Mrunal Thakur: సీతరామం బ్యూటికి బెదిరింపులు.. మెయిల్ హ్యాక్ చేసి మరి.. వీడియో వైరల్
ముద్దుగుమ్మ మృణాల్ ఠాకుర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. కేవలం ఒకే ఒక్క సినిమాతో చెరగని ముద్ర వేసుకుంది. నేటి తరం సీత ఎవరంటే మృణాల్ పేరు చెప్పేంతగా అభిమానం సంపాదించుకుది ఈ స్టన్నింగ్ బ్యూటి. చాలా డీసెంట్ గా లవ్ స్టోరీస్ తెరకెక్కించే డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహించిన సినిమా సీతా రామం. పేరుకు బెంగాలీ అమ్మాయి అయిన మృణాల్ ఠాకుర్ ఈ ఒక్క సినిమాతో తెలుగు హీరోయిన్ గా మారిపోయింది. సీతగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ చిన్నదానికి మెయిల్ హ్యాక్ చేసి బెదిరింపులు వస్తున్నట్లు తాజాగా ఓ వీడియో ద్వారా తెలియజేసింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఏముందనే విషయంలోకి వెళితే..

2012లో సీరియల్..
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది బ్యూటీలు హీరోయిన్లుగా తెరంగేట్రం చేస్తుంటారు. కానీ అందులో అతి కొద్దిమంది మాత్రమే మొదటి సినిమాతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంటారు. ప్రేక్షకుల్లో గుర్తిండిపోయే పాత్రలు చేస్తారు. అలాంటి వారిలో బాలీవుడ్ హాట్ బ్యూటి మృణాల్ ఠాకూర్ ఒకరు. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈ బెంగాలీ బ్యూటీ మొదట్లో బుల్లితెరపై సందడి చేసింది. 2012లో వచ్చిన 'ముజ్‌కే కుచ్ కెహతీ.. యే కామోషియాన్' అనే సీరియల్ తో ఎంట్రీ ఇచ్చింది.

కంటెంట్ ఉన్న చిత్రాల్లో..
బుల్లితెరపై ధారావాహికల్లో లీడ్ రోల్స్ చేస్తూ తన నటనతో ఆకట్టుకుంది ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. ఆ తర్వాత 'విట్టి దండు' అనే మరాఠీ సినిమాతో వెండితెరపై హీరోయిన్ గా సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టింది మృణాల్ ఠాకుర్. ఈ సినిమాతో అప్పట్లోనే తెగ పాపులర్ అయింది. సీరియల్ నటిగా గుర్తింపు పొందిన మృణాల్ ఠాకూర్ అనంతరం హిందీ చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. సూపర్ 30, జెర్సీ వంటి కంటెంట్ ఉన్న చిత్రాలతో ఎంతగానో అలరించింది బ్యూటిఫుల్ మృణాల్ ఠాకూర్.

నాని సినిమాలో..
బాలీవుడ్ చిత్రాల్లో తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది మృణాల్ ఠాకూర్. ఈ క్రమంలోనే మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన 'సీతా రామం' సినిమాతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో సీతగా తెలుగు రాష్ట్రాల ప్రజల మనసు దోచుకుంది ఈ చిన్నది. ప్రస్తుతం సూర్య 42వ చిత్రంలో, నాని 30వ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నట్లు టాక్.

మెయిల్ హ్యాక్ అయినట్లు..
ఇక ఇటీవల యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ నటిచిన సెల్ఫీ మూవీలో గెస్ట్ రోల్ చేసింది ముద్దుగుమ్మ మృణాల్ ఠాకుర్. ఇందులో స్పెషల్ సాంగ్ లో నర్తించి హాట్ షో చేసింది. ఇదిలా ఉంటే తన మెయిల్ హ్యాక్ అయినట్లు తాజాగా వీడియో షేర్ చేసింది. ఇటీవల మృణాల్ ఠాకుర్ వెకేషన్ కు వెళ్లింది. అక్కడ నుంచే ఓ వీడియోను రిలీజ్ చేసింది. తన మేనేజర్ ఫోన్ చేసిందని, తన ఈ మెయిల్ హ్యాక్ అయిందని ఆమె చెప్పినట్లుగా తెలిపింది. ఆ మెయిల్ లో తన వ్యక్తిగత వివరాలతో పాటు సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్స్, కాంట్రాక్ట్ వివరాలు అన్నీ అందులోనే ఉన్నట్లు, అలాంటి మెయిల్ హ్యాక్ గు గురైనట్లు, తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు, దానికి ఏం చేయాలో కాసేపు అర్థం కాలేదని చెప్పుకొచ్చింది గ్లామరస్ బ్యూటి మృణాల్ ఠాకుర్.

అకౌంట్స్ సెక్యూర్ చేస్తా..
అయితే ఆ వీడియో చూసినంత నిజంగానే మృణాల్ ఠాకుర్ ఇబ్బందుల్లో ఉందని భావించారు. కానీ తర్వాత ఈ సమస్య నుంచి బయట పడేందుకు రానా సహాయం చేశాడని అనడంతో అసలు విషయం అర్థం అయింది. "నా సమస్య గురించి రానా నాయుడుకు ఫోన్ చేశాను. రానా నాయుడు ఏం చేశాడో తెలియదు. కానీ మెయిల్ ఒక వీడియో ఉంది. అందులో సారీ మృణాల్. నీది, నీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరి అకౌంట్స్ సెక్యూర్ చేస్తాను అని చెప్పాడు. నాకు చాలా ఆశ్చర్యమేసింది. మీకు కూడా ఏదైనా సమస్య ఉంటే రానా నాయుడుని కలవండి" అని చెప్పుకొచ్చింది బ్యూటిఫుల్ మృణాల్ ఠాకుర్.
జాన్వీ కపూర్ కిడ్నాప్..
అదన్న మాట సంగతి. తనకు సమస్య ఉన్నట్లు చెప్పి, దాన్ని రానా నాయుడు సాల్వ్ చేశాడని చెప్పుకొచ్చిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకుర్ రానా నాయుడు వెబ్ సిరీస్ ప్రమోషన్ లో పాల్గొంది. అంతేకాకుండా నెట్ ఫ్లిక్స్ లో రానా నాయుడు స్ట్రీమింగ్ అవుతోంది. కచ్చితంగా చూడండి అని ఆ వీడియోలో పేర్కొంగి ఈ హాట్ భామ. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. కాగా.. వెంకటేష్, రానా తండ్రి కొడుకులుగా నటించిన రానా నాయుడు సిరీస్ కోసం జాన్వీ కపూర్ కిడ్నాప్ డ్రామాతో కూడా ప్రమోషన్స్ చేశారు.


Click it and Unblock the Notifications











