మృణాల్ ఠాకూర్ ఒక్కో డ్రెస్ రేట్ ఎంతో తెలుసా? ఎంత ఖర్చో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే?
ప్రెజెంట్ ఉన్న జెనరేషన్ లో సౌత్ నుంచి నార్త్ వరకు మంచి ఫేమ్ అండ్ పాపులార్టీ ఉన్న హీరోయిన్స్ నెమ్మదిగా పెరుగుతూ వస్తున్నారని చెప్పాలి. ఒక పక్క తెలుగులోనే కాకుండా హిందీ మార్కెట్ లో కూడా తమ పాగా వేసి ఆకట్టుకుంటున్న హీరోయిన్స్ లో మన టాలీవుడ్ సీత మృణాల్ ఠాకూర్ కూడా ఒకామె.. కాగా మృణాల్ హిందీ అమ్మాయి అయినప్పటికీ తనకి కెరీర్ పరంగా లైఫ్ ఇచ్చింది మన తెలుగు సినిమానే..
మరి ఎంతోమంది హీరోయిన్స్ కి లైఫ్ ఇచ్చిన తెలుగు సినిమా ఈమెకి కూడా లైఫ్ ఇచ్చినప్పటికీ మిగతా హీరోయిన్స్ లా కాకుండా మృణాల్ ఇప్పటికీ సింపుల్ గానే ఉండేందుకు ఇష్టపడుతుంది. రీసెంట్ గానే భారీ చిత్రం "కల్కి 2898 ఎడి" లో కూడా కనిపించింది. అయితే జెనరల్ గా హీరోయిన్స్ అనే కాదు ఆడవాళ్లు అంటేనే షాపింగ్, షాపింగ్ అంటే ఆడవాళ్లు అంటారు అంతా.

ఒకసారి షాపింగ్ కి వెళ్లారు అంటే వేలకి వేలు డబ్బులు ఖర్చు అవ్వాల్సిందే. సాధారణ ఆడవాళ్లే బట్టలకి ఈరోజుల్లో మినిమమ్ 5 వేలు వరకు పెడుతూ ఉంటారు. ఇక మంచి స్టార్ స్టేటస్ ఉన్న హీరోయిన్స్ అయితే తమని అందంగా చూపించే డ్రెస్సెస్ కోసం వేలల్లో ఏంటి లక్షల వరకు కూడా ఖర్చు పెట్టేందుకు వెనుకాడరు. కానీ మృణాల్ మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధం అట.
ఆమె తన బట్టల కోసం ఎంత ఖర్చు పెడుతుందో తెలిస్తే ఒక్క సామాన్య మహిళే కాదు తన తోటి హీరోయిన్స్ కూడా అవాక్కవల్సిందే. మరి ఇంతకీ మృణాల్ తన బట్టల కోసం ఎంత ఖర్చు పెడుతుందో తెలుసా? అది ఎంతంటే అక్షరాలా రెండు వేల రూపాయలట. అవును ఈమె తన బట్టలకి కేవలం 2000 మాత్రమే పెడుతుందట. అయితే దీనికి ఆమె దగ్గర ఓ వివరణ కూడా ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

మృణాల్ తనకి మామూలు సమయాల్లో ఎంత సాధ్యం అయితే అంత వరకు చాలా సింపుల్ గానే ఉండాలి ఇంకా తనకి బట్టలపై ఎక్కువ ఖర్చు పెట్టడం కూడా అనవసరం అనుకుంటుందట. అందుకే తన డ్రెస్ లు కొనేటప్పుడు 2 వేలకి మించి ఖర్చు పెట్టను అని తెలిపిందట. ఇది మాత్రం ఒకింత ఆశ్చర్యకరమే అని చెప్పాలి. ఇంత స్టార్ స్టేటస్ ఉండి కూడా మృణాల్ ఇంత సింపుల్ గా ఉండేందుకు ఇష్టపడడం చూస్తే ఆమెలోని జాగ్రత్తదనం ఎంతుందో అర్ధం చేసుకోవచ్చు..
కాగా ఇపుడు మృణాల్ బాలీవుడ్ లోకి మళ్ళీ షిఫ్ట్ అవుతుండగా తెలుగులో అయితే పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా ఓకే చేసినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మళ్ళీ సీతారామం తర్వాత దర్శకుడు హను రాఘవపూడితో ఈమె కలిసి వర్క్ చేయనుంది. ఈ సినిమా అనౌన్సమెంట్ ఈ సెప్టెంబర్ లో అలా రావచ్చని టాక్. ఇది కూడా ఒక పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కుతుంది అని సమాచారం.


Click it and Unblock the Notifications











