జారుతున్న డ్రెస్సులో సీతా రామం బ్యూటి.. మళ్లీ అవే కనిపించేలా హాట్ షో!
సీతారామం సినిమా ఎంత పెద్ద క్లాసిక్ హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన బెంగాలీ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సీతగా ముద్ర వేసుకుంది. తెలుగులో మొదటి సినిమాతోనే విపరీతమైన అభిమానులను సంపాదించుకుంది. ఇక ఇందులో సీతగా మృణాల్ ఠాకూర్ ను తప్ప వేరే హీరోయిన్ ను ఊహించుకోలేనంత స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటోస్ తో యూత్ కు మరో ట్రీట్ ఇస్తుంటుంది. తాజాగా అలాంటి కొన్ని పిక్స్ వదిలింది.

లీడ్ రోల్స్ చేస్తూ..
బాలీవుడ్ బ్యూటి మృణాల్ ఠాకూర్ మొదట్లో సీరియళ్ల ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. 2021లో 'ముజ్‌కే కుచ్ కెహతీ.. యే కామోషియాన్' అనే సీరియల్ ద్వారా తెరగేంట్రం చేసింది. అక్కడ ధారావాహికల్లో లీడ్ రోల్స్ చేస్తూ తన నటనతో ఆకట్టుకుంది ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. సీరియల్స్ ద్వారా ఎంతో పాపులర్ అయిన స్టన్నింగ్ బ్యూటి మృణాల్ వరుసగా సినీ అవకాశాలు అందుకుంది.

అప్పట్లోనే అలా..
సీరియళ్ల ద్వారా చాలా ఫేమస్ అయిన గ్లామరస్ డాల్ మృణాల్ ఠాకూర్ కు వెండితెరపై నటించేందుకు ఆఫర్లు క్యూ కట్టాయి. అందులో భాగంగానే 'విట్టి దండు' అనే మరాఠీ చిత్రంలో అవకాశం అందుకుంది. ఈ సినిమాతో హీరోయిన్ గా వెండితెరపై డెబ్యూ చేసింది ఈ చిన్నది. ఈ సినిమాతో సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టిన బ్యూటిఫుల్ మృణాల్ ఠాకుర్ అప్పట్లోనే తెగ పాపులర్ అయిపోయింది.

అందుకు ప్రశంసలు..
అనంతరం మరాఠీలోనే సురాజ్య అనే సినిమా చేసింది హాట్ భామ మృణాల్ ఠాకూర్. తర్వాత తన నటనతో మెప్పించిన ఈ సుందరి హిందీ చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టింది. సూపర్ 30, జెర్సీ వంటి స్టోరీ ఒరియెంటెడ్ చిత్రాలలో నటించి ఆకట్టుకుంది ఈ అమ్మడు. బాలీవుడ్ సినిమాల్లో కూడా తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది గ్లామరస్ బ్యూటి మృణాల్ ఠాకూర్.

ఎన్నో చిత్రాలతో..
బ్యూటిఫుల్ సీత అయిన మృణాల్ ఠాకూర్ హిందీలో లవ్ సోనియా, బాట్లా హౌజ్, ఘోస్ట్ స్టోరీస్, తూఫాన్, ధమాకా, రాధా, తదం వంటి మూవీస్ చేసి అలరిచింది. ఈ క్రమంలోనే తెలుగులో సీతా రామం సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఇందులో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా చేయడంతో పాటు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

స్టార్ హీరోల సరసన..
హను రాఘవపూడి దర్శకత్వం వహించిన 'సీతా రామం' సినిమాతో తెలుగులోకి హీరోయిన్‌గానే కాకుండా మంచి నటిగా ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాకూర్. దీంతో ఆమెకు మంచి ఎంట్రీ సొంతమైంది. ఫలితంగా ఈ ముద్దుగుమ్మకు స్టార్ హీరోల సరసన నటించే అవకాశం లభించింది. ఈ బ్యూటి సూర్య 42వ చిత్రంలో, నాని 30వ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటూ..
అంతేకాకుండా ఆంఖ్ మిచోలి అనే సినిమాలో నటిస్తున్న స్టన్నింగ్ బ్యూటి మృణాల్ ఠాకూర్ గుమర్హా సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ యంగ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ నటించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ పోలీస్ ఆఫీసర్ గా కనువిందు చేయనుంది. ఇక సినిమాలే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది ఈ గ్లామరస్ బ్యూటి.
కిందకు జారుతున్న డ్రెస్సులో..
సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతూ హైలెట్ అవుతుంటుంది మృణాల్ ఠాకూర్. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేసే ఫొటోలను ఈ భామ ఎక్కువగా వదులుతుంటుంది. తాజాగా మెరూన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లాంగ్ ఫ్రాక్ లో ఫొటోలు షేర్ చేసింది. కిందకు జారుతున్నట్లుగా కనిపించే ఈ డ్రెస్సులో ఎప్పటిలానే తన ఎద అందాలు కనిపించేలా పోజులిచ్చింది. దీంతో ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











