Mrunal Thakur: అందుకే అతడితో విడిపోయా.. బ్రేకప్‌పై మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి మృణాల్ ఠాకూర్(Mrunal Thakur). అయితే, గత కొంతకాలంగా తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. కొన్నాళ్లుగా ప్రేమ, డేటింగ్, పెళ్లి రూమర్స్‌తో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన మృణాల్, తాజాగా తన మాజీ ప్రేమికుడితో బ్రేకప్‌కు గల కారణాలను ఓపెన్‌గా వెల్లడించి మరోసారి వైరల్ అయ్యారు. ఇంతకీ ఏమైంది?

ఇటీవల మృణాల్, నటుడు ధనుష్ తో రిలేషన్‌లో ఉన్నారంటూ, ఇద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకోబోతున్నారంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన మృణాల్, తమ మధ్య స్నేహం తప్ప ఇంకేమీ లేదని స్పష్టంగా చెప్పేశారు.'ధనుష్ నాకు మంచి స్నేహితుడు మాత్రమే' అంటూ డేటింగ్, వివాహ ప్రచారాలకు పూర్తిగా చెక్ పెట్టారు.

Mrunal Thakur Opens Up on Breakup Shuts Down Dhanush Dating Rumours

ఆ ఇంటర్వ్యూలో మృణాల్ తన వ్యక్తిగత జీవితాన్ని తొలిసారిగా ఈ స్థాయిలో ఓపెన్‌గా మాట్లాడారు. గతంలో తాను ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నానని, అయితే సినిమాల్లోకి రావడం అతనికి అస్సలు నచ్చలేదని తెలిపారు. "నేను చాలా దూకుడుగా ఉంటానని, నాతో లైఫ్ కొనసాగించడం తనకు సాధ్యం కాదని చెప్పి అతడే బ్రేకప్ చెప్పాడు. నేను హీరోయిన్‌గా కెరీర్ ఎంచుకోవడం కూడా అతనికి నచ్చలేదు" అంటూ మృణాల్ వెల్లడించారు.

అయితే ఈ బ్రేకప్ తనను మానసికంగా కుంగదీయలేదని ఆమె స్పష్టం చేశారు. "బ్రేకప్ చెప్పినందుకు నేను బాధపడలేదు. కానీ అతని ఆలోచనా విధానం పట్ల మాత్రం జాలి వేసింది. అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తితో బంధం కొనసాగించడం చాలా కష్టం" అని అన్నారు. ఈ వ్యాఖ్యలు ఆమె ఆత్మవిశ్వాసాన్ని, జీవితంపై ఉన్న స్పష్టతను ప్రతిబింబిస్తున్నాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ఇంకా ముందుకు వెళ్లి, ఈ నిర్ణయం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకున్నదేనని మృణాల్ చెప్పారు.'ఇలాంటి మైండ్‌సెట్ ఉన్న వాళ్లతో ఉంటే, భవిష్యత్తులో పిల్లలు కూడా అదే ఆలోచనలతో పెరుగుతారు. అది నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే విడిపోవడమే మంచిదని అనిపించింది' అంటూ తన నిర్ణయానికి గల కారణాలను వివరించారు. ఈ మాటలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారి తీస్తున్నాయి.

ఇదిలా ఉండగా, కొన్నాళ్లుగా మృణాల్ పేరు క్రికెటర్ శ్రేయస్ అయ్యార్ తో కూడా లింక్ అయింది. ఈ రూమర్స్‌ను కూడా ఆమె పూర్తిగా కొట్టిపారేశారు.'ఇలాంటి వార్తలు వినడానికి కూడా హాస్యాస్పదంగా ఉంటాయి. ఇవన్నీ ఫ్రీ పీఆర్ స్టంట్స్ మాత్రమే. వాటిని చూసి నేను నవ్వుకుంటాను' అంటూ స్పందించారు.

ప్రొఫెషనల్‌గా చూస్తే, తెలుగులో సీతా రామం, హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాలతో మృణాల్‌కు మంచి క్రేజ్ ఏర్పడింది. అలాగే కల్కి 2898 AD లో చిన్న పాత్రలో కనిపించారు. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆమె, తాజా చిత్రం దో దీవానే శహర్ మే ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. మృణాల్ ఠాకూర్ చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి చర్చ మొదలయ్యేలా చేశాయి.

More from Filmibeat

Read more about: mrunal thakur dhanush tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X