Mrunal Thakur: ఆ టాప్ హీరోలపై కన్నేసిన మృణాల్ ఠాకూర్

టాలీవుడ్ సినిమా చాలా మంది నార్త్ బ్యూటీస్ కి మంచి లైఫ్ ని ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. కాగా తెలుగులో ఎంతోమంది హిందీ హీరోయిన్స్ వచ్చి సెటిల్ అయ్యిపోయారు. ఇలా ఇటీవల టాలీవుడ్ లో పాగా వేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్. బాలీవుడ్ లో చిన్న చిన్న సీరియల్స్ చేసుకునే ఈ యంగ్ హీరోయిన్ అక్కడ బిగ్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చినప్పటికీ తన బిగ్ స్క్రీన్ మీద బ్రేక్ ఇచ్చింది మాత్రం మన తెలుగు సినిమానే.

తాను చేసిన మొట్ట మొదటి తెలుగు సినిమా "సీతారామం"తో తెలుగు ఆడియెన్స్ ఆమెని తెలుగమ్మాయి లానే తమ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిపోయారు. ఇలా మృణాల్ ఠాకూర్ తెలుగు సినిమాలో అడుగు పెట్టిన కొన్నేళ్ల లోనే టాప్ హీరోయిన్ రేంజ్ లో ఫేమ్ తెచ్చేసుకుంది. ఇక అక్కడ నుంచి కేవలం మూడు సినిమాల్లోనే కనిపిస్తే అందులో ఒకటి తన క్యామియోగా మాత్రమే వచ్చింది.

mrunal thakur wants to act with this telugu super stars

కాగా ఇలా తెలుగులో ఉన్న కొన్ని ఏళ్ళు ఫుల్ బిజీ అయ్యింది కానీ ది ఫామిలీ స్టార్ ప్లాప్ తో నెమ్మదించింది. మళ్ళీ హిందీ సినిమాకి వెళ్ళిపోతుంది. తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు అనే సమయంలో మరో సినిమా అనౌన్స్ చేసింది. ఇక అక్కడ నుంచి ఏదొక అంశంలో హైలైట్ అవుతూ వస్తున్న మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ గా చేసిన పలు కామెంట్స్ సోషల్ మీడియాలో అటెన్షన్ తెచ్చుకున్నాయి.

కాగా మృణాల్ తో తెలుగులో నాచురల్ స్టార్ నాని, విజయ్ దేవరకొండలు నటిస్తే.. ఈమె తెలుగు నుంచి ఎవరితో స్క్రీన్ షేర్ చేసుకోడానికి ఆరాటపడుతుందో చెబుతుంది. కాగా తెలుగులో ఈమెకి మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ తో అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లతో నటించాలని చాలా ఆశగా ఉన్నట్టుగా ఇటీవల ఓ ఈవెంట్ లో చెప్పుకొచ్చింది.

mrunal thakur wants to act with this telugu super stars

దీనితో తన కామెంట్స్ ఇపుడు ఇరు హీరోల నడుమ వైరల్ గా మారాయి. మరి అలాంటి టాప్ స్టార్స్ తో మృణాల్ అనే సౌండింగ్ బాగానే ఉంది కానీ ఎంత వరకు సాధ్యం అవుతుంది అనేది చూడాలి. తారక్ తో సెట్ అయ్యినా అవ్వొచ్చు కానీ పవన్ తో మాత్రం తన కల నెరవేరే ఛాన్స్ లు తక్కువే అని చెప్పక తప్పదు. మరి ఇలా ఇద్దరు టాప్ హీరోస్ మీద మనసు పారేసుకున్న మృణాల్ కోరిక తీరుతుందో లేదో కాలమే నిర్ణయించాలి.

ఇక ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ తెలుగులో యంగ్ హీరో అడివి శేష్ సరసన క్రేజీ థ్రిల్లర్ డెకాయిట్ లో నటిస్తుంది. ఇది మినహా తెలుగులో మరో సినిమా కమిట్ కానట్టే సినీ వర్గాల్లో టాక్. మరి మృణాల్ వరుస సినిమాలు తెలుగులో చేయాలని తన ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి మృణాల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చూడాల్సిందే.

More from Filmibeat

Read more about: mrunal thakur pawan kalyan jr ntr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X