ఆ హీరోపై పగతో రగిలిపోతోన్న మృణాల్ ఠాకూర్ .. ముఖంపై గాయాలతో షాకింగ్ పోస్ట్!

సీతారామం చిత్రంతో తెలుగు వారికి బాగా దగ్గరయ్యారు ముంబై ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. బుల్లితెర ద్వారా ఎంట్రీ ఇచ్చిన మృణాల్ తన కష్టంతో ఇక్కడి వరకు చేరుకున్నారు. హీరోయిన్‌గా ఎదగలేవంటూ అవమానాలు ఎదుర్కొని నేడు భారతీయ చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచారు. చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న మృణాల్.. గ్లామర్ పాత్రలతో పాటు కథాబలమున్న రోల్స్‌తో ఆకట్టుకుంటున్నారు. అలాంటి మృణాల్‌ను ఓ హీరో ఏడిపించాడు. ఈ వివరాల్లోకి వెళితే..

డిప్రెషన్‌లోకి మృణాల్
హిందీలో కుంకుమ రేఖ సీరియల్‌తో దేశవ్యాప్తంగా కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యారు మృణాల్. దాంతో సినిమాలలో అవకాశాల కోసం ప్రయత్నిస్తుండగా పలు అవమానాలు భరించినట్లు మృణాల్ పలు ఇంటర్వ్యూలలో తెలిపారు. బుల్లితెర నటిని అని అంతా చులకనగా చూసేవారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సూటిపోటి మాటల కారణంగా మృణాల్ పలుమార్లు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి ఆత్మహత్య ఆలోచనలు వచ్చినట్లు చెప్పారు. లోకల్ ట్రైన్‌లో నుంచి దూకేద్దామని అనుకున్నప్పటికీ తల్లిదండ్రులు గుర్తొచ్చి మనసు మార్చుకున్నట్లు తెలిపింది.

Mrunal Thakur shocking post from Adivi Sesh s Dacoit Movie Sets

సీతారామంతో పాపులర్
హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం, హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్ సినిమాల ద్వారా నటిగా మంచి మార్కులు కొట్టేశారు మృణాల్. కానీ ఆ తర్వాత తన ఫోకస్ పూర్తిగా బాలీవుడ్ పైనే పెట్టారు సీత. ప్రస్తుతం హిందీలో అజయ్ దేవగణ్ సరసన సన్ ఆఫ్ సర్దార్ 2తో పాటు హై జవానీ తో ఇష్క్ హోనా హై, తుమ్ హో తో, పూజా మేరి జాన్ సినిమాలలో మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. తెలుగులో అడివి శేష్ సరసన డెకాయిట్: ఏ లవ్ స్టోరీ, అల్లు అర్జున్ - అట్లీ ప్రాజెక్ట్స్‌ చేస్తున్నారు. ఈ చిత్రాలతో మృణాల్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది.

డెకాయిట్‌లో మృణాల్
సన్ ఆఫ్ సర్దార్ షూటింగ్, ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న మృణాల్ .. డెకాయిట్ షూటింగ్ కోసం హైదరాబాద్‌లో దిగారు. ఈ చిత్రానికి షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. తొలుత ఈ సినిమాలో అడివి శేష్ పక్కన హీరోయిన్‌గా కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్ ఎంపికయ్యారు. అయితే కొన్ని కారణాలతో ఆమె తప్పుకోవడంతో మృణాల్‌కు అదృష్టం వరించింది. అడివి శేష్‌కు, శృతికి మధ్య విభేదాలు రావడం వల్లే డెకాయిట్ నుంచి తప్పుకున్నట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ వార్తలు నిజం కాదని.. తనతో ఆమెకు సింగ్ కాకపోవడంతో పాటు రజనీకాంత్ గారి కూలీ సినిమాలో బిజీగా ఉండటం వల్లే శృతి ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగినట్లు శేష్ వెల్లడించారు.

శ్రీనిధిని ఆటపట్టించిన అడివి శేష్
ఇక సెట్‌లో అడివి శేష్ చాలా సరదాగా ఉంటారు. ఇటీవల హిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆ చిత్ర హీరోయిన్ శ్రీనిధి శెట్టిని ఆటపట్టించారు. షేక్ హ్యాండ్ ఇచ్చినట్లుగా ఇచ్చి నమస్కారం పెట్టడంతో శ్రీనిధి అవాక్కయ్యింది. పలుమార్లు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు శ్రీనిధి ప్రయత్నించినప్పటికీ శేష్ మాత్రం ఆటపట్టిస్తూనే ఉన్నాడు. అయితే హిట్ సక్సెస్‌మీట్‌లో నాని జోక్యం చేసుకుని శ్రీనిధి శెట్టికి అడివి శేష్‌తో షేక్ హ్యాండ్ ఇప్పించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ముఖంపై గాయాలతో మృణాల్
తాజాగా డెకాయిట్ సెట్‌లోనూ హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌ను అడివి శేష్ ఏడిపించినట్లుగా తెలుస్తోంది. సెట్‌లో తీసిన ఓ ఫోటోను మృణాల్ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశారు. ఇందులో ఆమె నుదిటిపై గాయాలు కనిపించాయి. ఆపై శేష్‌, మృణాల్‌లు వేలితో గాయాలు చూపిస్తూ ఉంటారు. దానికి సబ్‌కా బద్లా లేగీ జూలియట్ అనే క్యాప్షన్ పెట్టింది. అంటే జూలియట్ తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటుందని అర్ధం. బ్రేకప్ జరిగిన ప్రేమ జంట మధ్య నడిచే పగ, ప్రతీకారాలే ఇతివృత్తంగా ఈ సినిమా నడవనుంది. తాజాగా మృణాల్ ఫోటో, పోస్ట్ ప్రకారం జూలియట్ పాత్ర ఎంత బలంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. జూలియట్ ఎలా ప్రతీకారం తీర్చుకుంటుందోనని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Read more about: mrunal thakur adivi sesh dacoit
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X