Janhvi Vs Mrunal: జాన్వీ కపూర్‌కి ఉన్నదేమిటి? నాకు లేనిదేమిటి? మృణాల్ థాకూర్ ఫైర్

సినిమా పరిశ్రమలో నెపోటిజం అనే పదం వివాదాల మధ్య నలుగుతూనే ఉంటున్నది. సినీ తారల పిల్లలకు ఇచ్చే అటెన్షన్ గురించి, నిర్మాతలు అందించే ప్రోత్సాహం గురించి ఇతర నటీనటులు, ఇతర సినీ వర్గాలు చేస్తున్న వాదన అప్పుడప్పుడు చర్చకు దారి తీస్తుంది. అయితే కొన్నాళ్లు దానిపై దృష్టి పెట్టి.. ఆ తర్వాత దానిని పట్టించుకోకుండా వదిలివేయడం పరిపాటిగానే మారింది. అయితే తాజాగా ఈ వాదనను స్టార్ హీరోయిన్ మృణాల్ థాకూర్ మరోసారి లేవనెత్తడం.. అది కూడా తన తోటి స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్‌ను ఉద్దేశించి కామెంట్స్ చేయడం ఈ సారి భారీ చర్చకే దారి తీసే పరిస్థితి ఏర్పడింది. అయితే నెపొటిజంపై మృణాల్ చేసిన కామెంట్స్ వివరాల్లోకి వెళితే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ, సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న AA22XA6 ఇండియాలో ప్రస్తుతం అత్యంత బజ్ ఉన్న ప్రాజెక్ట్‌గా సంచలనం క్రియేట్ చేస్తున్నది. ఈ సినిమాకు సంబంధించి బయటకు వస్తున్న అప్‌డేట్స్ సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెంచుతున్నాయి. ఈ సినిమాలో నటించే హీరోయిన్ల వ్యవహారం మరింతగా పాపులారిటీని, క్రేజ్ పెంచింది.

Mrunal Thakur comments on Nepotism

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వచ్చే సినిమాలో దీపిక పదుకోన్, జాన్వీ కపూర్, మృణాల్ థాకూర్, భాగ్య శ్రీ భోర్సేను తీసుకొంటున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే దీపిక పదుకోన్‌ను ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రకటిస్తూ అధికారికంగా ప్రకటించారు. అయితే ఇంకా ముగ్గురి పేర్లను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ క్రమంలోనే మృణాల్ చేసిన కామెంట్స్ మీడియాలో వైరల్ అయ్యాయి.

తాజాగా మృణాల్ థాకూర్ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. స్టార్ కిడ్స్ అంటే మీడియాకు ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. వారి గురించి ప్రత్యేకంగా అటెన్షన్, కవరేజ్ ఇస్తుంది. వారి గురించి రాయడంలో తప్పేమీ లేదు. కానీ మా లాంటి వాళ్లను చిన్న చూపు చూడటమే బాధ కలుగుతుంది. మా వద్ద లేనిది ఏమిటి? ఆమె వద్ద ఉన్నదేమిటి? అందుకే నెపొటిజం అనే చర్చ ఎప్పటికీ హైలెట్ అవుతూనే ఉంటుంది అని ఆమె అన్నారు.

ఇలా మృణాల్ థాకూర్ బాధపడటం వెనుక అసలు కారణం ఏమిటంటే? అల్లు అర్జున్, అట్లీ సినిమాలో మొదట ఆమె పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో మృణాల్ నటిస్తున్నదంటూ మీడియాలో వార్తలు అదరగొట్టేశాయి. మృణాల్‌కు మంచి కవరేజ్ వస్తుండగా.. ఈ సినిమాలో జాన్వీ కపూర్ కూడా నటిస్తున్నారంటూ మరో వార్త బయటకు వచ్చింది. దాంతో మృణాల్‌ను వదిలేసి జాన్వీని ఆకాశానికి ఎత్తేసింది. దాంతో మృణాల్ తనకు ప్రాధాన్యాన్ని తగ్గించి స్టార్ కిడ్‌కు మీడియా ఎక్కువగా అటెన్షన్ ఇస్తుందనే విషయాన్ని వెల్లడించారు.

ఇదిలా ఉండగా, ఇంటర్వ్యూలో మృణాల్ థాకూర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా.. అట్లీ సినిమాలో నటించే హీరోయిన్‌ పేరు ప్రకటించే సమయం వచ్చేసింది. దీపిక తర్వాత ఆమె పేరును అధికారికంగా టీమ్ వెల్లడిస్తుంది అనే విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది అని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X