ఆ క్రికెటర్ తో పిచ్చి ప్రేమలో మృణాల్ ఠాకూర్.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన సీత

సాధారణంగా పలువురు హీరోయిన్స్ అలాగే కొందరు స్టార్ క్రికెటర్స్ పై ప్రేమాయణం డేటింగ్స్ వంటివి మనం వింటూనే ఉంటాం. అయితే ఈ ట్రెండ్ అంతా ఎక్కువ నార్త్ సైడ్ బాలీవుడ్ నుంచే కనిపిస్తూ ఉంటుంది. క్రికెటర్స్ కూడా ఎక్కువ శాతం అటు నుంచే హీరోయిన్స్ కూడా ఎక్కువ అక్కడే ఉండడం వారికి కొన్ని రిలేషన్స్ ద్వారా కూడా లింక్స్ కలిసి ఉంటాయి.

దీనితో బి టౌన్ లో మాత్రం క్రికెటర్స్ హీరోయిన్స్ ప్రేమలు పెళ్లిళ్లు సర్వ సాధారణం అని చెప్పాలి. అలాగే కొందరు చూసుకుంటే క్రికెట్ రన్ మెషిన్ విరాట్ కోహ్లీతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక పాపా కూడా ఉంది. మరి వీరితో పాటుగా రీసెంట్ గానే బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే ఇంకా హార్డ్ హిట్టర్ హార్దిక్ పాండ్యతో డేటింగ్ లో ఉందని పాండ్య ఆమెకి ఖరీదైన కారు కూడా కొన్నాడని కొని రూమర్స్ బయటకి వచ్చాయి.

mrunal thakur deeply in lover with virat kohli here is what she said

అయితే ఇప్పుడు వీరి సరసన మరో స్టార్ బ్యూటీ కూడా చేరింది. అటు బాలీవుడ్ లోను ఇటు మన తెలుగులో కూడా బాగా పరిచయం ఉన్నటువంటువంటి మృణాల్ ఠాకూర్ కోసమే ఇప్పుడు బి టౌన్ లో చర్చగా మారింది. కాగా మృణాల్ అయితే ఒక స్టార్ క్రికెటర్ ని పిచ్చిగా ప్రేమించింది అట. రీసెంట్ గా ఆమె చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇంతకీ ఆమె ఎవరిని అంత గాఢంగా ప్రేమించింది అంటే మన ఇండియన్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీనే అట.

అయితే ఇదంతా ఇప్పుడు కాదు ఎప్పుడో అట. కొన్నేళ్ల కితం వరకు అయితే విరాట్ కోహ్లీ అంటే ఆమెకి పిచ్చి ప్రేమ అట. కోహ్లీ గేమ్ అయినా అతనన్నా చాలా ఇష్టం అని ఒకపుడు తనకి క్రికెట్ అంటే అసలు ఇష్టమే ఉండేది కాదు అని ఓ రోజు తన తమ్ముడు క్రికెట్ చూస్తున్న సమయంలో కోహ్లీ గేమ్ చూసి ఫ్యాన్ అయిపోయా అని అక్కడ నుంచి అతనంటే ఎంతో ఇష్టం ప్రేమ ఏర్పడిపోయాయి.

mrunal thakur deeply in lover with virat kohli here is what she said

అలా చాల ఏళ్ళు గడిచిపోయింది అని చెప్పింది. అయితే తనకి ఆ తర్వాత క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో "జెర్సీ" సినిమా ఆఫర్ వచ్చింది అని తెలిపింది. అయితే ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతుంటే మృణాల్ ఠాకూర్ షాకిచ్చింది. ఆ పోస్ట్ పెట్టిన సోషల్ మీడియా హ్యాండిల్ సీరియస్ గా రిప్లై ఇస్తూ "స్టాప్ ఇట్ ఓకే" అంటూ స్పందించింది.

దీనితో వారు ఆ పోస్ట్ ని డిలీట్ చేసేసారు. అయితే ఈ కామెంట్స్ ఎప్పుడో పాతవి కాగా ఇపుడు తన ఇమేజ్ కి డామేజ్ కాకుండా ఉండడానికి ఆమె జాగ్రత్త పడి రియాక్షన్ అయ్యింది దీనితో తన రియాక్షన్ కూడా ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X