twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను చాలా రొమాంటిక్.. మైనస్ 22 డిగ్రీల మంచులో కూడా.. గ్లామర్‌తో అదరగొట్టిన మృణాల్ థాకూర్!

    |

    మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, మృణాల్ థాకూర్, రష్మిక మందన్న నటించిన సీతారామం చిత్రం ఆగస్టు 5న రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ట్రైలర్‌ను ప్రసాద్ ఐమాక్స్ థియేటర్‌లో జూలై 25న రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మృణాల్ థాకూర్ మాట్లాడుతూ.. దర్శకుడు హను రాఘవపూడి జీనియస్. సీత పాత్ర గురించి చెప్పినప్పుడు నేను లవ్‌లో పడిపోయాను. సీత పాత్రనే మృణాల్‌ను వెతుక్కొంటూ వచ్చింది. షూటింగు సమయంలో అశ్వినీదత్ చూపించిన ప్రేమ మాటల్లో చెప్పలేను అని చెప్పింది. మృణాల్ థాకూర్ ఇంకా ఈ సినిమా విశేషాలను తెలియజేస్తూ..

    చాలా రొమాంటిక్‌గా ఉంటుంది

    చాలా రొమాంటిక్‌గా ఉంటుంది

    సీతా పాత్ర చాలా రొమాంటిక్‌గా ఉంటుంది. మంచి లక్షణాలు ఉన్న అమ్మాయి. ఇటీవల కాలంలో రొమాంటిక్ సినిమాలు ఎక్కువగా రావడం లేదు. సీతారామం మంచి రొమాంటిక్ ఫీల్ ఉన్న సినిమా. ఈ సినిమాలో మేము చేసిన రొమాన్స్ అందర్నీ ఆకట్టుకొంటుంది అని మృణాల్ థాకూర్ చెప్పింది.

    భాష అవసరం లేదు

    భాష అవసరం లేదు

    చిన్నతనంలో మా ఇంట్లో టెలివిజన్ చూడనిచ్చేవారు కాదు. టీవీ చూడాలంటే నేను మ్యూట్ చేసి చూసే దానిని. అప్పడు నాకు అర్దం అయిందేమిటంటే.. సినిమాల్లో కథ చెప్పడానికి భాష అవసరం లేదనిపించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో పనిచేయాలనే బలమైన కోరిక ఉండేది. హను రాఘవపూడి కథ చెప్పినప్పుడు సీత పాత్ర నన్ను ఆకట్టుకొన్నది. దుల్కర్ సల్మాన్ సినిమా అంటే ఎవరైనా ఎగిరి గంతెస్తారు. ప్రతిష్టాత్మకమైన బ్యానర్ కూడా ఈ సినిమా చేయడానికి ఒక కారణం. ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు సీతారామం సినిమాను ఎవరు కూడా రిజెక్ట్ చేయడానికి ధైర్యం చేయరు అని మృణాల్ థాకూర్ వెల్లడించింది.

    సూపర్ 30 మూవీ తర్వాత

    సూపర్ 30 మూవీ తర్వాత

    సీతారామం సినిమా చేస్తున్నానని డిసైడ్ అయిన తర్వాత తెలుగు నేర్చుకోవడం ప్రారంభించాను.నేను మాట్లాడే మరాఠీ భాషకు తెలుగు చాలా దగ్గరగా ఉంటుంది. దాంతో తెలుగు నేర్చుకొనే పనిలో పడ్డాను. అలాగే సూపర్ 30 మూవీ తర్వాత మళ్లీ కథక్ డ్యాన్స్ చేయడం నాకు థ్రిల్ అనిపించింది. బృందా మాస్టర్ చెప్పిన స్టెప్పులు వేస్తూ ఎక్సైట్ అయ్యాను. ఇప్పటి వరకు నా టాలెంట్‌ను నిరూపించుకోలేదన్న బాధ ఉండేది. ఈ సినిమా ద్వారా నా ప్రతిభను ప్రదర్శించుకొనే అవకాశం కలిగింది అని మృణాల్ పేర్కొన్నది.

    దుల్కర్ సల్మాన్ నాకు మనోధైర్యాన్ని

    దుల్కర్ సల్మాన్ నాకు మనోధైర్యాన్ని

    సీతారామం సినిమా ప్రారంభమైన తర్వాత ఈ పాత్రను నేను చేయలేనేమో అనే అనుమానం కలిగింది. ఇక సినిమాను వదిలేద్దామా అని ఓ దశలో అనుకొన్నాను. భాష మాట్లాడటం కష్టం కావడం. సీత లాంటి పాత్రను చేయడం కష్టమనిపించింది. ఆ సమయంలో దుల్కర్ సల్మాన్ నాకు మనోధైర్యాన్ని నింపాడు. నీవు మా సీతవు. ఈ పాత్రను నీవు తప్ప మరొకరు చేయలేరు. కావాలంటే కొంత సమయం తీసుకో. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలని దుల్కర్ చెప్పడంతో కాస్త ధైర్యం కలిగింది అని మృణాల్ తెలిపింది.

    మైనస్ 22 డిగ్రీల ఉష్ణోగ్రతలో

    మైనస్ 22 డిగ్రీల ఉష్ణోగ్రతలో

    సీతారామం సినిమాను పలు దేశాల్లో, పలు ప్రాంతాల్లో షూట్ చేశాం. మైనస్ 22 డిగ్రీల ఉష్ణోగ్రతలో షూట్ చేయాల్సి వచ్చింది. ఫిజి, రష్యా, కశ్మీర్, ఇంకా చాలా ప్రాంతాల్లో షూట్ చేశాం. చాలా సమయాల్లో నేను, దుల్కర్ డైలాగ్స్ నెమరు వేసుకొనే వాళ్లం. నేను బోర్డు ఎగ్జామ్ రాసినట్టు.. దుల్కర్ 10th క్లాస్ పరీక్షలు రాసినట్టు ఫీలయ్యాం అని మృణాల్ చమత్కరించింది.

    English summary
    Super 30 fame Mrunal Thakur's latest movie Sita Ramam. She revealed about her role at Trailer release event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X