన్న వార్తలపై ఆమె సరదాగా మాట్లాడుతూ ..'ఫిబ్రవరి 14 నాకు ఏప్రిల్ ఫూల్స్ డేలా అనిపిస్తోంది. నేను అలాంటి ప్రకటన ఎప్పుడూ చేయలేదు. అయినా 'మృణాల్ అలా చెప్పింది' అని రాశారు. ఇది నిజంగా భయంగా ఉంది' అని ఫన్నీ కామెంట్స్ చేశారు.

వాస్తవానికి మృణాల్-ధనుష్ మధ్య రిలేషన్‌పై ఎప్పుడూ అధికారిక ధృవీకరణ రాలేదు. కానీ గత ఏడాది వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందని రూమార్స్ క్రియేట్ అవుతున్నాయి. ముఖ్యంగా ధనుష్ సినిమా ర్యాప్ పార్టీకి మృణాల్ హాజరవ్వడం, అలాగే కొన్ని ఈవెంట్స్‌లో ఇద్దరూ కలిసి కనిపించడం వల్ల ఈ రూమర్లు మొదలయ్యాయి. ముఖ్యంగా ఒక ప్రీమియర్ ఈవెంట్‌లో మృణాల్ ధనుష్‌ను హగ్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది.

ఇక కెరీర్ విషయానికి వస్తే.. మృణాల్ త్వరలో రొమాంటిక్ డ్రామా 'దో దివానే షెహర్ మే'లో కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆమె జోడీగా సిద్దాంత్ చతుర్వేదీనటిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది రవి ఉద్యవార్ కాగా, సంజయ్ లీలా భన్సాలీ, జీ స్టూడియోస్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'ఇంపర్‌ఫెక్ట్‌గా పర్‌ఫెక్ట్ లవ్ స్టోరీ'గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదల కానుంది. ఇక చూడాలి.. 'సరైన వ్యక్తి దొరికితేనే పెళ్లి' అనే కామెంట్స్ తో ధనుష్‌తో పెళ్లి రూమర్లకు మృణాల్ ఫుల్ స్టాప్ పెట్టినట్టు కనిపిస్తోంది. అయితే.. ఈ రూమార్స్ కు ఇప్పటికైనా తెరపడుతాయో లేదో వేచి చూడాలి.

More from Filmibeat

Read more about: mrunal thakur dhanush movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X