నా షేప్‌లతోనే షేక్ చేస్తా అంటున్న మృణాల్ .. ఒకప్పుడు వణికిపోయేదట
ఒక్క నార్త్‌లోనే కాకుండా సౌతిండియన్ సినిమా దగ్గర కూడా మంచి ఫేమ్ ఉన్న హీరోయిన్స్ ఒకింత తక్కువే ఉంటారని చెప్పాలి. కెరీర్‌లో తొలుత హిందీ ఇండస్ట్రీలో పరిచయం అయ్యినప్పటికీ తెలుగులో వచ్చి సూపర్ సక్సెస్ అయ్యిన హిందీ బ్యూటీల లిస్ట్ తీస్తే ఈ మధ్యకాలంలో ఒక్క మృణాల్ ఠాకూర్ తప్ప మరో పేరు కనిపించదు. ఇలా మృణాల్ తెలుగులో అడుగు పెట్టిన మొదటి సినిమాతోనే స్టార్ అయ్యిపోయింది.
తన మార్క్ ప్రెజెన్స్ అందంతో "సీతారామం"లో తెలుగు ప్రేక్షకులను అలరించింది. అయితే ఇందులో ఎంతో హోమ్లీగా కనిపించినప్పటికీ మృణాల్ ఠాకూర్‌లో యువతని రెచ్చగొట్టే హాట్ షేడ్ కూడా ఉంది. ఆ సినిమా తర్వాత మృణాల్ ఇచ్చిన అందాల విందు కూడా అంతా ఇంతా కాదు. ఇలా మృణాల్ ఠాకూర్ తన సోషల్ మీడియాలో పెట్టె పలు హాట్ పిక్స్ ఇంటర్నెట్‌ని షేక్ చేస్తాయి.

అయితే తనపైనా బాడీ షేమింగ్ సహా పలు విమర్శలు లేకపోలేదు. మృణాల్ ఠాకూర్ స్కిన్, తన ఆకృతిపై చాలా కామెంట్స్ సోషల్ మీడియాలో గతంలో వచ్చాయి. కానీ నెమ్మదిగా దానినే మృణాల్ ప్లస్ గా మార్చేసుకుంది. మరి ఇటీవల ఆమె పాల్గొన్న పాడ్ కాస్ట్ నుంచి తన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇపుడు వైరల్ అవుతున్నాయి. తాను బ్యూటీ స్టాండర్డ్స్‌ని మారుస్తానని స్ట్రాంగ్‌గా చెబుతుంది.
అదెలా అంటే నా బాడీ కర్వ్స్ తోనే మారుస్తా అని చెబుతుంది. గతంలో నా బాడీ విషయంలో కొన్ని రకాల డ్రెస్‌లు వేసుకోవాలి అంటే చాలా భయపడేదాన్ని కానీ ఇపుడు దానినే ప్లస్‌గా చేసుకుంటున్నాను. ప్రతీ భారతీయ మహిళ ఇండియా రోడ్స్‌పై నడిచేటప్పుడు చాలా అందంగా మంచి ఆకృతితో కనిపిస్తారు. సో అలానే తాను కూడా తన షేప్స్ తోనే బ్యూటీ స్టాండర్డ్స్ ని మారుస్తానని బలంగా చెబుతుంది.

దీనితో తన అందాల విషయంలో చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడమే కాకుండా తన దమ్ము చూసి తన ఫ్యాన్స్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ ఏడాదిలో రెండు తెలుగు సినిమాలు ది ఫ్యామిలీ స్టార్‌లో హీరోయిన్‌గా కనిపించగా నెక్స్ట్ రెబల్ స్టార్ ప్రభాస్ భారీ చిత్రం కల్కి 2898 ఏడీలో చిన్న క్యామియో పాత్ర కూడా చేసింది.
ఇవి కాకుండా లేటెస్ట్‌గా యంగ్ హీరో అడివి శేష్ సరసన "డెకాయిట్"లో ఓ సీరియస్ రోల్‌లో మృణాల్ చాలా కాలం తర్వాత కనిపించబోతుంది. ఇదిలా ఉండగా తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా హిందీలో కూడా పలు సినిమాలలో మృణాల్ నటిస్తోంది. అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ఓ సినిమా చేస్తుంది అన్నట్టుగా ఫిలింనగర్ టాక్ వచ్చింది కానీ అవి నిజం కాదని తేలిపోయాయి.


Click it and Unblock the Notifications











