మత్తులో మృణాల్ ఠాకూర్? అసలేం జరిగింది.. ఆ వీడియో వైరల్

సినీ ఇండస్ట్రీ లోకి వచ్చిన ఆనతి కాలంలోనే మంచి గుర్తింపు అందుకొని మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకోవడం అనేది చాలా అరుదుగానే జరుగుతుంది. ఇది హీరోలు, హీరోయిన్స్ విషయంలో కూడా బాగా అప్లై అవుతుంది. కాగా హీరోయిన్స్ విషయానికి వస్తే ఏ కొత్త హీరోయిన్ అయినా కూడా తన మొదటి సినిమా సాలిడ్ ఎంట్రీ తోనే జరగాలని కోరుకుంటుంటారు. మరి విషయంలో అయితే కొంతమంది హీరోయిన్స్ తమ మొదటి సినిమా తోనే మంచి ఆదరణను, ప్రేక్షకుల్లో ఫేమ్ ని తెచ్చుకుంటారు.

అలా తెలుగు సినిమా నుంచి మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న యువ హీరోయిన్స్ లో మృణాల్ ఠాకూర్ కూడా ఒకరు అని చెప్పాలి. అవ్వడానికి హిందీ నటి అయినప్పటికీ నార్త్ లో సరైన గుర్తింపు రాలేదు. దీనితో తెలుగులో ఎంపిక చేసుకోవడమే అద్భుతమైన సబ్జెక్టు "సీతారామం" చేసి అపారమైన క్రేజ్ ని తెలుగు ఆడియెన్స్ లో సొంతం చేసుకొని అదరగొట్టింది.

mrunal thakur latest laughing video goes viral and rises doubts

మరి ఆ వెంటనే రెండో సినిమాగా నాచురల్ స్టార్ నానితో "హాయ్ నాన్న" చేసి మరోసారి షైన్ అయ్యింది. కానీ ఈ తర్వాత మాత్రం తెలుగులో మృణాల్ కి ఆ రేంజ్ సినిమాలు పడలేదనేది వాస్తవం. ఏదో అవుతుంది అనుకున్న ది ఫ్యామిలీ స్టార్ సినిమా డిజాస్టర్ అయ్యింది. దీని తర్వాత పాన్ ఇండియా సినిమా కల్కి 2898 ఎడి లో చిన్న పాత్రని ఆమె సొంతం చేసుకుంది.

కానీ స్పెషల్ గా ఆ రోల్ కోసం చెప్పుకోడానికి పెద్దగా ఏమి లేదు. ఇలా ఇపుడు మళ్ళీ బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్న ఈ హీరోయిన్ పై ఓ లేటెస్ట్ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కాగా ఆ వీడియోలో ఒక పుచ్చకాయ ముక్క తింటూ అలా నవ్వుతూనే కనిపిస్తూ ఉంది. అంటే ఒక మత్తులో ఉంటే కొందరు అలా ఆస్వాదిస్తూ నవ్వుతూనే ఉండిపోతారు కదా అలా మృణాల్ ఠాకూర్ ఆ వీడియో మొత్తం నవ్వుతూ ఏదేదో మాట్లాడుతూ కనిపించింది.

mrunal thakur latest laughing video goes viral and rises doubts

దీనితో ఈ వీడియో ఇప్పుడు నెటిజన్స్ లో వైరల్ గా మారింది. కాగా ఈ వీడియో చూసిన చాలా మంది అయితే మృణాల్ ఏదన్నా మత్తు పదార్థం గాని తీసుకుందా ఇలా ఆపకుండా నవ్వుతుంది అంటూ కామెంట్స్ చేసిన వారు కూడా లేకపోలేరు. దీనితో ఇలా మృణాల్ లేటెస్ట్ వీడియోతో మాత్రం కొంచెం తేడాగానే కనిపించడంతో వైరల్ గా మారింది.

కాగా ఇపుడు మృణాల్ బాలీవుడ్ లోనే పలు చిత్రాలు ఓకే చేయగా ఆ చిత్రాల్లో ఓ సినిమాకి టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల కూడా ఓ హీరోయిన్ గా చేయనుండదట. అదే శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ సినిమా కూడా అన్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ సినిమా వచ్చే ఏడాది మొదలు కానుంది. ఇక మృణాల్ ఠాకూర్ విషయానికి వస్తే ప్రస్తుతానికి ఇంకా తెలుగులో ఏ సినిమా కూడా ఓకే చేసినట్టుగా దాఖలాలు లేవు. మరి మళ్ళీ మృణాల్ తెలుగులో ఎప్పుడు సినిమా చేస్తుందో ఏంటో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X