Mrunal Thakur ఆ హీరోనే నాకు సర్వస్వం.. అతడు లేకపోతే నా లైఫ్.. మృణాళ్ థాకూర్
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న చిత్రం ది ఫ్యామిలీ స్టార్. డైరెక్టర్ పరశురామ్ పెట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. విజయ్ దేవరకొండ, మృణాళ్ థాకూర్ నటించిన ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అవుతున్నది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్‌లో మృణాల్ మాట్లాడుతూ..
నేను నటించిన హీరోలందరితో ఎలాంటి సమస్యలు రాలేదు. వారితో నటించినప్పుడు ఎలాంటి కష్టం అనిపించలేదు. నేను మంచి హీరోలతో కలిసి నటించే అదృష్టం రావడం హ్యాపీగా ఉంది. ది ఫ్యామిలీ స్టార్ కంటే ముందే సీతారామం ప్రమోషన్స్‌లో నేను విజయ్ దేవరకొండను కలిశాను. మిమిద్దరం ముందే కలవడం వల్ల షూటింగులో ఎలాంటి ఇబ్బందులు రాలేదు అని మృణాల్ సేన్ అన్నారు.

నాకు విజయ్ దేవరకొండ టఫ్ అనిపించలేదు. కానీ ఫ్యామిలీ స్టార్ సినిమాలో ఆయన పాత్ర గోవర్దన్ రావును డీల్ చేయడం చాలా టఫ్ అనిపించింది. అలాంటి పాత్రను నాకు ఇచ్చినందుకు దర్శకుడు పరుశురామ్‌కు ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను. ఫ్యామిలీ స్టార్‌లో మంచి పాత్ర నాకు రావడం అదృష్టంగా భావిస్తున్నాను మృణాల్ తెలిపింది.
నా కెరీర్ ఆరంభం నుంచి వండర్‌ఫుల్ హీరోలు ఉండటం చాలా సంతోషంగా ఉంది. హృతిక్, షాహిద్, ఫర్హాన్ అఖ్తర్, దుల్కర్ సల్మాన్, నాని గారు.. ఇప్పుడు విజయ్ దేవరకొండ నటించే అవకాశం రావడం లక్కీగా ఫీలవుతాను. నాకు భాష రాని సమయంలో హీరోలందరూ నాకు చాలా సపోర్ట్‌గా నిలిచారు. భవిష్యత్‌లో కూడా నేను మంచి హీరోలతో కలిసి నటించే అవకాశాలు రావాలని కోరుకొంటున్నాను అని ఆమె అన్నారు.

సీతారామం సినిమాలో నటించేటప్పుడు చాలా కష్టంగా అనిపించింది. ఆ సమయంలో రామ్ క్యారెక్టర్‌లో దుల్కర్ సల్మాన్ ఉండటం చాలా సపోర్టుగా ఉండింది. అప్పటికే దుల్కర్ వివిధ భాషల్లో నటించి ఉన్నారు. దాంతో నాకు నటించడం చాలా సులభమైంది. ఆయన నాకు ఇన్సిపిరేషన్, నా ఫస్ట్ కో-స్టార్. నా మెంటర్. నా ఫ్రెండ్ ఫ్రెండ్ అని మృణాల్ చెప్పారు.


Click it and Unblock the Notifications











