మొత్తానికి మళ్ళీ మృణాల్.. హింటిస్తున్న సీతని ఒప్పించింది ఎవరు?
తెలుగు సినిమా దగ్గర ఓ హీరోయిన్ కి మంచి ఫేమ్ రావడం అనేది మామూలు విషయమే కానీ ఆ ఫేమ్ ని ఎంతవరకు నిలబెట్టుకున్నారు అనేది కూడా వారికి అంతే ముఖ్యం. కాగా ఇలా తెలుగు సినిమా దగ్గర చాలా మంది యువ హీరోయిన్స్ వచ్చేసారు కానీ వారిలో కొందరు మాత్రమే మంచి ఫేమ్ ని అందుకొని తన సినిమాలకి అంటూ మంచి క్రేజ్ ని సెట్ చేసుకోగలిగారు.
కాగా ఆ ఒక్క హీరోయిన్ మరెవరో కాదు బాలీవుడ్ నటి మన టాలీవుడ్ సీత మృణాల్ ఠాకూర్. మరి ఈ యంగ్ హీరోయిన్ టాలీవుడ్ లోకి హీరో దుల్కర్ సల్మాన్ తో కలిసి డెబ్యూ చేసినప్పటికీ ఆ ఒక్క సినిమాతోనే ఎనలేని ఫేమ్ ని తెచ్చుకుంది. ఎంతో హోమ్లీ లుక్ తో పరిచయం అయ్యిన మృణాల్ తన స్కిన్ షోతో కూడా మెస్మరైజ్ చేస్తుంది.

కాగా అక్కడ నుంచి తెలుగు సినిమాలో కొంచెం సెలెక్టెడ్ గానే సినిమాలు చేస్తున్న మృణాల్ కేవలం తన పాత్రలు గ్లామర్ కోసం మాత్రమే కాకుండా తనకి కూడా ఇంపార్టెన్స్ ఉంటేనే సినిమాలు చేస్తుంది. అలా చేసిన తన మొదటి రెండు సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. కానీ చేసిన మూడో సినిమా మాత్రం డిజాస్టర్ అయ్యింది.
యువ హీరో విజయ్ దేవరకొండతో చేసిన సినిమా "ది ఫ్యామిలీ స్టార్" మృణాల్ హిట్ స్ట్రీక్ కి బ్రేక్ వేసింది. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడదాం అనుకుంది కానీ అది కూడా డిజాస్టర్ అయ్యింది. కాగా ఈ తర్వాత వచ్చిన "కల్కి 2898 ఎడి" క్యామియోకి కూడా పెద్దగా గుర్తింపు రాలేదు దీనితో మృణాల్ మళ్ళీ బాలీవుడ్ లోకి వెళ్ళిపోవాలి అని డిసైడ్ అయినట్టుగా కూడా వార్తలొచ్చాయి.
అలాగే అపుడు నుంచి మళ్ళీ మృణాల్ కూడా టాలీవుడ్ సినిమాల పట్ల పెద్దగా స్పందించినట్టు కూడా కనిపించలేదు. దీనితో సీత తెలుగు సినిమాకి దూరం అయిపోయినట్టే అని చాలా మంది అనుకున్నారు కానీ ఇపుడు ఫైనల్ గా మృణాల్ నుంచి హింట్ వచ్చేసింది. మళ్ళీ ఆమె తెలుగులో ఓ సినిమా చేయనున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసింది.
రీసెంట్ గా తన ఎక్స్ లో చేసిన పోస్ట్ లో తెలుగు సినిమా కోసం ప్రశ్నలు ఎదురైతే అవును చేస్తున్నాను వెయిట్ చెయ్యండి అన్నట్టుగానే ఆమె సమాధానం ఇచ్చేసింది. దీనితో మృణాల్ మళ్ళీ టాలీవుడ్ లోకి వచ్చి బిజీగా మారబోతుంది అని చెప్పొచ్చు.
మరి ఇక్కడ మరో ప్రశ్న ఏమిటంటే తెలుగు సినిమాకి దూరం అయ్యిపోయింది అనుకున్న మృణాల్ ని ఒప్పించి మళ్ళీ తెలుగు సినిమాకి రప్పిస్తున్న ఆ దర్శకుడు ఎవరూ అనేది ప్రస్తుతానికి ఇంట్రెస్టింగ్ గా మారింది. అది ఎవరైనప్పటికీ మాత్రం మృణాల్ ఠాకూర్ తెలుగు ఫ్యాన్స్ కి మాత్రం ఇది గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. మరి చూడాలి ఈ అందాల భామ ఎవరితో ఏ సినిమా ఓకే చేసింది అనేది.


Click it and Unblock the Notifications











