సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్? కాళ్లకు మెట్టెలతో షాకింగ్ పోస్ట్

ఇటీవల హీరోలు, హీరోయిన్లు సైలెంట్‌గా పెళ్లి చేసుకుని షాకిస్తున్నారు. ఉంగరాలు మార్చుకోవడమో, మెడలో తాళిబొట్టుతో ఫోటోలు విడుదల చేస్తున్నారు. ఎప్పుడు ఎవరు ఏ బాంబు పేలుస్తారో తెలియడం లేదు. తాజాగా స్టార్ హీరోయిన్ ఏకంగా కాలికి మెట్టలతో ఫోటోలు పోస్ట్ చేసి షాకిచ్చింది. దీంతో ఆమె సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా? ఆమె భర్త ఎవరు? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

సీతారామంతో ఫేమ్
హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్‌కు జోడీగా సీతగా కనిపించిన మృణాల్ ఠాకూర్ రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్ అయిపోయారు. తమకు అలాంటి అమ్మాయే భార్యగా కావాలని అభిమానులు కోరుకున్నారంటే అతిశయోక్తి కాదు. సీతారామం తర్వాత మృణాల్‌ ఎక్కడ కనిపించినా ఆమెను సీతగానే పిలుస్తున్నారు ప్రేక్షకులు.. టాలీవుడ్ టూ బాలీవుడ్‌లలో మృణాల్‌కు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.

Mrunal Thakur spark wedding rumours as they wearing dainty toe rings

మృణాల్ డైరీ ఫుల్
సీరియల్స్‌తో కెరీర్ ప్రారంభించిన మృణాల్ ఠాకూర్.. హిందీలో కుంకుమ రేఖ సినిమాతో దేశవ్యాప్తంగా కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. బుల్లితెర బ్యాక్‌గ్రౌండ్ కావడంతో తనను టీవీ నటి అని చులకనగా చూసేవారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కానీ పట్టుదలతో హీరోయిన్‌గా ఎదిగి టాప్ ప్లేస్‌కు చేరుకున్నారు మృణాల్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ డైరీ అస్సలు ఖాళీ లేదు. హిందీలో అజయ్ దేవగణ్ సరసన సన్ ఆఫ్ సర్దార్ 2తో పాటు హై జవానీ తో ఇష్క్ హోనా హై, తుమ్ హో తో, పూజా మేరి జాన్ సినిమాలు నటిస్తున్నారు. తెలుగులో అడివి శేష్ సరసన డెకాయిట్: ఏ లవ్ స్టోరీ, అల్లు అర్జున్ - అట్లీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్నారు. ఇవన్నీ భారీ బడ్జెట్ సినిమాలు కావడంతో ఆమె ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇవి కాకుండా మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి.

సుమంత్‌తో మృణాల్ డేటింగ్?
సీరియల్స్‌లో నటించే సమయంలో నటులు, రైటర్స్, సంగీత దర్శకులు, డైరెక్టర్లతో మృణాల్ డేటింగ్ చేస్తున్నట్లుగా పుకార్లు వచ్చేవి. వీటిపై పలుమార్లు ఘాటుగా స్పందించిన మృణాల్ తర్వాత పట్టించుకోవడం మానేసింది. పెళ్లి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అందరికీ చెబుతానంటూ మీడియాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అయితే అక్కినేని హీరో సుమంత్‌తో మృణాల్ ప్రేమలో పడ్డారని ఆయనను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. వీరిద్దరూ సోఫాలో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటో బయటికి రావడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. మృణాల్‌తో పెళ్లి వార్తలపై సుమంత్ స్పందించారు. ఆమెతో తనకు ఎలాంటి రిలేషన్ లేదని, ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో తీసుకున్న ఫోటోను పెట్టి లేనిపోని పుకార్లు సృష్టిస్తున్నారని సుమంత్ మండిపడ్డారు. మృణాల్‌ను తాను కలిసి చాలా కాలం అవుతోందన్నారు.

Take a Poll

కాళ్లకు మెట్టెలతో మృణాల్
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే మృణాల్ ఠాకూర్ తన సినిమాలు, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటో చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. అందులో మృణాల్ కాళ్లకు మెట్టెలు ఉండటంతో ఆమె సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారా? మృణాల్ భర్త ఎవరు? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పటి వరకు సన్ ఆఫ్ సర్దార్ షూటింగ్‌, ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న మృణాల్ ప్రస్తుతం అడివి శేష్ హీరోగా నటిస్తోన్న డెకాయిట్ షూటింగ్ కోసం హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మృణాల్ ఫోటో పెట్టారు. అన్నట్లు.. డెకాయిట్‌కు షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. తొలుత ఈ సినిమాలో హీరోయిన్‌గా శృతిహాసన్ ఎంపికయ్యారు. కొన్ని కారణాలతో ఆమె తప్పుకోవడంతో మృణాల్‌కు అదృష్టం వరించింది.

More from Filmibeat

Read more about: mrunal thakur sumanth dacoit
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X