Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నాకు మెంటర్ ఎవరూ లేరు.. ఇక నుంచి అతనే.. మృణాల్ థాకూర్ ఎమోషనల్
సీతారామం థ్యాంక్యూ మీట్లో మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. సీతారామం సినిమా తర్వాత ప్రేక్షకుల కురిపించిన ప్రేమకు నేను లెటర్ రాశాను. సీతారామం విజయం మాటల్లో చెప్పలేని గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. సినిమాని ఇంత గొప్ప ఆదరించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమాలో నాతో పనిచేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. సినిమా రిలీజ్ తర్వాత సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు చదువుతూ ఆనందంలో మునిగిపోయాను.
సీత లాంటి ఐకానిక్ పాత్ర ఇచ్చిన దర్శకుడు హను గారికి, వైజయంతి మూవీస్, స్వప్న సినిమా, అశ్వనిదత్, స్వప్న, ప్రియాంక అందరికీ హృదయపూర్వం కృతజ్ఞతలు. మృణాల్ సీత పాత్రను ఎంచుకోలేదు. మృణాల్‌ను సీత వెతుక్కొంటూ వచ్చింది. అశ్వినిదత్ గారు నా మార్గదర్శి. దుల్కర్ లాంటి గ్రేట్ కోస్టార్ లేకుండా ఈ జర్నీ జరిగేది కాదు. దుల్కర్ కి బిగ్ థాంక్స్. సీతారామం యునిక్ కి, ప్రేక్షకులకు మరోసారి పెద్ద థాంక్స్ అని అన్నారు.
సీతారామం సినిమా షూటింగులో నాకు మంచి సహకారం అందించారు. నాకు ఇప్పటి వరకు ఎవరూ మెంటర్ లేరు. నా మెంటర్ అశ్వినీదత్ అని గర్వంగా చెప్పుకొంటున్నాను అని మృణాల్ అన్నారు.
రామ్ పాత్రలో దుల్కర్ లేకపోతే ఈ సినిమా అంత గొప్పగా ఉండేది కాదు. రొమాంటిక్ సినిమాలు మళ్లీ బ్యాక్‌కు వచ్చాయి అని అన్నారు.