మృణాల్ కు అవమానం.. జాన్వీ కపూర్ వల్లనే చిన్నతనం.. ఏమైందంటే?

స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు దక్కించుకున్న సంగతి తెలిసిందే. మారాఠి చిత్రాలతో హీరోయిన్ గా ఎదిగిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలీవుడ్ చిత్రాలతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. సూపర్ 30, జెర్సీ వంటి వంటి చిత్రాలతో హిందీలోనూ సెన్సేషనల్ హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత తెలుగులోకి అడుగుపెట్టింది. దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ 'సీతారమం'లో నూర్జహాన్ పాత్రలో మృణాల్ ఠాకూర్ ఇరగదీసింది. టాలీవుడ్ లో ఫస్ట్ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకర్షించింది.

సీతారామం తర్వాత మళ్లీ బాలీవుడ్ లో బిజీ అయినప్పటికీ కాస్తా గ్యాప్ తో తిరిగి టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. 'ది ఫ్యామిలీ స్టార్', 'హాయ్ నాన్న' వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. హాయ్ నాన్నతో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' చిత్రంలోనూ కీలక పాత్రలో మెరిసి ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఇప్పుడు మళ్లీ హిందీలో బిజీ అయ్యిపోయింది. ప్రస్తుతం తెలుగులోనూ రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రాల్లో అగ్ర హీరోలకు జోడీగా అవకాశాలను అందుకుంది.

Mrunal Thakur recalls his embarrassing moment at the awards ceremony

ఈ సందర్భంగా మృణాల్ ఠాకూర్ పేరు ప్రస్తుతం ఇండస్ట్రీలో మారుమోగుతోంది. ఇదంతా తన అభిమానులకు ఆనందించే వార్తనే అయినప్పటికీ తాజాగా తనకు సంబంధించిన ఓ ఇబ్బంది కరమైన విషయాన్ని రీసెంట్ ఇంటర్వ్యూలో వెల్లడించింది. మృణాల్ చెప్పిన మాటల ప్రకారం.. బాలీవుడ్ లో నెపో కిడ్స్ కు ఎక్కువ ప్రధాన్యత ఉంటుందని చెప్పినట్టు అక్కడి మీడియాల్లో వార్త వైరల్ గా మారింది. బాలీవుడ్ స్టార్ కిడ్స్ కు అక్కడి మీడియా కూడా అధికంగా ప్రాధాన్యత ఇస్తుంటారని చెప్పినట్టు తెలుస్తోంది.

అయితే.. రీసెంట్ గా మృణాల్ ఠాకూర్ ఓ చేధు అనుభవాన్ని పంచుకుంది. క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ విభాగంలో అవార్డులను అందుకున్న సందర్భంగా మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ ఓ వేడుకకు హాజరయ్యారు. అక్కడ మృణాల్ ఠాకూర్ ను మీడియా పలు ప్రశ్నలు వేస్తూ ఉండింది. అదే సమయంలో జాన్వీ కపూర్ కనిపించడంతో అందరూ ఆమెను వదిలివేసి వెళ్లారంట. దాంతో మృణాల్ కు అవమానకర సంఘటనను ఎదుర్కొందని చెబుతుంది. స్టార్ కిడ్స్ కు ఉండే ప్రాధాన్యత సాధారణ నటీనటులకు ఉండదని తన అభిప్రాయాన్ని వెల్లడించడం ఆసక్తికరంగా మారింది.

ఏదేమైనా మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ సన్నాఫ్ సర్దార్ 2, పూజా మేరీ జాన్, హే జవానీ థో ఇష్క్ హోనా హై, తుమ్ హో థో వంటి సినిమాలు చేస్తోంది. ఇక తెలుగులో 'డకాయిట్ : ఏ లవ్ స్టోరీ'లో నటిస్తూ బిజీగా ఉంది. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 22 - అట్లీ 6, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగ కాంబోలోని 'స్పిరిట్' చిత్రంలోనూ మృణాల్ ఠాకూర్ నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X