నీ బ్యాక్ కుండలా పెంచావ్.. కాస్త తగ్గించుకో.. ఆ మాటలకు కౌంటర్ ఇచ్చిన జెర్సీ హీరోయిన్
ఎంత అందంగా ఉన్నా ఏదో ఒక సందర్భంలో హీరోయిన్స్ నెగెటివ్ కామెంట్స్ అందుకుంటూనే ఉంటారు. పూర్తి స్థాయిలో అందరికీ నచ్చడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. అలాగే చిత్రపరిశ్రమలో మిగతా హీరోయిన్స్ కి పోటీగా గ్లామర్ ప్రజెంటేషన్ తో ఎప్పటికప్పుడు చాలా కొత్తగా కనిపిస్తూ ఉండాలి. అప్పుడే కెరీర్ కొన్నేళ్ల వరకు హ్యాపీగా కొనసాగుతోంది. ఇక అప్పుడప్పుడు నెగిటివ్ కామెంట్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఇక ఇటీవల జెర్సీ హీరోయిన్ ఎవరూ ఊహించని విధంగా కొన్ని నెగటివ్ కామెంట్స్ ను అందుకుంది. ఆమె శరీరాకృతి పై దారుణంగా కామెంట్స్ చేయగా అమ్మడు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా అదిరిపోయేలా కౌంటర్ అయితే ఇచ్చింది.

జెర్సీ హీరోయిన్
సినిమా ఇండస్ట్రీలో కొంతమంది సినీ తారలు సోషల్ మీడియాలోకి రావడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. అందుకు కారణం కొన్నిసార్లు నెగిటివ్ కామెంట్స్ వచ్చే పరిస్థితి ఎదురైతే వారు ఏ మాత్రం తట్టుకోలేరు. ఇక మరికొందరు మాత్రం కామెంట్స్ వస్తాయి అని తెలిసినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా సోషల్ మీడియాలో చాలా సందడిగా కనిపిస్తారు. ఇక అలాంటి వారిలో జెర్సీ హీరోయిన్ కూడా చాలాసార్లు నెగిటివ్ కామెంట్స్ ను ఎదుర్కొంది.

కమర్షియల్ సినిమాలను మాత్రమే కాకుండా
హిందీ జెర్సీ సినిమాలో నటించిన మృణాల్ ఠాకూర్ ఇటీవల కాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ గ్లామరస్ హీరోయిన్ గా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతోంది. ఈ బ్యూటీ ఎలాంటి సినిమా చేసినా కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఇక కేవలం కమర్షియల్ సినిమాలను మాత్రమే కాకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను కూడా సెలెక్ట్ చేసుకుంటోంది.

దారుణమైన ట్రోల్స్
జెర్సీ హిందీ రీమేక్‌లో షాహిద్ కపూర్ సరసన నటించిన అమ్మడు అలాగే దుల్కర్ సల్మాన్ మొదటి తెలుగు చిత్రం లెఫ్టినెంట్ రామ్‌లో కూడా నటిస్తోంది. ఇక ఇటీవల అమ్మడు ట్రోల్స్ కు గురవ్వడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ బ్యూటీ మరోసారి తన సహనాన్ని కోల్పోయింది. కానీ అదుపు తప్పి మాట్లాడకుండా చాలా క్లియర్ గా కౌంటర్ అయితే ఇచ్చింది.

బ్యాక్ ఒక కుండాలా ఉంది..
ఇటీవల, మృణాల్ ఠాకూర్ తన వర్కౌట్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇక ఆ తరువాత సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్ ద్వారా ఆమెను కొందరు నెటిజన్లు బాడీ షేమ్ చేసే విధంగా నెగిటివ్ కామెంట్స్ చేశారు. నీ బ్యాక్ ఒక కుండాలా ఉంది.. కాస్త తగ్గించుకో అని దారుణంగా కామెంట్స్ చేయడం జరిగింది.

నీ పని నువ్వు చూసుకో
ఇక మృణాల్ మాత్రం సహనాన్ని కొల్పయినప్పటికి చాలా తెలివిగా కౌంటర్ ఇచ్చింది. నెగిటివ్ కామెంట్స్ చేసిన వారిమి కూడా "ధన్యవాదాలు భయ్యా జీ" అని పేర్కొంది.
కొందరు ఎవరికి వారు సొంతంగా వారి గురించి ఆలోచించుకుంటారు. కొందరు అనవసరంగా వాళ్ల విషయలను పక్కన పెట్టి మరి సలహాలు ఇస్తారు. ముందు నీ పని నువ్వు చూసుకో అని అమ్మడు ఘాటైన రిప్లై ఇచ్చింది.

నా శరీరమే అంత..
మృణాల్ అక్కడితో ఆగకుండా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో నెగిటివ్ కామెంట్స్ చేసే వారి స్క్రీన్ షాట్స్ ను పోస్ట్ చేసింది. "నేను ఫిట్‌గా ఉండటానికి ఎంత కష్టపడుతున్నానో మీకు ఏమైనా ఆలోచన ఉందా? ఇది నా శరీర రకం. అది సహజమే. నేను నిజంగా ఏమీ చేయలేను. కాబట్టి, నేను చేయవలసిందల్లా నాలో నేను సంతోషంగా ఉండడం".. అంటూ మృణాల్ వివరణ ఇచ్చింది. ఇక ఈ బ్యూటీ రాబోయే సినిమాల విషయానికి వస్తే.. హిందీలో జెర్సీ, తెలుగులో లెఫ్టినెంట్ రామ్‌తో పాటు, మృణాల్ బాలీవుడ్ లో పిప్పా, గుమ్రా, ఆంఖ్ మిచోలీ వంటి చిత్రాలలో కూడా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











