Mrunal Thakur: ప్రభాస్‌తో రొమాన్స్.. గాసిప్స్‌పై స్పందించిన మృణాల్ ఠాకూర్!
ప్రెజెంట్ సౌత్ ఇండియా సహా హిందీ మార్కెట్ లో కూడా మంచి ఫేమ్ ఉన్న హీరోలు కొంచెం ఎక్కువ మందే ఉన్నారు కానీ ఈ రకంగా క్రేజ్ ఉన్న హీరోయిన్స్ మాత్రం అరుదే అని చెప్పాలి. అంతే కాకుండా హిందీ మార్కెట్ నుంచి వచ్చి తెలుగులో కూడా రాణించిన హీరోయిన్స్ అయితే మరీ తక్కువే.. కాగా ఆలా హిందీ మార్కెట్ నుంచి వచ్చి తెలుగు ఆడియెన్స్ మనసు దోచుకున్న హీరోయిన్ ప్రెజెంట్ జెనరేషన్ లో ఎవరైనా ఉన్నారు అంటే అది నటి మృణాల్ ఠాకూర్ అనే చెప్పాలి.
కాగా మృణాల్ ఠాకూర్ లేట్ గానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా హిట్స్ మాత్రం వెంటనే అందుకుంది. ముఖ్యంగా మన తెలుగు సినిమాలో వరుసగా బరి హిట్స్ రెండు కొట్టింది. దీనితో తెలుగులో సాలిడ్ క్రేజ్ ని మృణాల్ సొంతం చేసుకోగా గత కొన్ని రోజులు నుంచి అయితే మృణాల్ పై పలు క్రేజీ వార్తలు, గాసిప్స్ వైరల్ గా మారాయి. మొదటిగా మృణాల్ లవ్ మేటర్ కోసం ఒకటి బయటకి వస్తే వాటిని ఆమె సోషల్ మీడియాలో ఖండించింది.

కాగా ఇపుడు లేటెస్ట్ గా మరో బిగ్ ట్విస్ట్ ని ఇచ్చింది అని చెప్పాలి. గడిచిన కొన్ని వారాలు నుంచి మృణాల్ ఠాకూర్ తెలుగులో ఒక బిగ్గెస్ట్ ఆఫర్ ని సొంతం చేసుకుంది అని పలు రూమర్స్ గుప్పుమన్నాయి. మరి ఆ సినిమానే తనకి తెలుగులో డెబ్యూ ఇచ్చిన దర్శకుడు హను రాఘవాపుడి అలాగే పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో వార్తలు బయటకి వచ్చాయి.
దీనితో చాలా మంది ఇది నిజమే అని ఫిక్స్ కూడా అయిపోయారు. ఇక బాలీవుడ్ ట్రాకర్స్ అయితే ఇద్దరికీ కలిపి ఓ ఫస్ట్ లుక్ కూడా వచ్చేస్తుంది అని ఈ ఆగస్ట్ 17 నే అది కూడా అంటూ పలు రూమర్స్ స్ప్రెడ్ చేసారు. కానీ తీరా చూస్తే మృణాల్ ఠాకూర్ అందరికీ షాకిచ్చింది. తాను సమాధానం ఇస్తూ.. మీ వైబ్ ని కిల్ చేస్తున్నా నాకు తప్పడం లేదు కానీ నేను ఆ సినిమాలో భాగం కాదు అంటూ క్రేజీ రిప్లై ఇచ్చేసింది.
దీనితో ఇప్పుడు తన రిప్లై పెద్ద ట్విస్ట్ నే అందరికీ ఇచ్చింది అని చెప్పాలి. సో మొత్తానికి ఈ మాసివ్ ప్రాజెక్ట్ లో మృణాల్ లేదు అని అందరికీ దీనితో అర్ధం అయ్యిపోయింది. కాగా గత కొన్నాళ్ల కితమే మృణాల్ తెలుగులో పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే టాక్ ఉంది. కానీ ఇటీవల ప్రభాస్ చిత్రమే కల్కి 2898 ఎడి లో కనిపించింది. సో ఈ సినిమాలో నటించే ఛాన్స్ లు ఉన్నాయని చాలా మంది భావించారు.
కానీ అందరి ఆశలు మీద అయితే మృణాల్ ఇప్పుడు నీళ్లు చల్లింది అని చెప్పక తప్పదు. కాగా మృణాల్ తెలుగులో లాస్ట్ గా విజయ్ దేవరకొండతో "ది ఫ్యామిలీ స్టార్" లో కనిపించగా ఈ తర్వాత కల్కి లో చిన్న పాత్ర చేసింది. ఇప్పుడు అయితే మళ్ళీ బాలీవుడ్ లోనే మృణాల్ బిజీగా మారనున్నట్టుగా సమాచారం. మరి చూడాలి మృణాల్ మళ్ళీ తెలుగు సినిమా ఎప్పుడు ఒప్పుకుంటుంది ఏంటి అనేది.


Click it and Unblock the Notifications











