Mrunal Thakur విజయ్ దేవరకొండతో రొమాన్స్‌కు మృణాల్ థాకూర్.. భారీ బడ్జెట్‌తో దిల్ రాజు
యువ హీరో విజయ్ దేవరకొండ, సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మృణాళ్ థాకూర్ జంటగా దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో కొత్త సినిమా ప్రారంభమైంది. గీతా గోవిందం, సర్కారు వారీ పాట చిత్రాలతో విజయాలు అందుకొన్న పరుశురాం దర్శకత్వం ఈ సినిమాకు వహిస్తున్నారు. ఈ సినిమాకు దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా, వాసువర్మ క్రియేటివ్ నిర్మాతగా వ్యవహరిస్తారు. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ఆరంభించారు. ఈ సినిమా ఓపెనింగ్ వివరాల్లోకి వెళితే..
విజయ్ దేవరకొండ కెరీర్‌లో 13వ చిత్రంగా రూపొందుతున్న VD13 ప్రారంభోత్సవానికి ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ఫైనాన్షియర్ సత్తి రంగయ్య, విజయ్ దేవరకొండ తండ్రి గోవర్దన్ రావు దేవరకొండ తదితరులు హాజరయ్యారు. ఈ సినిమా ప్రారంభ వేడుకలో విజయ్ దేవరకొండ, మృణాల్ థాకూర్‌పై తొలి షాట్‌కు శ్యాంప్రసాద్ రెడ్డి క్లాప్ కొట్టారు. తొలి సన్నివేశానికి విజయ్ దేవరకొండ తండ్రి గోవర్దన్ రావు దేవరకొండ దర్శకత్వం వహించారు.

సీతారామంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మృణాళ్ థాకూర్ తొలిసారి విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్నారు. ప్రేమ కథా చిత్రంగా ఎమోషనల్ కంటెంట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో మృణాల్ థాకూర్ కీలక పాత్రలో ఫెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న రోల్‌లో నటిస్తున్నట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్‌కు చెందిన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో తొలిసారి నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సాంకేతిక నిపుణులు, నటీనటుల వివరాలను అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు.

నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ థాకూర తదితరులు
సినిమాటోగ్రఫి: కేయూ మోహనన్
మ్యూజిక్: గోపిసుందర్
ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాశ్
ఎడిటర్: మార్తండ్ కే వెంకటేష్
క్రియేటివ్ ప్రొడ్యూసర్: వాసు వర్మ
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్
దర్శకత్వం, రచన: పరుశురాం పేట్లా
పీఆర్వో: వంశీ కాక, జీఎస్‌కే మీడియా


Click it and Unblock the Notifications











