ఆ స్టార్ హీరోని చూస్తే నా మాజీ ప్రియుడికి అలాంటి భయం.. సీక్రెట్ బయటపెట్టిన మృణాల్ థాకూర్
బాలీవుడ్,టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు తన తొలి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత హాయ్ నాన్న మూవీతో మరో హిట్టు అందుకుంది. ఆ తర్వాత ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గిపోయాయి. ఇదిలా ఉంటే.. కొన్ని రోజులుగా హీరో ధనుష్ తో మృణాల్ పెళ్లి అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభంలో తాను ఎదుర్కొన్న రిలేషన్‌షిప్ సవాళ్ల గురించి వెల్లడించారు. ఇంతకీ ఏమన్నారంటే?
ఇటీవల మృణాల్ ఠాకూర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కెరీర్ ప్రారంభంలో తన మాజీ ప్రియుడు ఎదుర్కొన్న అభద్రతా భావం (insecurity)తనను ఎంత ఆశ్చర్యానికి గురి చేసిందో వివరించారు. మృణాల్ కెరీర్‌లో కీలకమైన మలుపుగా నిలిచిన సూపర్ 30 సినిమా షూటింగ్ రోజులను గుర్తు చేసుకున్నారు. తన బాయ్‌ఫ్రెండ్ తీవ్ర అభద్రతా భావానికి గురయ్యాడని వెల్లడించారు.

'హృతిక్ లాంటి ఫిట్‌గా ఉండే, అందంగా కనిపించే వ్యక్తులతో నేను రోజూ షూటింగ్ చేస్తున్నానన్న విషయం అతడిని బాగా కలవరపెట్టింది. నన్ను ఎక్కడ కోల్పోతానో అన్న భయంతో తనను తాను నిరూపించుకోవాలని ప్రయత్నించాడు. జిమ్‌కు వెళ్లడం మొదలుపెట్టి ఏకంగా 15 నుంచి 17 కేజీలు తగ్గాడు. కండలు పెంచుకుని ఫిట్‌గా మారాడు' అని మృణాల్ చెప్పారు. అయితే ఈ మార్పు ఎక్కువ కాలం నిలవలేదట. కొన్నాళ్ల తర్వాత అతడు అకస్మాత్తుగా వ్యాయామం మానేసి విపరీతంగా తినడం మొదలుపెట్టాడని, ఫలితంగా మళ్లీ దాదాపు 20 కేజీలు పెరిగాడని తెలిపారు.
అతడి ప్రవర్తనలో వచ్చిన ఈ మార్పును చూసి తాను షాక్ అయ్యానని, 'ఏమైంది? ఎందుకు ఇలా చేస్తున్నావు?' అని అడిగితే... 'నీ చుట్టూ ఉన్న అందగాళ్లతో పోటీ పడుతూ అలసిపోయాను. అందుకే వదిలేశాను' అని అతడు నిరాశగా చెప్పాడట. ఈ ఘటన తనకు ఒక పెద్ద పాఠం నేర్పిందని మృణాల్ అన్నారు. అందం, ఫిట్‌నెస్ విషయంలో ఇతరులతో పోల్చుకోవడం ఎంతటి మానసిక ఒత్తిడికి దారి తీస్తుందో ఈ అనుభవం ద్వారానే అర్థమైందని పేర్కొన్నారు.
తాను ఎప్పుడూ అతడిని బరువు తగ్గమని లేదా మారమని అడగలేదని, కానీ తన చుట్టూ ఉన్న సినీ ప్రపంచమే అతడిలో అభద్రతా భావం పెంచిందని స్పష్టం చేశారు. ఇదే కాదు..ఇటీవల మరో ఇంటర్వ్యూలో కూడా మృణాల్ తన మాజీ బాయ్‌ఫ్రెండ్ గురించి మాట్లాడుతూ.. తాను నటిగా కొనసాగడం అతడికి నచ్చలేదని, అదే బ్రేకప్‌కు కారణమైందని వెల్లడించారు. 'ఎంత నిజాయతీగా ఉన్నా, ఎదుటివారి మనసులో భయాలు ఉంటే సంబంధం నిలబడదు' అని ఆమె వ్యాఖ్యానించారు.
ధనుష్‌తో పెళ్లి పుకార్లపై క్లారిటీ
ఇటీవలి కాలంలో మృణాల్ పేరు ధనుష్ తో కలిసి సోషల్ మీడియాలో వినిపించడంపై కూడా ఆమె స్పందించారు. ఫిబ్రవరి 14న పెళ్లి అంటూ వచ్చిన వార్తలను కొట్టిపారేస్తూ.. 'ఇవి ఏప్రిల్ ఫూల్స్ లాంటి రూమర్స్. నేను కానీ, ధనుష్ కానీ ఇలాంటి విషయాలు ఎప్పుడూ చెప్పలేదు. ఆన్‌లైన్ గాసిప్స్‌ను నమ్మొద్దు'అంటూ స్పష్టత ఇచ్చారు. అయితే.. ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరు అనే విషయం మాత్రం వెల్లడించలేదు. ఏదిఏమైనా ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ కామెంట్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











